
నెల్లూరులో శాంతి యాత్రను ప్రారంభించిన మేకపాటి
నెల్లూరు: వందే గాంధీయం పేరుతో శాంతి యాత్రను నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆదివారం స్థానిక గాంధీ విగ్రహాం వద్ద ప్రారంభించారు. పల్లిపాడులోని గాంధీ ఆశ్రమం వరకు ఈ పాదయాత్ర సాగుతుంది. ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ నేతృత్వంలో పల్లెపాడు సబర్మతి గాంధీ ఆశ్రమం, నెల్లూరు రెడ్ క్రాస్ సొసైటీలు సంయుక్తంగా ఈ పాదయాత్రను ఏర్పాటు చేశాయి.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎన్.శ్రీకాంత్, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, సంజీవయ్య, జడ్పీ ఛైర్మన్ రాఘవేంద్రరెడ్డితోపాటు పలువురు నాయకులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సబర్మతి ఆశ్రమానికి విస్తృత ప్రచారం కల్పించే ఉద్దేశ్యముతో వందే గాంధీయం శాంతి యాత్రను ఏర్పాటు చేశారు. ఈ పాదయాత్ర కార్యక్రమంలో భారీగా విద్యార్థులు, నగర ప్రజలు పాల్గొన్నారు.