సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థులకు సాంకేతిక విద్యా బోధన అందించేందుకు దేశంలోనే తొలిసారిగా ఫస్ట్ ఇన్‌క్లూజివ్ డిజిటల్ ఫెస్టివల్ నిర్వహిస్తుందని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు అన్నారు. పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు సకల సౌకర్యాలతో డిజిటల్ విద్యను అందిస్తున్నట్టు చెప్పారు.
రాష్ట్ర సమగ్ర శిక్ష, రూరల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్ (ఆర్‌డీటీ అనంతపురం) సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం అనంతపురం ఆర్‌డీటీ ఆడిటోరియంలో జరిగిన ‘ఫస్ట్ ఇన్‌క్లూజివ్ డిజిటల్ ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమలోని ఆరు జిల్లాల (అనంతపురం, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, కడప) నుంచి 300 మంది దివ్యాంగ, సాధారణ విద్యార్థులతో కలిపి విజువల్ కోడింగ్, ఆక్సిస్బల్ కోడింగ్, రోబోటిక్, వెబ్ డిజైన్, యానిమేషన్ గేమ్స్ డెవలప్‌మెంట్ వంటి 100 డిజిటల్ నైపుణ్యాల ప్రాజెక్టులను ప్రదర్శించి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు సాధించడం అభినందనీయమన్నారు.
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ వీసీ ప్రొఫె సర్ ఎం.రామకృష్ణారెడ్డి, ఆర్‌డీటీ డైరెక్టర్ దశరథ్, చక్షుమతి ఫౌండేషన్ ప్రతినిధి రామ్‌కమల్, సైబర్ స్క్వేర్ సీఈవో ఎన్.పి.హరిష్, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు ఏపీ ప్రతినిధి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment