
సాక్షి, విజయవాడ: లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ గజల్ కళాకారుడు కేసిరాజు శ్రీనివాస్ అలియాస్ ‘గజల్’ శ్రీనివాస్‌కు ఏపీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు మద్ధతు తెలిపారు. గజల్ శ్రీనివాస్ పై కావాలని కుట్ర ప్రకారమే ఇలా చేశారని భావిస్తున్నట్లు చెప్పారు. విజయవాడలో బుధవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. పథకం ప్రకారం రికార్డ్ చేయకపోతే శ్రీనివాస్‌పై అలాంటి వీడియోలు బయటకు ఎలా వస్తాయన్నారు. గజల్ శ్రీనివాస్ దేశ వ్యాప్తంగా తిరిగి అద్బుతమైన గజల్స్ వినిపించిన వ్యక్తి అని, తనకు చిన్నప్పటి నుంచి శ్రీనివాస్ తెలుసునన్నారు.
శ్రీనివాస్ ఏ తప్పు చేయలేదని మరోసారి మంత్రి మాణిక్యాల రావు అన్నారు. లైంగిక వేధింపుల వీడియోలతో అడ్డంగా దొరికిన నిందితుడికి గౌరవప్రద మంత్రి హోదాలో ఉన్న మాణిక్యాలరావు వత్తాసు పలకడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే పలు వీడియోలే సాక్ష్యాలుగా బాధితురాలు తనపై జరిగిన లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేయగా శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు మహిళల పట్ల గజల్ శ్రీనివాస్ ముసుగు వేసుకున్న ఒక క్రూరమృగం అన్నది వీడియోలతో నిర్ధారణ అయిందని బాధితురాలు ఆరోపిస్తున్నారు.
గజల్ శ్రీనివాస్‌కు వత్తాసు పలికిన ఏపీ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment