
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ రాసలీలల వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గజల్ రాసలీలలకు సంబంధించిన వీడియోలను బాధితురాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆయనపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాల కళాసంస్థలు, కళాకారులు ధ్వజమెత్తారు. ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన గజల్ శ్రీనివాస్‌ను కఠినంగా శిక్షించి, అతడిని సామాజికంగా బహిష్కరించాలని తెలంగాణ, ఏపీ రాష్ట్రాల కళాసంస్థలు, కళాకారులు అన్నారు.
శుక్రవారం హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో విలేకరుల సమావేశం ఆనందలహరి సాంస్కృతిక సంస్థ రాష్ట్ర కన్వీనర్ మల్లం రమేష మాట్లాడుతూ.. గజల్ శ్రీనివాస్ అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతూ కళారంగాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి కంటూ సాయన్న, చల్లా సరోజినీదేవి, సీనియర్ నటి ఆనందలక్ష్మి, రామడుగు వాసంతి, మోహన్కుమార్ గాంధీ, మిమిక్రి కళాకారులు రాంబాబు, జానపద నాయకులు బాలస్వామి, సాయబాబా పాల్గొన్నారు.