సాక్షి, హైదరాబాద్: నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్‌లో దారుణం చోటుచేసకుంది. చిన్న పిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్ వికటించడంతో ఫైజల్ అనే చిన్నారి మృతి చెందారు. మరో 15 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన చిన్నారులు ప్రస్తుతం నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారికి వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం వైద్యులు 70 మందికి పైగా చిన్నారులకు వ్యాక్సిన్ ఇచ్చారు. వ్యాక్సిన్ తర్వాత ఇచ్చే ట్యాబ్లెట్స్ మారడంతో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది.
ఆ తర్వాత చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని నగరంలోని వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం నిలోఫర్‌లో 15 మంది చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు. చిన్నారుల ఆరోగ్యంపై వారి తల్లిదండ్రుల తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పిల్లలకు అనుభవం లేని నర్సులు వ్యాక్సినేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment