
విజయవాడ: బయటి విపణిలో ఉల్లిపాయల ధరలు దిగిరావడం లేదు. దేశమంతా ఈ సమస్య నెలకొని ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా రైతుబజార్లలో కిలో రూ.25కు అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని డిమాండ్‌కు తగిన విధంగా ఉల్లిపాయలు అందరికీ అందించేందుకు ఈజిప్టు దేశం నుంచి ఉల్లిపాయలను దిగుమతి చేస్తోంది. సదరు ఉల్లిపాయలు విజయవాడ స్వరాజ్య మైదానానికి దిగుమతి అయ్యాయి. కృష్ణా జిల్లాలో సరఫరా చేసేందుకు 1120 బస్తాలను సంసిద్ధం చేసింది. చూడటానికి కొంచెం పెద్ద సైజులో ఉన్నా రుచికేం ఢోకా ఉండదని చెబుతున్నారు.