
ఇండోర్: స్వర్గంగిణీ సంగీత సంస్థ, స్వరంగిణీ జన వికాస సమితి , మధ్యప్రదేశ్ ఆధ్వర్యంలో ఇండోర్లో అభినవ్ కళా సమాజ్ ఆడిటోరియం నందు నిర్వహించిన "సంత్ కబీర్ ఉత్సవ్ "లో ముమ్మారు గిన్నీస్ ప్రపంచ రికార్డుల గ్రహీత, ప్రఖ్యాత గజల్ గాయకుడు "మాస్ట్రో" డా.గజల్ శ్రీనివాస్ కు ముఖ్య అతిథి ఆకాశవాణి ,ఇండోర్ సంచాలకులు శ్రీ సంతోష్ అగ్నిహోత్రి ‘సంత్ కబీర్ సూఫీ గాయక సత్కారం' అందించారు.
ఈ సభలో డా.గజల్ శ్రీనివాస్ ఆలపించిన కబీర్ దోహే & సూఫీ ఉర్దూ గజల్ గానం ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసిందని, వారాణసి కి చెందిన తానా బానా మ్యూజిక్ బ్యాండ్ కబీర్ సాహిత్య గానం శ్రోతలను ఆకట్టుకుందని నిర్వాహకులు గురు చరణ్ దాస్, శ్రీమతి అంజన్ సక్సేనా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment