నాంపల్లిలో కారు బీభత్సం.. | High Speed Car Accident At Hyderabad Nampally, More Details Inside | Sakshi
Sakshi News home page

నాంపల్లిలో కారు బీభత్సం..

Published Thu, Nov 14 2024 8:09 AM | Last Updated on Thu, Nov 14 2024 10:37 AM

High Speed car Accident At Hyderabad Nampally

సాక్షి, హైదరాబాద్‌: నాంపల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అధిక వేగంలో ఉన్న కారు అదుపు తప్పి.. జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. అనంతరం, మద్యం తాగి కారు నడిపిన వ్యక్తిని స్థానికులు చితకబాదారు.

వివరాల ప్రకారం..నాంపల్లిలోని రెడ్‌హిల్స్‌ నీలోఫర్‌ కేఫ్‌ వద్ద గురువారం తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. ఓ వ్యక్తి మద్యం తాగి కారు నడపడంలో అదుపు తప్పి జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. అనంతరం, మద్యం మత్తులో కారు నడిపిన వ్యక్తిని స్థానికులు చితకబాదారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement