తెలుగువాళ్లందరూ సమైక్యంగా ఉండాలని తాను సాంస్కృతిక పోరాటం చేస్తున్నానని ప్రముఖ గజల్ గాయకుడు శ్రీనివాస్ చెప్పారు.
హైదరాబాద్ : తెలుగువాళ్లందరూ సమైక్యంగా ఉండాలని తాను సాంస్కృతిక పోరాటం చేస్తున్నానని ప్రముఖ గజల్ గాయకుడు శ్రీనివాస్ చెప్పారు. అంతకు ముందు సేవ్ ఆంధ్రప్రదేశ్ సభలో పాల్గొనేందుకు వచ్చిన శ్రీనివాస్ను అనుమతి లేదని పోలీసులు అడ్డగించారు. తాను వంగపండు ప్రసాద్ రావులు కళాకారులుగానే సభకు హాజరయ్యామని ఆయన తెలిపారు.
కళాకారులను అనుమతించాలని ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు కోరడంతో పోలీసులు గజల్ శ్రీనివాస్, వంగపండు ప్రసాదరావులను అనుమతించారు. అనంతరం వారు తమ గీతాలతో సభికులను అలరించారు. కాగా గజల్ శ్రీనివాస్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.