సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఆదివారం 21,679 మందికి కరోనా పరీక్షలు చేయగా 274 మందికి పాజిటివ్ వచ్చింది. పాజిటివిటీ 1.26 శాతంగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు కరోనా బులెటిన్ విడుదల చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏకంగా 212 మంది కరోనా బారినపడ్డారు. మొత్తంగా రాష్ట్రంలో కరోనా కేసులు 6,82,489కు చేరుకుంది.
ఒక రోజులో 227 మంది కరోనా నుంచి కోలుకోగా ఇప్పటివరకు 6.74 లక్షల మంది కోలుకున్నారు. ఒక రోజులో కరోనాతో ఒకరు చనిపోగా, ఇప్పటి వరకు 4,030 మంది మృతిచెందారు. కాగా, ఆదివారం ముప్పులేని దేశాల నుంచి వచ్చిన వారిలో ఐదుగురికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు శ్రీనివాసరావు తెలిపారు. దీంతో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 84కు చేరుకుంది.
ఒక రోజులో ఒమిక్రాన్ నుంచి ఐదుగురు కోలుకోగా, ఇప్పటివరకు 32 మంది రికవరీ అయ్యారు. రాష్ట్రంలో ఒక రోజులో ముప్పున్న దేశాల నుంచి 163 మంది రాగా 14 మందికి సాధారణ కరోనా నిర్ధారణైంది. వారి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. మొత్తం 30 జీనోమ్ సీక్వెన్సింగ్ ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment