planet X
-
భూమి అంతం : ఏప్రిల్ 23..?
సాక్షి, వెబ్ డెస్క్ : భూమి మీద ప్రాణికోటికి మరో పదిరోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నెల 23న భూమి అంతరించనున్నట్లు ‘డేవిడ్ మీడే’ ప్రకటించారు. ఈ లోపు జీవితంలో మిగిలి ఉన్న చిన్న చిన్న కోరికలను నెరవేర్చుకొండి అంటున్నారు మీడే. గత కొద్ది నెలలుగా భూమి అంతరిస్తుందని తరచూ హెచ్చరికలు చేస్తున్న కాన్స్పిరసీ థియరిస్టు మీడే. ఈయన మరోసారి భూమి అంతం కాబోతోందని ప్రకటించారు మీడే. ఈ సారి మాత్రం పాత ఉదాహారణలు అయిన నిబిరు, ప్లానెట్ ఎక్స్‌తో పాటు జోంబీ గ్రంథాన్ని కూడా ఆధారం చేసుకుని మరి ఈ ప్రకటన చేశాడు. ఈ సారి భూమి అంతం తప్పదంటున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా బైబిల్లో చెప్పిన ప్రకారం ఈ నెల 23న రాత్రి 12 గంటల ఒక నిమిషానికి ఈ విపత్తు సంభవించనున్నట్లు డేవిడ్ మీడే చెప్పారు. దీని గురించి బైబిల్లో కూడా ఉందన్నారు. బైబిల్ ప్రకారం ప్రకారం క్రీస్తు పునరాగమనం జరుగుతుందని క్రైస్తవుల నమ్మకం. పునరాగమన సమయంలో చనిపోయిన వారు, బతికున్నవారు ఆకాశంలోకి వెళ్తారు. అక్కడ దేవుడు వారు భూమి మీద చేసిన మంచి, చెడు పనుల ప్రకారం వారి ఆత్మలను స్వర్గానికి లేదా నరకానికి పంపిస్తాడని నమ్మకం. సూర్యుడు కన్యా రాశిలో ప్రవేశించినప్పుడు సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు ఒకే క్రమంలోకి వస్తారని అప్పుడు ఏవైనా ఉపద్రవాలు సంభవించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు కూడా అంటున్నారు. ఈ మూడు గ్రహాలు ఒకే క్రమంలోకి వచ్చినప్పుడు నిబిరు గ్రహం భూ కక్ష్యలోకి ప్రవేశించి భూమిని నాశనం చేస్తుందని డేవిడ్ మీడే అంటున్నారు. -
వచ్చే నెలలో భూమి అంతం..!!!
సాక్షి, ప్రత్యేకం: 'భూమి అంతానికి సమయం ఆసన్నమైంది. మరో 24 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. మీ ఆఖరి కోరికలు తీర్చేసుకోండి. మరణించాక మీ వెంటరాని వాటి కోసం పాకులాడకండి..' అంటూ కాన్స్పిరసీ థియరిస్ట్ డేవిడ్ మీడ్ పేర్కొన్నారు. వచ్చే నెల 20-23 మధ్య భూమిని నిబిరు అనే గ్రహం ఢీ కొడుతుందని చెప్పారు. దీంతో భూమి ముక్కలై.. జీవరాశి జాడ కూడా దొరక్కుండా పోతుందని తెలిపారు. ఈ ఘటన గురించి బైబిల్, గిజా పిరమిడ్‌లో స్పష్టంగా ఉందని వెల్లడించారు. భూమి ఈ ఏడాది అంతం అవుతుందని మీడ్ గతంలో చెప్పారు. తాజాగా భూమి అంతమయ్యే తేదీలను కూడా ఆయన ప్రకటించారు. సెప్టెంబర్ నెల మధ్యలో నిబిరు గ్రహం ఆకాశంలో ప్రపంచం మొత్తానికి స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. ఏంటీ నిబిరు..? నిబిరు అనేది ఓ ఊహాజనిత గ్రహం. సౌర కుటుంబానికి అంచున ఈ గ్రహం ఉన్నట్లు భావిస్తున్నారు. దీన్ని ప్లానెట్ ఎక్స్‌గా కూడా పిలుస్తారు. 2016 జనవరి నెలలో తొలిసారిగా నిబిరు గ్రహ ప్రస్తావన వచ్చింది. కొన్ని వందల ఏళ్ల క్రితం మన గ్రహాల కక్ష్యల్లోకి ప్రేవేశించిన నిబిరు గ్రహం వాటిని ఢీ కొట్టి సర్వనాశనం చేసింది. అయితే, ఇప్పుడు భూ కక్ష్యలోకి నిబిరి ప్రవేశించనుందని కాన్స్పిరసీ థియరిస్ట్లు భావిస్తున్నారు. ఇదే జరిగితే భూమిపై జీవరాశులకు కాలం చెల్లినట్లే..! -
విశ్వంలో గ్రహాల సంఖ్య 9కి చేరనుందా?
-
విశ్వంలో గ్రహాల సంఖ్య 9కి చేరనుందా?
సౌర కుటుంబంలో ఎనిమిది గ్రహాలు ఉన్నాయని వాటిలో జీవరాశి కలిగినది కేవలం భూమి మాత్రమేనని అందరికీ తెలుసు. అయితే, ఈ ఏడాది ప్రారంభంలో సౌర కుటుంబంలో మరో గ్రహం(తొమ్మిదో గ్రహం) కూడా ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా తొమ్మిదో గ్రహం కారణంగా సూర్యుని కదలికలో అసాధారణ మార్పులు కలిగే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆకారంలో భారీగా ఉండటం, మిగిలిన గ్రహాల కక్ష్య(ఆర్బిట్)లతో పోల్చితే తొమ్మిదో గ్రహ కక్ష్య దిశలో మార్పు ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. కాల్ టెక్ కు చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్ధి, తొమ్మిదో గ్రహ జాడను కనుగొనడానికి యత్నిస్తున్న ఎలిజబెత్ బెయిలీ కక్ష్యకు సంబంధించిన ఊహా వీడియోను విడుదల చేశారు. ఊహా వీడియోలో చూపిన విధంగా సౌర కుటుంబం మారితే గ్రహల కక్ష్యల అమరికలో పెనుమార్పులు సంభవిస్తాయి. ప్రస్తుత సౌర కుటుంబాన్ని ఒకసారి పరిశీలిస్తే గ్రహాలన్నీ సూర్యునితో పాటు కొద్ది డిగ్రీల తేడాతో ఒక వరుసలో ఉన్నాయి. తొమ్మిదో గ్రహ కక్ష్య ఒక్కసారిగా ఆరు డిగ్రీల కోణంలో అసాధారాణ రీతిలో దిశ మార్చుకుని ఉండటం వల్ల జరిగే పరిణామాలను ఇప్పుడప్పుడే ఊహించలేమని కాల్ టెక్ కు చెందిన మరో ఖగోళ శాస్త్రవేత్త మైక్ బ్రౌన్ చెప్పారు. బ్రౌన్, అతని సహచర శాస్త్రవేత్త బెటీ జిన్ లు గణిత మోడళ్లు, కంప్యూటర్ సిమ్యూలేషన్స్ లలో గమనించిన తేడాల ద్వారా చివరి గ్రహమైన నెప్ట్యూన్ తర్వాత మంచు దిబ్బలు కలిగిన మరో గ్రహం ఏదో ఉందనే ఆధారాలు కనిపిస్తున్నట్లు చెప్పారు. భూమి కంటే 10 రెట్లు పెద్దగా ఈ గ్రహం ఉండొచ్చని ఊహిస్తున్నారు. కాగా, తొమ్మిదో గ్రహాన్ని మరికొందరు 'ప్లానెట్ ఎక్స్' పేరుతో పిలుస్తున్నారు. సూర్యునికి అత్యంత దూరంలో ఉన్న 'ప్లానెట్ ఎక్స్' కచ్చితంగా ఏ ప్రాంతంలో ఉందనే విషయాన్ని మాత్రం ద్రువీకరించడం లేదు.