
సాక్షి, హైదరాబాద్ : నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్‌లో ఇచ్చిన వ్యాక్సిన్ వికటించడంతో.. ఓ చిన్నారి మృతి చెందటం.. మరికొంతమంది చిన్నారులకు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన కలకలం రేపుతోంది. టీకాల అనంతరం ఇవ్వాల్సిన మందులు కాకుండా వేరేవి ఇవ్వడంతో ఈ ఘటన జరిగిందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులకు మందులు ఇచ్చిన నర్సులను ప్రస్తుతం అధికారులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై ప్రభుత్వ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ సునీత స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘నిన్న 92 మంది చిన్నారులకు టీకాలు ఇచ్చాము. సాయంత్రం నుంచి టీకాలు తీసుకున్న చిన్నారుల్లో కొంతమంది అసౌకర్యంగా ఉన్నారంటూ హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. వెంటనే డిస్ట్రిక్ ఇమ్యూనైజేషన్ ఆఫీసర్‌కు సమాచారం ఇచ్చాము. టీకాలు తీసుకున్న పిల్లలందర్నీ మళ్లీ పిలిపించి అందరికీ వైద్య పరీక్షలు చేసి నిలోఫర్ ఆసుపత్రికి పంపించాము. డాక్టర్ రుబీనా, ఫార్మసిస్ట్ మోహన్, నర్స్ మెహ్రాలు పిల్లలకు టీకాలు ఇచ్చారు. పిల్లలకు టీకాల అనంతరం శాంతాబాయి, గీతా, కౌసర్, కవితాలుగా గుర్తించాము. ప్రస్తుతం వీరందరిని కోఠిలోని డీఎమ్‌హెచ్‌ఓలో అధికారులు విచారిస్తున్నార’ని తెలిపారు.
చదవండి :
Comments
Please login to add a commentAdd a comment