Pyramid of Gija
-
రోబో కంటికి అబ్బురపరచే పిరమిడ్ రహస్యాలు!
ఈజిప్టులోని గిజాలో గల గ్రేట్ పిరమిడ్ లోపల ఏముందో మనకు తెలియజేసేందుకు ఒక రోబోట్ దాని లోపలికి ప్రవేశించి పలు రహస్యాలను బయటపెట్టింది. మానవీయంగా సాధ్యమయ్యే దానికంటే ఈ రోబో ఇప్పుడు అనేక కొత్త ఆవిష్కరణలను మనముందుకు తీసుకుచ్చింది. ఒక ఆధునిక రోబో గ్రేట్ పిరమిడ్లోకి వెళ్లడం ద్వారా పురాతన నాగరికతపై నూతన విండోను సమర్థవంతంగా తెరిచింది. గ్రేట్ పిరమిడ్.. అంటే అతిపెద్ద ఈజిప్షియన్ పిరమిడ్. కైరో శివార్లలోని ఈ పిరమిడ్ ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజవంశంలోని నాలుగవ పాలకుడు ఫారో ఖుఫు సమాధి అని చెబుతుంటారు. ఈ పిరమిడ్ సుమారు 4,500 ఏళ్ల క్రితం నిర్మితమయ్యిందని చరిత్ర చెబుతోంది. ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటిగా పేరొందిన ఈపిరమిడ్ చాలా వరకు చెక్కుచెదరకుండా ఉంది. తాజాగా క్వీన్స్ ఛాంబర్‌కు చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు.. తమ తవ్వకాలతో గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా అన్వేషణ దిశగా ముందుకుసాగారు. తమ తవ్వకాల ద్వారా వారు పిరమిడ్లోకి 40-డిగ్రీల కోణంలో పైకి చేరుకోలేకపోయారు. దీంతో వారి అన్వేషణకు పెద్ద ఆటంకం ఏర్పడింది. అయితే లీడ్స్‌లోని రోబోటిక్స్ ప్రొఫెసర్ రాబ్ రిచర్డ్సన్, అతని బృందం 2010లో ఈ సవాలును స్వీకరించారు. హాంకాంగ్ దంతవైద్యుడు, పరిశోధకుడు డాక్టర్ ట్జే చుయెన్గ్ పిరమిడ్‌లోని షాఫ్ట్ను నావిగేట్ చేయడానికి. పిరమిడ్లోపలి పైభాగానికి చేరుకోవడానికి ఎవరైనా రోబోట్‌ను డిజైన్ చేస్తే బాగుంటుందని భావించాడు. ఎట్టకేలకు యూకేకి చెందిన శాస్త్రవేత్త దాదాపు ఐదు సంవత్సరాల కృషితో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి రోబోను రూపొందించారు. పరిశోధనల్లో పాల్గొన్న ప్రొఫెసర్ రిచర్డ్సన్ మాట్లాడుతూ పిరమిడ్ లోనికి ప్రవేశించే రోబో చాలా తేలికగా ఉండాలనే ఉద్దేశంతో దానిని ఐదు కిలోలకు తగ్గించామన్నారు. తరువాత పాసేజ్వే ద్వారా రోబోట్‌ను సున్నితంగా తరలించే వ్యవస్థను అభివృద్ధి చేశామన్నారు. ఈ రోబో పిరమిడ్ లోపలి భాగానికి ఏమాత్రం నష్టం కలిగించకుండా ప్రత్యేకమైన ఫుటేజ్‌లను అందించింది. పిరమిడ్ లోపలి గదికి సంబంధించిన ఫొటోలను అందించింది. ఈ రోబో కెమెరా ఒక విచిత్రమైన రాయికి సంబంధించిన ఫొటోనుపంపింది. అయితే పిరమిడ్‌లోని షాఫ్ట్ (స్థూపాకారం) ఉద్దేశం ఎవరికీ తెలియదు. ఇది గాలి కోసం ఏర్పాటు చేసిన బిలం కావచ్చని ప్రొఫెసర్ రిచర్డ్సన్ వివరించారు. ఈ స్థూపాకారంలో 50 మీటర్లు ముందుకుసాగాక ముగింపు దగ్గర తదుపరి యాక్సెస్‌ను నిరోధించడానికి ఒక రాయిని ఉంచారు. ఆ రాయి దేనిని అడ్డుకుంటుందో తమకు అర్థం కాలేదన్నారు. దీని ప్రయోజనం ఏమిటనేది మిస్టరీగా మిగిలిపోయిందని రిచర్డ్సన్ తెలిపారు. కాగా ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ విలియం వెస్ట్‌వే ఈ చారిత్రాత్మక ప్రాజెక్టపై ఒక సినిమా తీశారు. ఈ సినిమా పురాతన నాగరికతకు చెందిన అనేక అంశాలను వెలుగులోకి తెచ్చింది. రోబోటిక్ ఇంజనీరింగ్ సాయంతో పిరమిడ్‌లోని రహస్యాలు ఎలా వెల్లడయ్యాయో ఈ చిత్రం వెల్లడిస్తుందని వెస్ట్‌వే తెలిపారు. -
పిరమిడ్‌పై పిచ్చి పని.. చిక్కుల్లో జంట!
కైరో : పిరమిడ్‌పై ఓ జంట చేసిన పిచ్చి పని వారిని చిక్కుల్లో పడేసింది. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ఈజిప్ట్ పిరమిడ్స్‌ను చూసేందుకు నిత్యం వేల సంఖ్యలో పర్యాటకులు తరలి వస్తుంటారు. అయితే డెన్మార్క్‌కు చెందిన ఓ జంట మాత్రం భిన్నంగా ఆలోచించి... చిక్కుల్లో ఇరుక్కుంది. పిరమిడ్ ఎక్కడమే కాకుండా దానిపై నగ్నంగా పోజ్‌లు ఇచ్చింది. అంతటితో ఆగకుండా వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి కాస్త వైరల్ కావడంతో ఇప్పుడు కష్టోల్లో పడింది. వాస్తవానికి పిరమిడ్స్‌ను చూడటానికి మాత్రమే పర్యాటకులను అనుమతి ఇస్తారు. వాటిని ఎక్కడం నిషేధం. అయితే డెన్మార్క్ చెందిన ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ హావిద్ తన ప్రియురాలితో కలిసి నిబంధనలకు విరుద్దంగా రాత్రి సమయంలో గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజాను ఎక్కారు. అక్కడ నగ్నంగా ఫొటోలు దిగారు. అనంతరం శృంగారం చేసుకుంటూ షూట్ చేశారు. మూడు నిమిషాల పాటు రికార్డు చేసిన ఈ వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. టైటిల్ కూడా ఈజిప్ట్ పిరమిడ్స్‌పై శృంగారం చేశామంటూ పెట్టడంతో ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది. ఈ విషయాన్ని గుర్తించిన ఈజిప్ట్ ప్రభుత్వం డానిష్ జంటపై దర్యాప్తునకు ఆదేశించింది. -
అద్భుతాన్ని కళ్ల ముందుంచారు
అద్భుతాన్ని వెలుగులోకి తెచ్చారు పురాతత్వశాస్త్రవేత్తలు. ఈజిప్ట్‌లో సుమారు 2000 ఏళ్ల క్రితం నాటి మమ్మీలను తవ్వి తీసారు. మమ్మీలకు పూసిన రసాయనాలను ఏంటన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. కైరో: సుమారు 15 మంది సభ్యులతో కూడిన పురాతత్వ శాస్త్రవేత్తల బృందం.. గత కొన్ని నెలలుగా సౌత్ కైరోలోని సఖ్కర నెక్రోపోలిస్ వద్ద ఈ తవ్వకాలు చేపట్టారు. సుమారు 30 మీటర్ల లోతులో మమ్మీలు లభ్యం కాగా, వాటిపై పరిశోధనలు ప్రారంభించారు. 664-404 బీసీ.. సైటే-పర్షియన్ కాలానికి చెందిన మమ్మీలుగా అంచనా వేస్తున్నారు. ఇప్పటిదాకా దొరికిన మమ్మీల్లో ఇవి చాలా ప్రత్యేకంమని శాస్త్రవేత్తల బృందం ప్రతినిధి రమదాన్ హుస్సేన్ చెబుతున్నారు. ‘ఇవి అద్భుతమే చెప్పాలి. ఇందులో ఓ మమ్మీకి వెండి ముసుగు, బంగారు పూతలు కూడా ఉంది. ఇప్పటిదాకా వెలుగులోకి వచ్చిన మమ్మీల్లో ఇది రెండోది. బహుశా అది చక్రవర్తి భార్యది అయి ఉండొచ్చు. కళేబరాలకు పూసిన రసాయనాల అవశేషాలు ఇంకా తాజాదనంతోనే ఉన్నాయి. వాటిని పరీక్షిస్తే మమ్మీల పరిశోధనల చరిత్రలో కొత్త అధ్యయనం లిఖించినట్లే..’ అని హుస్సేన్ వెల్లడించారు. -
వచ్చే నెలలో భూమి అంతం..!!!
సాక్షి, ప్రత్యేకం: 'భూమి అంతానికి సమయం ఆసన్నమైంది. మరో 24 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. మీ ఆఖరి కోరికలు తీర్చేసుకోండి. మరణించాక మీ వెంటరాని వాటి కోసం పాకులాడకండి..' అంటూ కాన్స్పిరసీ థియరిస్ట్ డేవిడ్ మీడ్ పేర్కొన్నారు. వచ్చే నెల 20-23 మధ్య భూమిని నిబిరు అనే గ్రహం ఢీ కొడుతుందని చెప్పారు. దీంతో భూమి ముక్కలై.. జీవరాశి జాడ కూడా దొరక్కుండా పోతుందని తెలిపారు. ఈ ఘటన గురించి బైబిల్, గిజా పిరమిడ్‌లో స్పష్టంగా ఉందని వెల్లడించారు. భూమి ఈ ఏడాది అంతం అవుతుందని మీడ్ గతంలో చెప్పారు. తాజాగా భూమి అంతమయ్యే తేదీలను కూడా ఆయన ప్రకటించారు. సెప్టెంబర్ నెల మధ్యలో నిబిరు గ్రహం ఆకాశంలో ప్రపంచం మొత్తానికి స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. ఏంటీ నిబిరు..? నిబిరు అనేది ఓ ఊహాజనిత గ్రహం. సౌర కుటుంబానికి అంచున ఈ గ్రహం ఉన్నట్లు భావిస్తున్నారు. దీన్ని ప్లానెట్ ఎక్స్‌గా కూడా పిలుస్తారు. 2016 జనవరి నెలలో తొలిసారిగా నిబిరు గ్రహ ప్రస్తావన వచ్చింది. కొన్ని వందల ఏళ్ల క్రితం మన గ్రహాల కక్ష్యల్లోకి ప్రేవేశించిన నిబిరు గ్రహం వాటిని ఢీ కొట్టి సర్వనాశనం చేసింది. అయితే, ఇప్పుడు భూ కక్ష్యలోకి నిబిరి ప్రవేశించనుందని కాన్స్పిరసీ థియరిస్ట్లు భావిస్తున్నారు. ఇదే జరిగితే భూమిపై జీవరాశులకు కాలం చెల్లినట్లే..!