
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంగళవారం 36,570 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 153 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,74,845కు చేరింది. ఈమేరకు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు కరోనా బులెటిన్ విడుదల చేశారు. కరోనాతో ఒక్కరోజులో ఇద్దరు మరణించగా, రాష్ట్రంలో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 3,984కి చేరిందని తెలిపారు. ఒక్కరోజు వ్యవధిలో 157 మంది కోలుకోగా, మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 6,67,328కి చేరిందని వెల్లడించారు.