
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రపంచం వేగంగా మారుతోంది. గతంలో ఏళ్ల తరబడి చేసే పనులు కూడా ప్రస్తుతం నెలల్లో, రోజుల్లో ముగించేస్తున్నాం. ఎన్నో అసాధ్యం అనుకున్న వాటిని కూడా సుసాధ్యం చేస్తున్నాం. సింపుల్‌గా చెప్పాలంటే ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ఇంపాజిబుల్ అనేది లేదని మానవుడు అంటున్నాడు. ఈ మాటలనే నిజం అనిపించేలా ఓ వీడియో నెట్టింట హల్ చేస్తోంది. అందులో వేల సంవత్సరాల క్రితం చనిపోయిన వారికి రూపం వస్తే ఎలా ఉంటుందో చూపించింది. ఇంతకీ అది ఎలా సాధ్యమైందని అనుకుంటున్నారా? అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే!
ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)అనేది ఎక్కువగా వినపడుతున్న పేరు. మానవుని మేధస్సుకి మిషీన్ వేగం తోడైతే ఊహించని ఫలితాలు వస్తాయినడంలో సందేహం లేదు. సరిగ్గా ఏఐ వాడుకుని కూడా అలాంటి ఫలితాలే వస్తాయి. అందుకు ఉదాహరణగా ఈ వీడియో చెప్పవచ్చు. అందులో ఏముందంటే..
హాలీవుడ్ మూవీ ‘మమ్మీ’ చూడని వాళ్లు లేదా ఈజిఫ్ట్ మమ్మీల గురించి తెలియని వాళ్లు ఉండరు. ఈజిఫ్ట్ మనకు ఎప్పటికీ మిస్టరీయే. వేల సంవత్సరాల రాజుల శవాల్ని భద్రపరిచి పిరమిడ్స్ కట్టిన విధానం ప్రపంచాన్ని ఆశ్చర్చంలో ముంచేత్తిన సంగతి తెలిసిందే. తాజాగా ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఆ మమ్మీల ముఖ చిత్రాలు ఎలా ఉంటాయనే ఓ వీడియో ట్విటర్లో తిరుగుతోంది. ఈ వీడియోను వాలా అఫ్షర్ అనే యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
.
This is how AI was used to recreate the faces of Egyptian monarchy pic.twitter.com/wPJaTEknKK
— Vala Afshar (@ValaAfshar) October 17, 2022
చదవండి: జియో డబుల్ ఫెస్టివల్ బొనాంజా: ఆ ప్లాన్‌లతో రీచార్జ్, ఈ బెనిఫిట్స్ అన్నీ మీకే!