ప్రమాద దృశ్యాలు
కైరో : రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొట్టుకున్న ఘటనలో 32 మంది మృత్యువాతపడగా 66 మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఈ సంఘటన ఈజిప్టులోని సోహగ్ ప్రావిన్స్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. రెండు రైళ్లు ఢీకొట్టుకున్న వేగానికి చాలా కోచ్‌లు చెల్లాచెదురయ్యాయి. దీంతో చాలా మంది ప్రయాణికులు అందులో ఇరుక్కుపోయారు. దఫల్ అల్ సవమ్, తాహ్త సిటీ మధ్య ఈ ఘోరం జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుని సహాయక చర్యలు చేపట్టారు. కోచ్‌ల మధ్య ఇరుక్కుపోయిన వారిని బయటకు తీయటానికి చుట్టు పక్కలి గ్రామాల జనం కూడా సహాయపడుతున్నారు. ఇప్పటికే 49 అంబులెన్స్‌లు క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించటంలో సహాయపడుతున్నాయి. మొరగ, తాహ్త, సోహగ్ హాస్పిటల్లలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఈజిప్టు రైల్వే శాఖ పని తీరు బాగాలేకపోవటంత కారణంగానే తరచుగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. 2017 సంవత్సరంలో అత్యధికంగా దాదాపు 1,793 ప్రమాదాలు జరిగాయి. 2017 ఆగస్టులో అలెగ్జాండ్రియా సిటీ వద్ద రెండు రైళ్లు ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో 36 మంది మరణించగా.. 123 మంది గాయపడ్డారు.
చదవండి, చదివించండి : స్టీవ్ జాబ్స్ ఉద్యోగ దరఖాస్తు వేలం.. ఎంతో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment