
సాక్షి, హైదరాబాద్/గాంధీఆస్పత్రి: దేశంలోకి మంకీపాక్స్ ప్రవేశించడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వ్యాధి వ్యాప్తిని నివారించడానికి అవసరమైన అన్ని చర్యలూ చేపట్టాలని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి.శ్రీనివాసరావు శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ఆయన వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలను అన్ని జిల్లాల వైద్యాధికారులకు, ప్రభుత్వ ఆసుపత్రులకు పంపారు.
మంకీపాక్స్ పరీక్షించడానికి దేశంలో 15 ప్రయోగశాలలకు కేంద్రం అనుమతించగా అందులో రాష్ట్రంలోని గాంధీ ఆస్పత్రి ప్రయోగశాలను గుర్తించిందన్నారు. మంకీపాక్స్‌పై 90302 27324కు వాట్సాప్ ద్వారా సమాచారాన్ని పంపించవచ్చని, నేరుగా మాట్లాడాలనుకునేవారు 040– 24651119 నెంబరుకు ఫోన్ చేయాలని శ్రీనివాసరావు తెలిపారు. గాంధీలో మంకీపాక్స్ పరీక్షలు రెండు రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment