కోహినూర్ వజ్రాన్ని మన దేశం నుంచి బ్రిటిష్ వాళ్లు పట్టుకుపోయారని కథకథలుగా విన్నాం. కానీ మన హైదరాబాద్ కోహినూర్‌గా పిలిచుకునే మన నిజాం మహారాణి గురించి వినిలేదు కదా..!. ఆ రోజుల్లోనే ష్యాషన్‌కి ఐకాన్‌గా ఉండేది. ఆమె అందానికి తగ్గట్టు గొప్ప గొప్పదాతృత్వ సేవలకు కూడా పేరుగాంచింది. మన హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి నిర్మించడానికి కారణమే ఆమె. ఎవరీమె..? ఎలా మన హైదబాద్ నిజాం కుటుంబానికి కోడలయ్యింది తదితరాలు గురించి చూద్దాం.!
మార్చి 3, 1924న టర్కీ పార్లమెంట్ ఖలిఫాను రద్దు చేసింది. ఖలీఫా అంటే వారసత్వం. దీని కారణంగా 101వ ఖలీఫా అబ్దుల్మెసిడి II కుటుంబం సామ్రాజ్యం నుంచి బహిష్కిరించబడింది. దీంతో వారిలో చాలామంది ఫ్రెంచ్ నగరాల్లో స్థిరపడ్డారు. వారిలో ఒట్టోమన్ సామ్రాజ్యానికి చెందిన నీలూఫర్ హన్‌సుల్తాన్ కూడా ఒకరు. ఆమె తండ్రి మరణంతో తల్లి అడిలే సుల్తాన్‌తో కలిసి ఫ్రాన్స్‌లో ఉండేవారు. అయితే హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ చిన్నకుమారుడు మోజమ్ తన అన్నయ్యతో కలిసి ఫ్రాన్స్‌కి వచ్చాడు. మోజమ్ అన్నయ ఆజం జా నీలూఫర్ బంధువైన డుర్రూషెహ్వార్ సుల్తాన్‌ను వివాహం చేసుకోవాల్సి ఉంది.
ఇక అతడి తమ్ముడు మోజామ్ ఒట్టోమన్ యువరాణి మహ్‌పేకర్ హన్‌సుల్తాన్‌తో పెళ్లి నిశ్చయం అయ్యింది. అయితే మోజామ్ నిలూఫర్‌ని చూసి ఆమె అందానికి మంత్రముగ్దుడై వెంటనే తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుని మరీ నీలోఫర్‌ను పెళ్లిచేసుకున్నాడు. ఆమెను వివాహం అనంతరం నీలూఫర్ ఖానుమ్ సుల్తాన్ బేగం సాహిబా అని పిలిచేవారు. అలా నీలోఫర్ నిజాంకి చెందిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కోడలు అయ్యింది. ఆమె నిజాం కోటలో ఆధునికత యుగానికి నాంది పలికింది. నిజాంను పాపా అని సంభోదించగలిగేది కూడా నీలూఫర్‌నే. అతడి కుమార్తెలు సైతం అతడిని సర్కార్ అని పిలిచేవారు. ఇక నీలోఫర్ తన బంధువు డుర్రోషెహ్వార్‌తో కలిసి మహిళల విముక్తి కోసం పనిచేసింది.
మహిళలను ముసుగులు తొలిగించి స్వతంత్రంగా బతికేలా ప్రోత్సహించేవారు. ఇక నీలూఫర్ అందచందాలకు భర్త దాసోహం అన్నట్లుగా ఉండేవాడు. అందులోనూ ఆమె ఫ్యాషన్ శైలి ఎవ్వరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. ఆమె ధరించే చీరలు, ఆభరణలు నిజాం పాలనలో మంచి ట్రెండ్ సెట్ చేసేవి. అప్పట్లోనే ఆమె చీరలను ముంబైకి చెందిన డిజైనర్ మాధవదాస్ డిజైన్ చేసేవారు. ఆమె ఒట్టోమన్ మూలాలు నిజామీ సంస్కృతితో అందంగా కలిసిపోయాయి. అంతేగాదు ఆమె చీరలు ఎంతో ప్రజాధరణ పొందేవి. అవి ఇప్పటికీ న్యూయార్క్‌లోని ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాజీలో ప్రదర్శనగా ఉన్నాయి. అంతేగాదు ఆమె ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళల్లో ఒకరిగా పేరుగాంచింది. పైగా ఆమెను ముద్దుగా 'హైదరాబాద్ కోహినూర్' అని పిలుచుకునేవారు కూడా. ఇక ఆమె బంధువు డుర్రూషెహ్వార్ ఒక కొడుకుకి జన్మనివ్వగా, నీలూఫర్ గర్భం దాల్చలేకపోయింది.
అందుకోసం యూరప్‌లోని నిపుణులెందరినో కలిసింది. ఆ టైంలో వైద్య సదుపాయాలు బాగా కొరతగా ఉండేవి. దీని కారణంగానే ఆమె పనిమనిషి ప్రసవ సమయంలో మరణించింది. ఇది ఆమెను బాగా కుంగదీయడమే గాక మహిళల కోసం ఆస్పత్రిని నిర్మించేందుకు దారితీసింది. తన పనిమినిషిలా ఎంతమంది రఫాత్‌లు మరణిస్తారంటూ ప్రసూతి ఆస్పత్రిని నిర్మించింది. అదే నేడు నాంపల్లిలో ఉన్న నీలోఫర్ ఆస్పత్రి. ఈ ఆస్పత్రి చరిత్ర గురించి నిజాం కుటుంబ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నజాఫ్ అలీఖాన్ చెబుతుంటారు.
కాగా, నీలూఫర్ గర్భందాల్చకపోవడంతో ఆమె భర్త రెండోవ వివాహం చేసుకున్నాడు. దీంతో ఆమె తన తల్లితో జీవించడానికి తిరిగి ఫ్రాన్స్ వెళ్లిపోయింది. ఆ తర్వాత నాలుగేళ్లకు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి ఆమె సామాజికి సేవలో ఎక్కువ సమయం గడుపుతుండేది. అలా 1963లో పారిస్‌లోని దౌత్యవేత్త, వ్యాపారవేత్త ఎడ్వర్డ్ జూలియాస్ పోప్‌ను వివాహం చేసుకుంది. ఇక శేషజీవితాన్ని పారిస్‌లోనే గడుపుతూ.. 1989లో మరణించింది.
(చదవండి: దేశీ గర్ల్ టు గ్లోబల్ ఐకాన్: మహిళా సాధికారతకు అసలైన నిర్వచనం ఆమె!)
Comments
Please login to add a commentAdd a comment