సాక్షి, హైదరాబాద్ : లైంగిక వేధింపుల కేసులో అరెస్టై జైలు ఊచలు లెక్కపెడుతున్న ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్‌కు మరో షాక్ తగిలింది. ఆయనను సేవ్ టెంపుల్ బ్రాండ్ అంబాసిడర్ గా తొలగిస్తూ ఆ సంస్థ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా సేవ్ టెంపుల్ సంస్థ అధ్యక్షుడు వెలగపూడి ప్రకాశ్‌రావు మాట్లాడుతూ..మహిళలు అంటే తమకు చాలా గౌరవం అని, ఒక మహిళను గజల్ శ్రీనివాస్ వేధించడం షాక్‌కు గురి చేసిందన్నారు. అలాంటి వ్యక్తిని బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగించవద్దని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు వెలగపూడి ప్రకాశ్‌రావు తెలిపారు. తమ సంస్థ పేరు చెప్పుకొని ఎలాంటి అశ్లీల కార్యక్రమాలకు పాల్పడిన ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గజల్ శ్రీనివాస్‌పై సస్పెన్షన్ వేటు వేసినట్లు ఆయన తెలిపారు.
కాగా పంజగుట్ట పరిధిలోని సప్తగిరి బిల్డింగ్‌లో ఉన్న సేవ్ టెంపుల్ సంస్థలో వెబ్ రేడియో ఆలయవాణికి ఓ యువతి ఇన్‌చార్జ్‌గా విధులు నిర్వర్తిస్తోంది. వెలగపూడి ప్రకాశ్‌రావు నేతృత్వంలోని ఈ సంస్థ ప్రధాన కార్యాలయం మూడేళ్లుగా సప్తగిరి బిల్డింగ్‌లోని త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌లో నడుస్తోంది. ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న గజల్ శ్రీనివాస్ యువతిని లైంగికంగా వేధించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment