Urban Health Centres
-
Adilabad: అవార్డులు అందని ద్రాక్షేనా?
ఈ చిత్రంలో కనిపిస్తోంది బజార్హత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. చూడటానికి భవనం ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకు తగ్గట్టే నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కాయకల్ప అవార్డు వరుసగా మూడు సంవత్సరాలు అందుకుంది. నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్స్ అవార్డు కూడా దక్కింది. అయితే ఈసారి మాత్రం ఈ అవార్డుకు పోటీ పడటంలో వెనుకబడింది. దీనికి ప్రహరీ నిర్మాణం లేకపోవడం, స్వచ్ఛభారత్‌లో కొన్ని అంశాల్లో వెనుకబడడంతో ఈ పరిస్థితి ఉంది. ఈ చిత్రంలో కనిపిస్తోంది తలమడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ఆవరణలో ఈ ఫ్లోరింగ్ మొత్తం పగిలిపోయి ఉంది. భవనంలో విద్యుత్ వైరింగ్ సరిగ్గా లేదు. 1956లో ఈ పీహెచ్సీ ఏర్పాటు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రమాణాలు మెరుగుపర్చే చర్యలు ఎక్కడా కనిపించడం లేదు. అలా జరిగితేనే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి ఆస్పత్రులకు నిధులు వస్తాయి. మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడతాయి. సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అవార్డులను అందుకోవడంలో వెనుకంజలో ఉన్నాయి. ప్రమాణాలను అందుకోలేక పోతున్నాయి. ఒకవేళ వసతులను మె రుగుపర్చుకుంటూపోతే అధిక పాయింట్స్ సాధించడం ద్వారా ప్రత్యేక నిధులు పొందే అవకాశం ఉంటుంది. కాయకల్ప ప్రమాణాలు అందుకుంటే రూ. 2లక్షల నిధులు ఇవ్వనున్నారు. వీటి ఆధారంగా మ రిన్ని వసతులు మెరుగుపర్చుకొని జాతీయ ప్రమాణాలు అందుకుంటే నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్స్ అవార్డు అందుకుంటాయి. మూడేళ్లపాటు ఒక్కో సంవత్సరం రూ.3 లక్షలు అందుతాయి. కొన్నింటికే అవార్డులు.. జిల్లా ఆస్పత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలను విడివిడిగా పరిగణలోకి తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా ప్రమాణాలను అంచనా వేసి అవార్డులు ఇస్తున్నాయి. జిల్లాలో మొత్తం 22 పీహెచ్‌సీలు, 5 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. 5 పీహెచ్‌సీలు, 2 అర్బన్ హెల్త్ సెంటర్లు మాత్రమే కాయకల్పకు మొదట ఎంపికై ఆ తర్వాత ప్రమాణాలను దాటుకుని నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్స్‌ను అందుకోవడం ద్వారా వరుసగా మూడేళ్లు రూ.3 లక్షల చొప్పున అందుకున్నాయి. అయితే బజార్హత్నూర్ పీహెచ్‌సీకి సంబంధించి ప్రహరీ నిర్మాణం లేకపోవడం, స్వచ్ఛభారత్ అంశాల్లో పాయింట్లు తగ్గడంతో మరోసారి జాతీయ అవార్డు వస్తుందో? రాదోనని అక్కడి జెడ్పీటీసీ మల్లెపూల నర్సయ్య ఇటీవల జెడ్పీ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా జిల్లాలోని మిగితా ఆరోగ్య కేంద్రాలు ఈ ప్రమాణాలను అందుకునేందుకు పోటీ పడకపోవడం చోద్యంగా కనిపిస్తోంది. ఆస్పత్రిలో లైటింగ్, వెయిటింగ్, బాహ్య, అంతర్గత నిర్వహణ సరిగ్గా ఉండాలి. రోగులకు సురక్షితమైన వాతావరణం కల్పించాలి. విధులు సక్రమంగా నిర్వహించాలి వంటి అంశాలు ప్రమాణాలుగా ఉన్నాయి. ప్రధానంగా ఆస్పత్రి స్వరూపం ఆకర్షణీయంగా ఉండాలి. ఆ పరిసరాల్లో పశువుల సంచారం లేకుండా చూడాలి. గార్డెనింగ్ నిర్వహణ చేయాలి. ఆవరణ పరిశుభ్రంగా ఉండాలి. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశాలు ఆస్పత్రిలో సరైన సదుపాయాలు లేవని జెడ్పీ సమావేశంలో ప్రస్తావనకు తీసుకురావడం పట్ల ఎమ్మెల్యేలు ఆక్షేపణ వ్యక్తం చేశారు. ప్రధానంగా ప్రతి పీహెచ్సీలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశాలు నిరంతరంగా నిర్వహిస్తే అక్కడే సమస్యలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఈ పదిహేను రోజుల్లో అన్ని పీహెచ్‌సీల సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని, స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించడం జరుగుతుందని, తద్వారా సదుపాయాలు మెరుగవుతాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాయకల్ప ప్రమాణాల్లో వెనుకంజ బజార్హత్నూర్ పీహెచ్‌సీకి వరుసగా మూడేళ్లపాటు కాయకల్ప అవార్డు దక్కింది. ఈసారి పాయింట్స్‌లో వెనుకబడింది. ప్రహరీ నిర్మాణం లేకపోవడం, అక్కడ ఆక్రమణలు చోటు చేసుకోవడం, ఇతరత్రా అంశాల పరంగా సరైన పాయింట్స్ రాలేదు. ఈ సమస్యలను పరిష్కరించడంలో యంత్రాంగం విఫలమవుతోంది. – మల్లెపూల నర్సయ్య, జెడ్పీటీసీ, బజార్హత్నూర్ జాతీయ ప్రమాణాలు అందుకునేందుకు కృషి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వసతులు మెరుగుపర్చడం ద్వారా కాయకల్ప అవార్డుతో పాటు జాతీయ ప్రమాణాలు కూడా అందుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. జిల్లాలో ఇప్పటికే ఏడు ఆస్పత్రులకు జాతీయ అవార్డు అందడం జరిగింది. – నరేందర్ రాథోడ్, డీఎంహెచ్ఓ, ఆదిలాబాద్ -
వైద్య సేవకు ‘కమీషన్’
పల్లెల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అందించినట్టే పట్టణాల్లో సైతం సాధారణ జబ్బులకు వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో అర్బన్ హెల్త్ సెంటర్స్ (యూహెచ్‌సీలు) వైద్యం మాట ఎలా ఉన్నా నిర్వహణ పేరుతో గత ప్రభుత్వ పాలకులు ప్రైవేట్ అపోలో సంస్థకు దోచి పెట్టేలా అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ రూపంలో అప్పటి టీడీపీ పెద్దలు భారీగా కమీషన్లు దోచుకున్నారు. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న సిబ్బందితో పాటు, వైద్య శాఖాధికారులు వ్యతిరేకించినా కమీషన్లకు కక్కుర్తి పడి నాటి టీడీపీ ప్రభుత్వం బలవంతంగా వీటిని కార్పొరేట్ సంస్థ అయిన అపోలోకి అప్పగించింది. నాటి నుంచి దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. తాజాగా కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో ఈ దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపడుతోంది. సాక్షి, నెల్లూరు: పట్టణ ఆరోగ్య కేంద్రాలను 2000 సంవత్సరంలో ప్రారంభించారు. జిల్లా కేంద్రమైన నెల్లూరులో 8, కావలిలో 3 గూడూరులో 1 వంతున ఆస్పత్రులను ఏర్పాటు చేశారు. ఇటీవల వెంకటగిరిలో మరో పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో మొత్తం జిల్లాలో 13 కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిని మొదట్లో ఏజెన్సీలు నిర్వహించేవి. సిబ్బంది వెంగళరావు నగర్లో ఖాళీగా ఉన్న పట్టణ ఆరోగ్యకేంద్రం మొత్తం వైద్య, ఆరోగ్యశాఖ అధీనంలో ఉండేవారు. 2016లో అపోలో యాజమాన్యం కిందకు.. నాటి టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో ఉన్న పట్టణ కేంద్రాలను అపోలో కార్పొరేట్ వైద్యశాలకు, ధనుష్ సంస్థకు అప్పగించింది. అందులో నెల్లూరు జిల్లాలో ఉన్న 13 ఆరోగ్య కేంద్రాలు అపోలో యాజమాన్యం కిందకు వచ్చాయి. ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న సిబ్బంది వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వం లెక్క చేయకుండా అపోలోకి అప్పగించింది. దోపిడీకి స్కెచ్ అపోలో సంస్థకు అప్పగిస్తే నాణ్యమైన వైద్య సేవలందుతాయని టీడీపీ ప్రభుత్వం నమ్మబలికింది. కొన్ని రకాల రక్త పరీక్షలు చేస్తారని, సూపర్ స్పెషాలిటీ డాక్టర్ టెలీ మెడిసిన్ పద్ధతిలో పర్యవేక్షిస్తారని చెప్పింది. నాణ్యమైన వైద్య సేవల పేరుతో దోపిడీకి స్కెచ్ వేసింది. అంతకు ముందు ఆస్పత్రి నిర్వహణకు నెలకు కేవలం రూ.70 వేలు మాత్రమే ఇచ్చేవారు. అదే అపోలోకి అప్పగించగానే నెలకు రూ.4.30 లక్షలకు పెంచేశారు. ఈ డబ్బంతా అపోలో ఆస్పత్రి యాజమాన్యానికి చెందుతోంది. ఇందులో ఒక్కో ఆస్పత్రి నుంచి నెలకు రూ.ఒక్క లక్ష చొప్పున నాటి టీడీపీ పాలకులకు కమీషన్ల రూపంలో దండుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. అంటే నెలకు ఒక్క నెల్లూరు జిల్లా నుంచి రూ.13 లక్షలు సంవత్సరానికి రూ.1.56 కోట్లు కమీషన్లు టీడీపీ నేత విమర్శలు వచ్చాయి. ఒక్క జిల్లాలోనే ఈ పరిస్థితి ఉంటే ఇక 110 మున్సిపాలిటీల్లో ఎలా ఎంత దండుకున్నారో అర్థమవుతోంది. జీతం బెత్తెడు.. చాకిరీ బారెడు అపోలో యాజమాన్యం కిందకు ఆరోగ్య కేంద్రాలు రాగానే వాచ్మెన్ సూపర్వైజర్ను తొలగించారు. ఒక్క ల్యాబ్ టెక్నీషియన్‌ను నియమించారు. ఒక్క ఆస్పత్రిలో ఇద్దరు ఏఎన్ఎంలు, సీఓ, డాక్టర్, ల్యాబ్ టెక్నీషియన్, స్వీపర్ మాత్రమే ఉండేటట్లు చేశారు. సిబ్బందికి కనీసం జీతం పెంచలేదు. పలు రకాల రికార్డులు రాయిస్తూ గొడ్డు చాకిరి చేయిస్తున్నారు. గతంలో మధ్యాహ్నం 2 గంటల వరకే ఓపీ కొనసాగేది. ప్రస్తుతం రెండు పూటలా ఓపీ నిర్వహిస్తున్నామని చెబుతూ రాత్రి 8 గంటల వరకు పని చేయించుకుంటున్నారు. నిమిషం ఆలస్యమైనా జీతం కట్ నర్సులు, సిబ్బంది ఆస్పత్రికి 8.10 గంటలకు రావాలి. కేవలం ఒకే ఒక్క నిమిషం ఆలస్యమైనా ఆ రోజు జీతం కట్. జీతాలు పెంచమని అడిగితే ఇంటికి వెళ్లి పొమ్మని అపోలో యాజమాన్యం బెదిరిస్తోంది. ఇటీవల గుంటూరులో ఒక నర్సును అపోలోకి చెందిన సూపర్ వైజర్లు జీతాలు పెంచమన్నందుకు దారుణంగా బెదిరించారు. ఈ వ్యవహారం వాట్సప్‌లో హల్చల్ చేసింది. రెంటికి చెడ్డ రేవడిలా.. మొదట్లో పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో చేరిన నర్సులను కాలక్రమంలో ప్రభుత్వం రెగ్యులర్ చేస్తామని ప్రకటించింది. ఎప్పటికైనా రెగ్యులర్ అవుతామనే ఆశతోనే నర్సులు పని చేస్తున్నారు. అపోలో సంస్థకు అప్పగించడంతో నర్సులు వైద్యశాఖ నుంచి వేరైపోయారు. ఈ లోపు అనేక మందికి వయో పరిమితి కూడా దాటిపోయింది. ఇప్పుడు నర్సుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. ఇదంతా టీడీపీ చేసిన పాపమని ఇప్పుడు వారు శాపనార్థాలు పెడుతున్నారు. వృథా ఖర్చు : నిపుణుల కమిటీ నాలుగు రోజుల క్రితం వైద్య ఆరోగ్యశాఖను పరిశీలించడానికి నిపుణుల కమిటీ సభ్యులు జిల్లాలో పర్యటించారు. వారు పెద్దాసుపత్రిలో విలేకరులతో మాట్లాడుతూ పట్టణ ఆరోగ్య కేంద్రాలను అపోలోకి అప్పగించి ప్రజా సొమ్మును వృథా చేశారని వెల్లడించారు. ఇటు రోగులకు ఉపయోగపడక, అటు జీతాలు పెంచక ఆ డబ్బంతా ఏమవుతుందో పరిశీలిస్తున్నామన్నారు. త్వరలోనే ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టణ ఆరోగ్య కేంద్రాలను అపోలో యాజమాన్యం నుంచి తప్పించి నిర్వహణ ప్రభుత్వమే చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటారని తెలిపారు. వైద్యశాఖాధికారి డాక్టర్ రాజ్యలక్ష్మిని ఈ విషయమై వివరణ అడిగితే ప్రభుత్వం నుంచి తమకు ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. ఏది ఏమైనా పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యం పేరిట అపోలోకి దోచి పెట్టిన విషయం తేటతెల్లమైంది. దీనికి త్వరలోనే పుల్‌స్టాప్ పడనుందని, సిబ్బందిని వైద్యశాఖ అధీనంలోనికి తీసుకుని జీతాలు పెంచే అవకాశముందని తెలుస్తోంది. -
వికటించిన వ్యాక్సిన్.. చిన్నారి మృతి
-
‘మందులు ఇచ్చిన నర్సులను విచారిస్తున్నారు’
సాక్షి, హైదరాబాద్ : నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో ఇచ్చిన వ్యాక్సిన్ వికటించడంతో.. ఓ చిన్నారి మృతి చెందటం.. మరికొంతమంది చిన్నారులకు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన కలకలం రేపుతోంది. టీకాల అనంతరం ఇవ్వాల్సిన మందులు కాకుండా వేరేవి ఇవ్వడంతో ఈ ఘటన జరిగిందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులకు మందులు ఇచ్చిన నర్సులను ప్రస్తుతం అధికారులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రభుత్వ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ సునీత స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘నిన్న 92 మంది చిన్నారులకు టీకాలు ఇచ్చాము. సాయంత్రం నుంచి టీకాలు తీసుకున్న చిన్నారుల్లో కొంతమంది అసౌకర్యంగా ఉన్నారంటూ హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. వెంటనే డిస్ట్రిక్ ఇమ్యూనైజేషన్ ఆఫీసర్‌కు సమాచారం ఇచ్చాము. టీకాలు తీసుకున్న పిల్లలందర్నీ మళ్లీ పిలిపించి అందరికీ వైద్య పరీక్షలు చేసి నిలోఫర్ ఆసుపత్రికి పంపించాము. డాక్టర్ రుబీనా, ఫార్మసిస్ట్ మోహన్, నర్స్ మెహ్రాలు పిల్లలకు టీకాలు ఇచ్చారు. పిల్లలకు టీకాల అనంతరం శాంతాబాయి, గీతా, కౌసర్, కవితాలుగా గుర్తించాము. ప్రస్తుతం వీరందరిని కోఠిలోని డీఎమ్హెచ్ఓలో అధికారులు విచారిస్తున్నార’ని తెలిపారు. చదవండి : వికటించిన వ్యాక్సిన్.. 15 మందికి అస్వస్థత నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో దారుణం -
వికటించిన వ్యాక్సిన్.. చిన్నారి మృతి
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో దారుణం చోటుచేసకుంది. చిన్న పిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్ వికటించడంతో ఫైజల్ అనే చిన్నారి మృతి చెందారు. మరో 15 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన చిన్నారులు ప్రస్తుతం నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారికి వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం వైద్యులు 70 మందికి పైగా చిన్నారులకు వ్యాక్సిన్ ఇచ్చారు. వ్యాక్సిన్ తర్వాత ఇచ్చే ట్యాబ్లెట్స్ మారడంతో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని నగరంలోని వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం నిలోఫర్‌లో 15 మంది చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు. చిన్నారుల ఆరోగ్యంపై వారి తల్లిదండ్రుల తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పిల్లలకు అనుభవం లేని నర్సులు వ్యాక్సినేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. -
అపోలో చేతికి అర్బన్ హెల్త్ సెంటర్ల తాళాలు
అనంతపురం సిటీ: అపోలో హాస్పిటల్స్ చేతికి అర్బన్ హెల్త్ సెంటర్స్ తాళాలు అప్పగించాలంటూ కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ సెంటర్ నుంచి గురువారం ఉత్తర్వులు అందాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వెంకటరమణ తెలిపారు. దీంతో జిల్లాలోని 19 ఆరోగ్య కేంద్రాలు అపోలో హాస్పిటల్స్ చేతిలోకి వెళ్లిపోనున్నాయి. ఆ సంస్థ ఇప్పటికే ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. రెండు, మూడు రోజుల్లో పూర్తీ వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.