సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సోమవారం 6,408 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 14 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8.41 లక్షలకు చేరింది. ఒక్కరోజులో కరోనా నుంచి 12 మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 8.37 లక్షలకు చేరింది.
ప్రస్తుతం 64 మంది ఐసోలేషన్ లేదా చికిత్స పొందుతున్నట్లు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు వెల్లడించారు. కాగా, రాష్ట్రంలో సోమవారం 1,857 మందికి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చారు.అందులో బూస్టర్ డోసు 1,448 మందికి వేయగా, రెండోడోసు 237 మంది, మొదటి డోసు 172 మందికి వేసినట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment