వచ్చే నెలలో భూమి అంతం..!!! | Nibiru is 'about to destroy Earth' in September, Claims Conspiracy Theorists | Sakshi
Sakshi News home page

వచ్చే నెలలో భూమి అంతం..!!!

Published Wed, Aug 30 2017 10:53 AM | Last Updated on Tue, Sep 12 2017 1:23 AM

Nibiru is 'about to destroy Earth' in September, Claims Conspiracy Theorists



సాక్షి, ప్రత్యేకం:
'భూమి అంతానికి సమయం ఆసన్నమైంది. మరో 24 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. మీ ఆఖరి కోరికలు తీర్చేసుకోండి. మరణించాక మీ వెంటరాని వాటి కోసం పాకులాడకండి..' అంటూ కాన్‌స్పిరసీ థియరిస్ట్‌ డేవిడ్‌ మీడ్‌ పేర్కొన్నారు. వచ్చే నెల 20-23 మధ్య భూమిని నిబిరు అనే గ్రహం ఢీ కొడుతుందని చెప్పారు. దీంతో భూమి ముక్కలై.. జీవరాశి జాడ కూడా దొరక్కుండా పోతుందని తెలిపారు. ఈ ఘటన గురించి బైబిల్‌, గిజా పిరమిడ్‌లో స్పష్టంగా ఉందని వెల్లడించారు.

భూమి ఈ ఏడాది అంతం అవుతుందని మీడ్‌ గతంలో చెప్పారు. తాజాగా భూమి అంతమయ్యే తేదీలను కూడా ఆయన ప్రకటించారు. సెప్టెంబర్‌ నెల మధ్యలో నిబిరు గ్రహం ఆకాశంలో ప్రపంచం మొత్తానికి స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు.

ఏంటీ నిబిరు..?
నిబిరు అనేది ఓ ఊహాజనిత గ్రహం. సౌర కుటుంబానికి అంచున ఈ గ్రహం ఉన్నట్లు భావిస్తున్నారు. దీన్ని ప్లానెట్‌ ఎక్స్‌గా కూడా పిలుస్తారు. 2016 జనవరి నెలలో తొలిసారిగా నిబిరు గ్రహ ప్రస్తావన వచ్చింది. కొన్ని వందల ఏళ్ల క్రితం మన గ్రహాల కక్ష్యల్లోకి ప్రేవేశించిన నిబిరు గ్రహం వాటిని ఢీ కొట్టి సర్వనాశనం చేసింది. అయితే, ఇప్పుడు భూ కక్ష్యలోకి నిబిరి ప్రవేశించనుందని కాన్‌స్పిరసీ థియరిస్ట్‌లు భావిస్తున్నారు. ఇదే జరిగితే భూమిపై జీవరాశులకు కాలం చెల్లినట్లే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement