Telangana National Unity Day
-
తెలంగాణ సాధనతోనే నా జన్మ సాకారమైంది: సీఎం కేసీఆర్
Updates.. ► నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో జరుగుతున్న జాతీయ సమైక్యతా వేడుకల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ కోసం పోరాడిన వీరులందరికీ నా వందనాలు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేకత ఉంది. న్యాయం, ధర్మం కోసం ఎందరో ప్రాణత్యాగం చేశారు. ఆనాటి సామాన్యులు చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తిని అందిస్తూనే ఉంటాయి. గాంధీ, నెహ్రు, పటేల్ వంటి నేతల వల్లే ప్రస్తుత భారతదేశం సాధ్యమైంది. తెలంగాణలో రాచరికం ముగిసి ప్రజాస్వామ్య పాలన ప్రారంభమైంది. తెలంగాణ సాధనతోనే నా జన్మ సాకారమైంది. ఉమ్మడి రాష్ట్రంలో పెండింగ్‌లో పెట్టిన ప్రాజెక్ట్‌లను పూర్తి చేశాం. ► తెలంగాణ వచ్చాక అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోంది. తెలంగాణ విధానాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత పాలమూరు పచ్చగా మారింది. ఎన్నో అడ్డంకులను అధిగమించి పాలమూరును పూర్తి చేశాం. తెలంగాణ సాగునీటి చరిత్రలో ఇదో సువర్ణ అధ్యయనం. 6 జిల్లాల్లో 12లక్షల 30వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. చెక్ డ్యామ్‌ల నిర్మాణాలతో భూగర్భ జలాలు పెరిగాయి. దేవాదుల ఎత్తిపోతలతో వరంగల్‌కు త్వరలోనే సాగునీరు అందిస్తాం. కోటి 25లక్షల ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యం. హైదరాబాద్ పేదల కోసం లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ పథకం నిరంతరం కొనసాగుతుంది. అర్హుందరికీ డబుల్ ఇల్లులు అందిస్తాం. ► వైద్యవిద్యలో అనేక సంస్కరణలు తీసుకువచ్చాం. రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి. ఒకే రోజు 9 వైద్య కళాశాలలు ప్రారంభించాం. ప్రతీ ఏటా 10వేల మంది డాక్టర్లను తయారు చేస్తున్నాం. తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉంది. హైదరాబాద్ పేదల కోసం లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ పథకం నిరంతరం కొనసాగుతుంది. అర్హుందరికీ డబుల్ ఇల్లులు అందిస్తామన్నారు. రాష్ట్రంలో 44లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయి. పెన్షన్ లబ్దిదారుల వయస్సును 57 ఏళ్లకు తగ్గించాం. ఖమ్మంలో సీతారామ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తాం. ఆదివాసీలకు పోడు భూముల పట్టాలు ఇచ్చాం. ప్రపంంలోనే అనేక సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నాయి.దళిత బంధు పథకంతో దళితుల కుటుంబాల్లో వెలుగులు వచ్చాయి. దేశంలో ఎక్కడా దళిత బంధు పథకం లేదు. ఐటీ రంగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. ► తెలంగాణ పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన కేసీఆర్. ► పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం కేసీఆర్ ► గన్ పార్క్‌లో తెలంగాణ అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళులు. ► పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతోంది. వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ► సచివాలంలో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాలు వేడుకలు. ► జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎస్ శాంతి కుమారి ► నేడు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం. అధికార బీఆర్ఎస్ పార్టీ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్లో జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలను నిర్వహించనుంది. -
నేడు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం ఉదయం 11 గంటలకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయపతాకాన్ని ఆవిష్కరించనున్నారు. సెప్టెంబర్ 17న రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థకు తెలంగాణ పరిణామం చెందిన సందర్భంగా ప్రతిఏటా ఆ రోజున తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు జెండావిష్కరణలు చేయనున్నారు. కాగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వవిధానానికి అనుగుణంగా ఆదివారం రాజ్‌భవన్‌లో విమోచన దినోత్సవం నిర్వహించాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్ణయం తీసుకున్నారు. రాజ్‌భవన్ ప్రాంగణంలో గవర్నర్ ఉదయం 9.30 గంటలకు జాతీయజెండాను ఆవిష్కరించనున్నారు. విమోచన దినోత్సవం జరుపుకోవాలి: గవర్నర్ పిలుపు హైదరాబాద్ విముక్తి పోరాటం దేశ స్వాతంత్య్ర సంగ్రామచరిత్రలో అత్యంత కీలక ఘట్టంగా నిలుస్తుందని గవర్నర్ తమిళిసై అన్నారు. హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ తన సందేశాన్ని విడుదల చేశారు. విమోచన ఉద్యమంలో పోరాటయోధుల త్యాగాలను స్మరించుకుని వారికి నివాళి అర్పించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని, మనం సంఘటితంగా పోరాడి సాధించిన విజయాలకు ఇది గుర్తుగా నిలుస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. -
భిన్నత్వంలో ఏకత్వమే మా లక్ష్యం
సాక్షి, సిరిసిల్ల: భిన్నత్వంలో ఏకత్వం తమ లక్ష్యమని, అరవైఏళ్ల స్వీయ అస్తిత్వ పోరాటం తర్వాత అవతరించిన తెలంగాణ.. అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. శనివారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17వ తేదీ.. తెలంగాణ రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పరిపాలనకు పరివర్తన చెందిన రోజన్నారు. సీఎం కేసీఆర్ దార్శనిక పాలనలో విద్యుత్, నీటిపారుదల, వ్యవసాయం, పరిశ్రమలు, అభివృద్ధి, ప్రజా సంక్షేమం వంటి రంగాల్లో దేశానికే తెలంగాణ దిక్సూచిగా నిలిచిందన్నారు. నిరుపేదల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలోని ప్రజలందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ హెల్త్ ప్రొఫైల్‌ను ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో చేపట్టామని వివరించారు.అంబేడ్కర్ పేరును రాష్ట్ర సెక్రటేరియట్‌కు పెట్టి మరోసారి దేశానికి ఆదర్శంగా నిలిచిందని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో కొందరు మత పిచ్చితో మంటలు రేపాలని చూస్తున్నారని, మన మధ్య ఐక్యతను కాపాడుకుంటూ ముందుకు సాగుదామని పేర్కొన్నారు. ఇదీ చదవండి: గిరిజనులకు దేశవ్యాప్తంగా సమాన హోదా -
మతోన్మాద శక్తులు వస్తున్నాయి.. జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: ‘‘దేశంలో, రాష్ట్రంలో మతోన్మాదశక్తులు పేట్రేగిపోతున్నాయి. సంకుచిత ప్రయోజనాల కోసం మనుషుల మధ్య ముళ్లకంపలు నాటుతున్నాయి. విద్వేషపు మంటలు రగిలిస్తూ, విష వ్యాఖ్యలతో ఆజ్యం పోస్తున్నాయి. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17 సందర్భాన్ని సైతం వక్రీకరించి.. స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చు కునే నీచమైన ఎత్తుగడలకు పాల్పడుతున్నాయి. నాటి చరిత్రతో, పరిణామాలతో వీసమెత్తు సంబంధం లేని ఈ అవకాశవాదులు చిల్లర రాజకీ యాలతో ఉజ్వలమైన తెలంగాణ చరిత్రను వక్రీక రించి మలినం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. శనివారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. కార్యక్రమంలో సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.. దుష్టశక్తుల యత్నాలను తిప్పికొట్టాలి ‘‘గత ఎనిమిదేళ్లలో తెలంగాణ జీవన ముఖచిత్రం ఎంతో మారిపోయింది. పచ్చని పొలాలతో, చక్కని మౌలిక వసతులతో ప్రగతిబాటలో పయనిస్తోంది. కానీ ఇప్పుడు మతతత్వ శక్తులు బయలుదేరి తెలంగాణ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నాయి. మనుషుల మధ్య విభజన, మతం చిచ్చు సరికాదు. ఇవి ఈ విధంగా విజృంభిస్తే దేశం, రాష్ట్రాల జీవికనే కబళిస్తాయి. ఆ దుష్టశక్తుల యత్నాలను బుద్ధి కుశలతతో తిప్పికొట్టాలి. ఏ కొంచెం ఆదమరిచినా.. ఎంత బాధాకరమైన వస్తాయనేదానికి మన గత తెలంగాణే ఉదాహరణ. ఒకనాడు జరిగిన ఏమరుపాటుతో తెలంగాణ 58 ఏళ్లు శాపగ్రస్త జీవితం అనుభవించింది. అస్తిత్వాన్ని తిరిగి నిలబెట్టుకోవడం కోసం ఎంతో పోరాడాల్సి వచ్చింది. అటువంటి వేదన మళ్లీ రాకూడదు. ఈ నేల శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లాలే తప్ప.. అశాంతితో అట్టుడికిపోవద్దు. నాటి ప్రజలంతా భాగస్వాములే.. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారింది. రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది. అందుకే జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకొంటున్నాం. తెలంగాణ సమాజం ప్రజాస్వామిక స్వేచ్ఛ వైపు పరివర్తన చెందడానికి నాడు అవలంబించిన వ్యూహాలు, జరిపిన పోరాటాలు, నెరిపిన త్యాగాల్లో.. నాటి తెలంగాణ ప్రజలందరూ భాగస్వాములే. ఆనాటి ఘట్టాలు జాతి జనుల జ్ఞాపకాల్లో నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాయి. చిరస్మరణీయులైన యోధులను తలుచుకోవడం మన కర్తవ్యం. కొమురంభీం, దొడ్డి కొమురయ్య, రావి నారాయణరెడ్డి, చాకలి ఐలమ్మ, ఆరుట్ల రామచంద్రారెడ్డి దంపతులు, సురవరం ప్రతాపరెడ్డి, మగ్దూం మొహియొద్దీన్, షోయబుల్లాఖాన్‌లకు శిరసు వంచి నమస్కరిస్తున్నా.. నాడు, నేడు తెలంగాణ అగ్రగామే! తెలంగాణ దేశంలో అంతర్భాగంగా మారిన తర్వాత 1948 నుండి 1956 వరకు సొంత రాష్ట్రం హైదరాబాద్ స్టేట్‌గా వెలుగొందింది. మిగులు నిధులతో అభివృద్ధి దిశగా ప్రణాళికలు నిర్మించుకొని అడుగులు వేసింది. తర్వాత పడిన తప్పటడుగుల నుంచి విముక్తి పొంది 2014 జూన్ 2న తెలంగాణ తిరిగి సాకారమైంది. అప్పుడూ, ఇప్పుడూ అన్నిరంగాల్లోనూ పురోగమిస్తూ దేశానికే దారిచూపే టార్చ్‌బేరర్‌గా నిలిచింది’’. ఇదీ చదవండి: కేంద్రం తీరుతో సమాఖ్య స్ఫూర్తి క్షీణిస్తోంది