తెలంగాణ సాధనతోనే నా జన్మ సాకారమైంది: సీఎం కేసీఆర్‌ | CM KCR Will Partcipated In Telangana National Unity Day Updates | Sakshi

తెలంగాణ సాధనతోనే నా జన్మ సాకారమైంది: సీఎం కేసీఆర్‌

Published Sun, Sep 17 2023 8:46 AM | Last Updated on Sun, Sep 17 2023 12:16 PM

CM KCR Will Partcipated In Telangana National Unity Day Updates - Sakshi

Updates..

నాంపల్లిలోని పబ్లిక్‌ గార్డెన్స్‌లో జరుగుతున్న జాతీయ సమైక్యతా వేడుకల్లో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ కోసం పోరాడిన వీరులందరికీ నా వందనాలు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్‌ 17కు ప్రత్యేకత ఉంది. న్యాయం, ధర్మం కోసం ఎందరో ప్రాణత్యాగం చేశారు. ఆనాటి సామాన్యులు చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తిని అందిస్తూనే ఉంటాయి. గాంధీ, నెహ్రు, పటేల్‌ వంటి నేతల వల్లే ప్రస్తుత భారతదేశం సాధ్యమైంది. తెలంగాణలో రాచరికం ముగిసి ప్రజాస్వామ్య పాలన ప్రారంభమైంది. తెలంగాణ సాధనతోనే నా జన్మ సాకారమైంది. ఉమ్మడి రాష్ట్రంలో పెండింగ్‌లో పెట్టిన ప్రాజెక్ట్‌లను పూర్తి చేశాం. 

► తెలంగాణ వచ్చాక అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోంది. తెలంగాణ విధానాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత పాలమూరు పచ్చగా మారింది. ఎన్నో అడ్డంకులను అధిగమించి పాలమూరును పూర్తి చేశాం. తెలంగాణ సాగునీటి చరిత్రలో ఇదో సువర్ణ అధ్యయనం. 6 జిల్లాల్లో 12లక్షల 30వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. చెక్‌ డ్యామ్‌ల నిర్మాణాలతో భూగర్భ జలాలు పెరిగాయి. దేవాదుల ఎత్తిపోతలతో వరంగల్‌కు త్వరలోనే సాగునీరు అందిస్తాం. కోటి 25లక్షల ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యం. హైదరాబాద్‌ పేదల కోసం లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇస్తున్నాం. డబుల్‌ బెడ్‌రూమ్‌ పథకం నిరంతరం కొనసాగుతుంది. అర్హుందరికీ డబుల్‌ ఇల్లులు అందిస్తాం. 

► వైద్యవిద్యలో అనేక సంస్కరణలు తీసుకువచ్చాం. రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీలు ఉన్నాయి. ఒకే రోజు 9 వైద్య కళాశాలలు ప్రారంభించాం. ప్రతీ ఏటా 10వేల మంది డాక్టర్లను తయారు చేస్తున్నాం.  తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. హైదరాబాద్‌ పేదల కోసం లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇస్తున్నాం. డబుల్‌ బెడ్‌రూమ్‌ పథకం నిరంతరం కొనసాగుతుంది. అర్హుందరికీ డబుల్‌ ఇల్లులు అందిస్తామన్నారు. రాష్ట్రంలో 44లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయి. పెన్షన్‌ లబ్దిదారుల వయస్సును 57 ఏళ్లకు తగ్గించాం. ఖమ్మంలో సీతారామ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తాం. ఆదివాసీలకు పోడు భూముల పట్టాలు ఇచ్చాం. ప్రపంంలోనే అనేక సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నాయి.దళిత బంధు పథకంతో దళితుల కుటుంబాల్లో వెలుగులు వచ్చాయి. దేశంలో ఎక్కడా దళిత బంధు పథకం లేదు. ఐటీ రంగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. 

►  తెలంగాణ పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన కేసీఆర్‌. 

► పబ్లిక్‌ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం కేసీఆర్‌ 

► గన్‌ పార్క్‌లో తెలంగాణ అమరవీరులకు సీఎం కేసీఆర్‌ నివాళులు. 

► పబ్లిక్‌ గార్డెన్స్‌లో జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతోంది. వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు.

► సచివాలంలో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాలు వేడుకలు.

► జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎస్‌ శాంతి కుమారి

► నేడు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ నాంపల్లిలోని పబ్లిక్‌ గార్డెన్‌లో జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలను నిర్వహించనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement