![Mock drill in hospitals on 10th and 11th - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/7/srinivas.jpg.webp?itok=19gC3gp1)
సాక్షి, హైదరాబాద్: దేశ విదేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ఆసుపత్రుల్లో కోవిడ్ మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10, 11 తేదీల్లో కోవిడ్ నియంత్రణ ఏర్పాట్లపై పరిశీలన చేసే నిమిత్తం మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు గురువారం ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు.
వార్డుల్లో పడకలు, ఆక్సిజన్ వసతి, ఐసీయూలు, టెస్టింగ్ కిట్ల నిల్వ, మందులు వంటి వాటిపై ఈ డ్రిల్ ఉంటుంది. అన్ని రకాల వసతులు ఉన్నాయో లేదో మాక్ డ్రిల్‌లో పరిశీలించి, ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నట్లు గుర్తిస్తే వాటిని సరిదిద్దుతారు. కావాల్సిన సదుపాయాలు సమకూర్చుతారు. మిషన్లు, పరికరాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ప్లాంట్లు తదితర వాటి పనితీరును పరిశీలిస్తారు. మాక్ డ్రిల్ కోసం ప్రతి జిల్లాకు ఒక నోడల్‌ఆఫీసర్‌ను నియమిస్తారు.
మాక్ డ్రిల్‌లో ఏం చేస్తారంటే..
అన్ని ఆసుపత్రుల్లో ఐసోలేషన్, ఆక్సిజన్, ఐసీయూ బెడ్లతో పాటు వెంటిలేటర్లు ఎన్ని ఉన్నాయి అనేది తనిఖీ చేస్తారు. దీంతో పాటు ఆయా ఆసుపత్రులు, అనుబంధ కేంద్రాల్లో డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్, ఆశాలు, అంగన్‌వాడీలు ఎంత మంది ఉన్నా రు? అనే వివరాలు సేకరిస్తారు.
కరోనా నియంత్రణకు శిక్షణ కలిగిన సిబ్బంది ఉన్నారా? లేదా? అనే వివరాలను కూడా సంబంధిత అధికారుల నుంచి అడిగి తెలుసుకుంటారు. దీంతోపాటు అంబులెన్స్‌లు ఎన్ని ఉన్నాయి? వాటి పరిస్థితిఎలా ఉంది? అనే అంశాలను తనిఖీ చేస్తారు. కాగా, మాక్‌డ్రిల్ నివేదికను జిల్లా వైద్యాధికారులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమో దు చేయాలని శ్రీనివాసరావు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment