రేపే ఫలితం : మొక్కు చెల్లించిన కవిత | Kavitha Prayer In Nampalle Dargah | Sakshi
Sakshi News home page

రేపే ఫలితం : మొక్కు చెల్లించిన కవిత

Published Sun, Oct 11 2020 5:22 PM | Last Updated on Sun, Oct 11 2020 6:49 PM

Kavitha Prayer In Nampalle Dargah - Sakshi

ఫైల్‌ ఫోటో

సాక్షి, హైదరాబాద్‌ : నిజామాబాద్‌ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితం రేపు (సోమవారం) విడుదల కానున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత తన మొక్కు తీర్చుకున్నారు. నాంపల్లిలోని యూసీఫీయన్ దర్గాను సందర్శించిన కవిత చాదర్ సమర్పించారు. ప్రతి ఎన్నికల ఫలితాల ముందు దర్గాను సందర్శించిన కవితకు ఆనవాయితీ. దీనిలో భాగంగానే రేపటి ఫలితాల నేపథ్యంలో యూసీఫీయన్‌ దర్గాకు మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మహమూద్ అలీ, వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ సలీమ్, స్థానిక కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు కవితకు స్వాగతం పలికారు. నిజామాబాద్‌  ఎమ్మెల్సీ ఎన్నికలో భారీ మెజార్టీ సాధిస్తామని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement