Onions prices
-
నెలలో రెట్టింపైన ఉల్లి ధర.. ఎగుమతి సుంకంపై మంత్రి ఏమన్నారంటే..
ప్రభుత్వం ఉల్లిపై విధించిన 40 శాతం ఎగుమతి సుంకాన్ని తొలగించే అవకాశం లేదని ఇటీవల కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కలిసిన వాణిజ్య వర్గాలు తెలిపాయి. ఉల్లి ధర గడిచిన 15 రోజుల్లో దాదాపు 40 శాతం పెరిగింది. గత నెలతో పోలిస్తే ఏకంగా రెట్టింపైందని మార్కెట్ గణాంకాలు చెబుతున్నాయి. లాసల్గావ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ(ఏపీఎంసీ) ధరల ప్రకారం కేజీ ఉల్లి ధర మంగళవారం రూ.28గా ఉంది.ఉల్లి ధరల పెరుగుదలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం గతనెలలో ఏకంగా 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. ఈ చర్యతో ఉల్లి ఎగుమతులు భారీగా తగ్గి, వాటి ధరలు నిలకడగా ఉంటాయన్నది ప్రభుత్వ యోచన. మార్కెట్లో ఉల్లి ధరలు పెరుగుతున్నా దాన్ని గరిష్ఠ స్థాయిలో పండించే రాష్ట్రాల్లో గతంలో వర్షాభావం వల్ల దిగుబడి తగ్గింది. కర్ణాటకలోని రైతులు ఉల్లిని అధికంగా పండిస్తుంటారు. అయితే హీట్‌వేవ్స్ వల్ల రబీలో రైతులు ఉల్లి సాగుపై ఆసక్తి చూపించలేదు.దేశీయంగా ప్రతి నెలా దాదాపు 13 లక్షల టన్నుల ఉల్లి వినియోగమవుతుంది. దేశంలో ఉల్లి ఎక్కువగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పండుతుంది. 65 శాతం పంట ఒక్క రబీలోనే వస్తుంది. అది ఏప్రిల్-మే మధ్య మార్కెట్లోకి వచ్చి అక్టోబరు-నవంబరు వరకు ఉంటుంది. అయితే నిల్వ ప్రక్రియలోనే ఉల్లిపాయలు ఉత్పత్తి బరువులో 30-40 శాతం కోల్పోతాయి. కుళ్లిపోవడంవల్ల కొన్ని వృథా అవుతాయి. అలా పరిమాణంతో పాటు నాణ్యతపరంగానూ నష్టం వాటిల్లుతుంది. దేశంలో ఉల్లిపాయలను నిల్వ చేసేందుకు నాణ్యమైన ఏర్పాట్లు లేకపోవడంవల్ల ఏటా రూ.11 వేల కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని అంచనా.పెరుగుతున్న ఉల్లి ధరల స్థిరీకరణ కోసం ఎగుమతి సుంకాన్ని పెంచి వ్యూహాత్మక నిల్వలను సృష్టించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఉల్లి ధరలు మరింత పెరిగితే బఫర్ స్టాక్ కింద ఉల్లిని సేకరించడం ప్రభుత్వానికి సవాలుగా మారుతుంది. 2022-23లో 25 లక్షల టన్నులుగా ఉండే ఉల్లి ఎగుమతులు 2023-24 ఆర్థిక సంవత్సరంలో 17 లక్షల టన్నులకు తగ్గాయి. 2024 ఏప్రిల్ నుంచి ఈ ఎగుమతులు కేవలం లక్ష టన్నులు మాత్రమే ఉండవచ్చని సమాచారం.ఇదీ చదవండి: వ్యక్తులను గుర్తించే ‘దివ్యదృష్టి’!కొన్నిచోట్ల వ్యాపారస్థులు సిండికేట్‌గామారి ఇదే అదనుగా కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. మహారాష్ట్ర ఉల్లి ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు భరత్ డిఘోలే ఒక వీడియోలో మాట్లాడుతూ..‘రైతులు ప్రభుత్వ సంస్థలైన నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్‌లకు కిలో రూ.40 కంటే తక్కువ ధరకు ఉల్లిని విక్రయించకూడదు. భవిష్యత్తులో ఉల్లి ధరలను తగ్గించేందుకు బఫర్ స్టాక్‌ను ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది’ అని తెలిపారు. -
మహబూబ్‌నగర్: ఉల్లి ధరలు పడిపోవడంతో ఆందోళనలో రైతులు
-
ఈజిప్ట్ టూ విజయవాడ
విజయవాడ: బయటి విపణిలో ఉల్లిపాయల ధరలు దిగిరావడం లేదు. దేశమంతా ఈ సమస్య నెలకొని ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా రైతుబజార్లలో కిలో రూ.25కు అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని డిమాండ్‌కు తగిన విధంగా ఉల్లిపాయలు అందరికీ అందించేందుకు ఈజిప్టు దేశం నుంచి ఉల్లిపాయలను దిగుమతి చేస్తోంది. సదరు ఉల్లిపాయలు విజయవాడ స్వరాజ్య మైదానానికి దిగుమతి అయ్యాయి. కృష్ణా జిల్లాలో సరఫరా చేసేందుకు 1120 బస్తాలను సంసిద్ధం చేసింది. చూడటానికి కొంచెం పెద్ద సైజులో ఉన్నా రుచికేం ఢోకా ఉండదని చెబుతున్నారు. -
రానున్న రోజుల్లో ఉల్లి ‘ఘాటు’
బెంగళూరు : ఉల్లి ధర మరోసారి వినియోగదారుల కంట కన్నీరు పెట్టించనుంది. భారీ వర్షాలు, వరదలు కారణంగా ఉల్లిపాయ ధరలు పెరగనున్నాయి. ముఖ్యంగా ఉత్తర కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో ఎడ తెరిపిలేని వర్షాలు ఖరీఫ్ పంటను ప్రభావితం చేశాయి. ఇప్పటికే లాసాల్గావ్, బెంగళూరు వంటి ప్రధాన మార్కెట్లలో గత పదిహేను రోజులుగా టోకు ధరలు పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో ఉల్లి ధరలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఉత్తర కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అక్కడి ఖరీఫ్ ప్రధాన పంట ఉల్లిపాయల సాగు ఎక్కువగా వేయలేదు. దీంతో మరి కొన్ని రోజుల్లో ఉల్లిపాయలకు తీవ్ర కొరత ఏర్పడవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఉల్లిపాయల మార్కెట్‌కు ప్రధాన కేంద్రంగా ఉన్న లాసాల్గావ్ ప్రాంతంలో ఉల్లిపాయల సాగు గణనీయంగా పడిపోయింది. కర్ణాటక మార్కెట్లో ఉల్లిధర ఆగస్టు మొదటివారం నుంచి ఇప్పటికే 40 శాతం వరకు పెరిగింది. లాసాల్గావ్ ప్రాంతం నుంచి రావాల్సిన పంట చేతికి రాకపోతే ఉల్లిపాయల ధర విపరీతంగా పెరుగుతుందని అంటున్నారు. మరోవైపు ఉల్లిపాయల ఉత్పత్తికి మరో ప్రధాన మార్కెట్ అయిన మహరాష్ట్ర రైతులు భవిష్యత్తులో మరింత డిమాండ్ పెరుగుతుందనే అంచనాలతో ఉల్లిని మార్కెట్‌కు తరలించకుండా, గిడ్డంగుల్లోనే దాచిపెడుతున్నారు. ముందస్తు అంచనాలతో రైతులు ఇలా చేస్తున్నారని వాణిజ్య వర్గాలు తెలిపాయి. దీంతో ఉల్లిపాయల కొరత ఏర్పడి తీవ్ర ప్రభావాన్ని చూపించవచ్చు. అయితే మరొక ప్రధాన ఎగుమతి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా.. కర్నూలులో ఉల్లి సాగు పెరిగితే ఎంతో కొంత కొరతను నివారించవచ్చు. కర్నూలు నుంచి ఉల్లిపాయలు ప్రధానంగా తమిళనాడుకు ఎగుమతి చేస్తారు. -
కొత్త ఉల్లి వచ్చినా.. తగ్గని ఘాటు
దేవరకద్ర(మహబూబ్‌నగర్): దేవరకద్ర మార్కెట్లో ఉల్లిపాయల ధర మరింత పెరిగింది. ధరలు ప్రభావంతో బుధవారం మార్కెట్‌కు వేయి బస్తాల వరకు ఉల్లి పాయలు అమ్మకానికి వచ్చాయి. దీంతో మార్కెట్ అవరణ అంతా ఉల్లిపాయల కుప్పలతో నిండిపోయింది. వేలం జోరుగా సాగింది. క్వింటాల్‌కు గరిష్టంగా రూ. 3600 ధర పలికింది. కనిష్టంగా రూ. 3 వేల వరకు వచ్చింది. ఇక చిన్నసైజు పేడు ఉల్లి పాయలకు రూ. 2 వేల నుంచి రూ.2500 వరకు దక్కింది. కొత్త ఉల్లికి ధర బాగా రావటంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. మార్కెట్లో టోకుగా ఖరీదు చేసిన చిల్లర వ్యాపారులు బయట సంతలో కిలో ఉల్లిని రూ.40 వరకు విక్రయించారు. మార్కెట్లో వ్యాపారులు వేలం ద్వార కొనుగోలు చేసిన ఉల్లిని బస్తాలుగా విక్రయించారు. 45 కేజీల ఉల్లి బస్తా ధర గరిష్టంగా రూ.2 వేల నుంచి కనిష్టంగా రూ.1800 వరకు చిల్లర వ్యాపారులు కొనుగోలు చేశారు. -
కోయకుండానే..కన్నీరు
కడప అగ్రికల్చర్ : వినియోగదారులకు ఉల్లి ధరలు హడలెత్తిస్తున్నాయి. కోయకుండానే కన్నీరు తెప్పిస్తున్నాయి. నిత్యావసరాల్లో భాగమైన ఉల్లిని ప్రతి రోజు వినియోగించక తప్పదు. ప్రస్తుతం ఉల్లి ధర సామాన్యునికి అందకుండా పోతోంది. ఆశించిన స్థాయిలో పంట సాగు లేకపోవడంతో గత ఏడాది లాగా ఈ ఏడాది కూడా ఉల్లిధరలు ఆకాశాన్ని అంటే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నైరుతి రుతువనాలు వచ్చినా వర్షం జాడలేకపోవడం, భూగర్భజలాలు అడుగంటిపోవడం, బోరుబావులు ఎండిపోతుండటం, కరెంటు కోతలు అధికం కావడంతో రైతులు ఉల్లి పంటను సాగు చేయాలంటే జంకుతున్నారు. గత నెలలో రూ.14-15లు ఉన్న కిలో ఉల్లి ధర ఈ నెల ఆరంభం నుంచి రూ. 18-20లకు చేరి క్రమంగా ఎగబాకుతూ పోతోంది. మార్కెట్లో రోజు రోజుకూ రూ.4 పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం కడప పెద్దమార్కెట్లో కిలో రూ. 32-35 మధ్య పలుకుతోంది. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, పులివెందుల మార్కెట్లలో కిలో రూ. 35-40 చొప్పున వ్యాపారులు విక్రయిస్తున్నారు. అధిక ధరల ప్రభావంతో హోటళ్లలో ఉల్లితో తయారు చేసే ఆహార పదార్థాలు లేవని చెబుతున్నారు. హోటళ్లలో బిర్యానీ ఆర్డర్ ఇస్తే ఉల్లిపాయ, నిమ్మకాయ ముక్కలు ఇచ్చేవారు. ప్రస్తుతం ఉల్లిపాయ ముక్కలు లేవని నిర్మోహమాటంగా చెబుతున్నారు. ధరలు రోజు రోజుకూ ఎగబాకుతుండటంతో ఎక్కడ ఉల్లిపంట ఉన్నా మార్కెట్‌యార్డుకు తీసుకురావాలని అధికారులు చెబుతున్నారు. రైతు బజారులో ఉంచి అమ్మకాలు చేయిస్తామని భరోసా ఇస్తున్నారు. అరకొర సాగు : ఈసారి ఎల్‌నినోతో వర్షాలు సంపూర్తిగా కురవని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతుండటంతో ఉల్లిపంటసాగుకు రైతులు ముందుకు రావడ ం లేదు. పెండ్లిమర్రి, వేంపల్లె, -
ఉల్లి ధరలకు చెక్
* టన్నుకు రూ.18 వేల కనీస ఎగుమతి ధర విధించిన కేంద్రం * తద్వారా ఎగుమతులు తగ్గి.. ధరలు దిగుతాయని ఆశాభావం న్యూఢిల్లీ: ఉల్లిపాయల ధరలు మళ్లీ ఆకాశానికి ఎగబాకే అవకాశాలు కనిపిస్తుండడంతో ఆందోళన చెందిన కేంద్ర ప్రభుత్వం వాటిని దించే దిశగా చర్యలకు ఉపక్రమించింది. ఉల్లిపాయల ఎగుమతులను నియంత్రించడం ద్వారా దేశంలో వాటి సరఫరా పెంచేందుకు వీలుగా కనీస ఎగుమతి ధర(ఎంఈపీ)ను మళ్లీ అమల్లోకి తెచ్చింది. టన్నుకు 300 డాలర్ల చొప్పున(దాదాపు రూ.18,000) ఎంఈపీ విధించింది. పక్షం రోజుల కిందట ఢిల్లీలో రూ.15-20 రేటు ఉన్న కిలో ఉల్లిపాయలు ఇప్పుడు రూ.25-30కు పెరిగిపోవడంతో కంగారుపడిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం ఈ ఎంఈపీని మార్చి నెలలో రద్దు చేయగా.. మూడు నెలల తర్వాత కొత్త ప్రభుత్వం దాన్ని మళ్లీ అమల్లోకి తేవడం గమనార్హం. ఎంఈపీ కంటే తక్కువ ధరకు ఎవరూ ఉల్లిపాయలను ఎగుమతి చేయడానికి వీలుండదని వాణిజ్య శాఖ మంత్రి విడుదల చేసిన నోటిఫికేషన్లో తెలిపారు. ఆహార ద్రవ్యోల్బణాన్ని అరికట్టే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానమంత్రి కార్యాలయంలో సమావేశం అనంతరం ఈ చర్య తీసుకున్నట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి కేశవ్ దేశిరాజు చెప్పారు. వ్యవసాయ, వినియోగదారుల వ్యవహారాలు, వాణిజ్య మంత్రిత్వ శాఖల కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సగటున ఏడాదికి 15 లక్షల టన్నుల ఉల్లిపాయలు ఎగుమతి అవుతున్నట్లు దేశిరాజు తెలిపారు. -
ఉల్లి వచ్చేసిందోచ్!
సాక్షి, ముంబై: ఈజిప్టు, పాకిస్థాన్‌తోపాటు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉల్లి నిల్వలు ముంబైకి వస్తుండడంతో ధరలు మరింత తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) ఆవరణలోకి ఆదివారం భారీగా సరు కు చేరుకోవడంతో ముంబైకర్లకు త్వరలో చౌక ధరకే ఉల్లి లభిస్తుందని అధికారులు చెబుతున్నా రు. ఇదివరకు ఆకాశాన్నంటిన ఉల్లి ధరలతో బేజారవుతున్న ముంబైకర్లకు ఈ ఉల్లిరాకతో కొంతమేర ఊరట లభించనుంది. ఏపీఎంసీలోకి 56 టన్నుల చైనా ఉల్లి దిగుమతి కావడంతో టోకు వ్యాపారులకు దీన్ని రూ.37 కేజీ చొప్పున విక్రయిస్తున్నారు. ఉల్లి ధరలు అకస్మాత్తుగా పెరిగిపోవడంతో గృహిణుల ఆర్థిక అంచనాలు తారుమారయ్యాయి. ధరలను నియంత్రించేందుకు వ్యాపారులు ఈజిప్టు, పాకిస్థాన్ నుంచి ఉల్లిని దిగుమతి చేసుకున్నారు. అయినప్పటికీ మార్కెట్లో ఉల్లి ధరలు పెద్దగా తగ్గలేదు. దీంతో గత్యంతరం లేక వ్యాపారులు చైనా నుంచి రెండు కంటెయినర్ల (56 క్వింటాళ్లు) ఉల్లిని దిగుమతి చేసుకున్నారు. ఈ ఉల్లి ఏసీ కంటెయిన ర్లో రావడం వల్ల కొంత తడిగా ఉన్నాయి. అయినప్పటికీ ఆకారంలో ఇవి పెద్దగా ఉండడంతో ఒకే రోజు మొత్తంసరుకు అమ్ముడుపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. భారత్‌లో ఉల్లి సాగుకు నాసిక్ జిల్లా లాసల్గావ్, నిఫాడ్ ప్రాంతాలు ప్రఖ్యాతి చెందాయి. ప్రపంచంలో ఉల్లి పండించే దేశాల్లో చైనా ప్రథమస్థానంలో ఉండగా భారత్ రెండోస్థానంలో ఉంది. 2012లో చైనాలో 2,05, 07,759 మెట్రిక్ టన్నుల ఉల్లి ఉత్పత్తికాగా భారత్‌లో 2012లో 1,33,72,100 మెట్రిక్ టన్నుల ఉల్లి పండింది. చైనా ఉల్లి చూడడానికి పెద్దగా, రుచి కూడా ఉంటుంది. 2010లో ఇలాగే ఉల్లి కొరత ఏర్పడినప్పుడు ముంబైకి చైనా నుంచి దిగుమతి అయిం ది. దీంతో ధరలు కొంత అదపులోకి వచ్చాయి. ఒకపక్క వివిధ ప్రాంతాల నుంచి ట్రక్కులు రాకపోవడంతో లాసల్గావ్ మార్కెట్లో ఉల్లి ధరలు 7.5 శాతం పెరిగిన సంగతి తెలిసిందే. మరోపక్క ఎపీఎంసీకు చైనాతోపాటు కర్ణాటక, ఇతర రాష్ట్రా ల నుంచి పెద్ద సంఖ్యలో ఉల్లి రావడంతో కొత్త ఉల్లి కేజీకీ రూ.25-40 చొప్పున విక్రయిస్తున్నారు. త్వరలో ఉల్లి ధరలు నియంత్రణలోకి వస్తాయని ఎపీఎంసీకి చెందిన ఉల్లి వ్యాపారి శివాజీ డెంబరే ఆశాభావం వ్యక్తం చేశారు. -
మళ్లీ పెరిగిన ఉల్లిధర
మెదక్ రూరల్, న్యూస్‌లైన్: మళ్లీ ఉల్లి ధరలకు రెక్కలొచ్చాయి. నిన్నమొన్నటి వరకు మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ. 45 నుంచి 50 విక్రయించగా మూడు రోజుల నుంచి పాత గడ్డ కిలో రూ. 60, కొత్త గడ్డ కిలో రూ. 50 చొప్పున విక్రయిస్తున్నారు. ఉల్లి ధరలు మాటి మాటికీ పెరగటంతో కొనుగోలు దారులు ఆందోళన చెందుతున్నారు. ఉల్లి ధరల నుంచి ప్రజలను ఆదుకునేందుకు పట్టణంలో ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాన్ని పట్టుమని వారం రోజులు కాకుండానే అధికారులు మూసివేశారు. సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య ఉద్యమం ఉల్లి ధర విపరీతంగా పెరగడానికి కారణమవుతోంది. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి మున్సిపాలిటీల్లో కలెక్టర్ ఆదేశాల మేరకు ఉల్లి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మెదక్ మార్కెట్ యార్డులో గత నెల ఆగస్టు 27న జేసీ శరత్ ఉల్లి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కిలో రూ. 34కు విక్రయించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాన్ని ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జేసీ ఆదేశాలను అమలు చేయాల్సిన అధికారులు ఆది శగా చర్యలు తీసుకోలేదు. వారం రోజుల పాటు కూడా నడపకుండానే కొనుగోలు కేంద్రాన్ని మూసివేశారు. మెదక్ వాసుల కోసం వచ్చిన ఉల్లి నిల్వలను సిద్దిపేటకు తరలించి ఇక తమ పనైపోయిందని అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. మెదక్‌లో ఉల్లి విక్రయ కేంద్రం ఏర్పాటు చేయనప్పుడు స్థానిక కూరగాయల మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ. 70 నుంచి 80 పలికింది. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశాక కిలో రూ. 40 నుం చి రూ. 50కి దిగొచ్చింది. విక్రయ కేంద్రాన్ని మూసివేయగానే మళ్లీ ధరలు పెరిగాయి. కిలో రూ. 50 నుంచి రూ. 55కు చేరింది. మూడు రోజుల నుంచి పాత ఉల్లి గడ్డను కిలో రూ. 60, కొత్త గడ్డను రూ. 50 విక్రయిస్తున్నారు. జిల్లాలో మూడు విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయగా సిద్దిపేట, సంగారెడ్డిలో అక్కడి అధికారులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. మెదక్‌లో మాత్రం ఉల్లి విక్రయ కేంద్రాన్ని మూసివేయడంతో ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని ఉల్లి ధరను అమాం తంగా పెంచి జేబులు నింపుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు మెదక్‌లో ఉల్లి విక్రయ యథావిధిగా కొనసాగించాలని స్థానికులు కోరుతున్నారు. సీమాంధ్ర ఉద్యమాలతోనే ఉల్లికి రెక్కలు సీమాంధ్రలో 46 రోజులుగా సమ్మె జరుగుతుండడం తో ఉల్లి దిగుమతులు పూర్తిగా తగ్గి పోయి డిమాండ్ పెరిగిందని వ్యాపారులు అంటున్నారు. గుంటూరు జిల్లాలో ఉల్లి సాగు అధికమని సమైక్య ఉద్యమం వల్ల ఇబ్బందులు తలెత్తాయని తెలిపారు. ఉద్యమం ఆగి.. గతంలో లాగా ఉల్లి దిగుమతి అయితే ధరలు తగ్గే అవకాశం ఉందని వారు తెలిపారు. లేకుంటే మరింత ప్రియం అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని వ్యాపారులు తెలిపారు. -
ఉల్లిగడ్డ ఉరుకులు!
సంపాదకీయం: పాలనలో దాదాపు పదేళ్ల అనుభవాన్ని గడించినా స్టాక్ మార్కెట్ పాతాళానికి ఎందుకు పరిగెడుతున్నదో, ఉల్లిగడ్డల ధర ఊహకందనంత వేగంగా ఎందుకు పెరుగుతున్నదో తెలియక యూపీఏ ప్రభుత్వం అయోమయంలో పడిపోయింది. ఉల్లిపాయే కాదు... కూరగాయల ధరలన్నీ గత కొంతకాలంగా పైపైకి పోతున్నాయి. పక్షం రోజుల క్రితం ధర పెరిగిన ఉల్లిగడ్డ తగ్గినట్టే తగ్గి మళ్లీ జోరందుకుంది. తన జోక్యం వల్లే పరిస్థితి చక్కబడిందని సర్కారు అనుకుంటుండగానే తిరిగి పరుగులు తీసింది. భగ్గునమండుతున్న ఉల్లి ధరను చల్లార్చడమెలాగో కేంద్రానికి తోచడంలేదు. ఢిల్లీ మొదలుకొని దేశంలోని ప్రధాన నగరాలన్నిటా ఉల్లి ధర హఠాత్తుగా కిలో రూ.60కి చేరుకున్నప్పుడు అందరిలాగే సర్కారూ ఆశ్చర్యపోయింది. అది తేరుకోకముందే అది రూ.80 వరకూ ఎగ బాకింది. ఉల్లి ఉత్పత్తి ఎక్కువుండే రాష్ట్రాల్లో అధిక వర్షాలు కురియడం, సరుకు రవాణాకు ఇబ్బందులేర్పడటంవల్ల ధరలిలా మండుతున్నాయని కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్ సంజాయిషీ ఇస్తున్నారు. పైగా ఉల్లికి ప్రధాన మార్కెట్‌గా ఉన్న నాసిక్ ప్రాంతాన్ని కరువు చుట్టుముట్టి పంట దిగుబడి తగ్గడం కూడా ఇందుకు దోహదపడిందని ఆయన చెబుతున్నారు. ఏ సమస్యనైనా డిమాండు, సరఫరా చట్రంలో చూడటానికి అలవాటుపడి పోయిన సర్కారు ధోరణే నిత్యావసరాల ధరలను ఆకాశానికి ఎగదోస్తున్నది. ఒక ప్రాంతంలో వర్షాలు కురియవచ్చు... ఇంకోచోట కరువు కాటేయవచ్చు. కాదనలేం. కానీ, ఇప్పుడు ఉల్లి దిగుబడిపై ఆ రెండింటి ప్రభావమూ పెద్దగా లేదు. మొత్తంమీద చూస్తే దాని దిగుబడి స్థిరంగా ఉంది. ఇంకా చెప్పాలంటే గత రెండేళ్ల దిగుబడితో పోల్చినా ఈ ఏడాది అది చెక్కుచెదిరింది లేదు. దేశం మొత్తంమీద ఈ జూలై నెలాఖరుకు ఉల్లి దిగుబడి కోటీ 70 లక్షల టన్నులు. గత ఏడాది, అంతకు ముందూ కూడా ఈ సమయానికి ఇంచుమించు ఇదే దిగుబడి ఉంది. ఒక్క ఉల్లిపాయనే కాదు... ఆలుగడ్డలు, వంకాయ, టమాట వంటి దిగుబడులూ అంతే. అయినా, జూలై టోకు ధరల సూచీ చూస్తే గుండె గుభేలుమంటుంది. ఐదు నెలల గరిష్ట స్థాయికి అది చేరుకుంది. నిరుడు జూలైతో పోలిస్తే ధరలన్నీ టోకుగా 5.79 శాతం పెరిగాయి. నాసిక్ మార్కెట్లో ఉల్లి ధర క్వింటాలు రూ.5,000 దాటి పోయింది. మన రాష్ట్రంలో ఇది క్వింటాలుకు రూ.4,800 వరకూ వెళ్లింది. ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో పెంచుతున్నారో, దిగుబడుల అంచనా ఎలా ఉన్నదో, తమ బాధ్యతగా చేయాల్సింది ఏమిటో ఆలోచించే యంత్రాంగం ఉన్నట్టయితే ధరల్లో ఉండగల హెచ్చుతగ్గుల విషయం ముందుగానే అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. వీటికి తోడు రవాణా సౌకర్యాలు సరిగాలేని కారణంగా వర్షాకాలంలో ఇబ్బందులేర్పడతాయని తెలియనిదేమీ కాదు. ఇలాంటి అంశాలన్నిటినీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అందుకు అనుగుణమైన వ్యూహాలు రూపొందించుకుని అమలుచేస్తే పరిస్థితులు ఇలా విషమించవు. కానీ, మన పాలకుల కంటే దళారులు చాలా చురుగ్గా, మెరుగ్గా ఉన్నారు. సరిగ్గా వానా కాలంలో రాబోయే సమస్యలను గమనించుకుని ముందే ఉల్లి నిల్వలను గోదాముల్లో భద్రం చేసుకున్నారు. కృత్రిమ కొరత సృష్టించి ధరలు ఆకాశాన్నంటేలా చేశారు. మన దేశంలో గోడౌన్ల కొరత తీవ్రంగా ఉంది. కూరగాయల పెంపకంలో మన దేశం రెండో స్థానం ఆక్రమిస్తుంటే, వీటిని నిల్వ ఉంచడానికి శీతల గిడ్డంగులు మాత్రం తగినంతగా లేవు. దేశం మొత్తంమీద మన గిడ్డంగుల సామర్ధ్యం 11 కోట్ల 30 లక్షల టన్నులు కాగా, అందులో కూరగాయలకిస్తున్న వాటా కేవలం 15 శాతం మాత్రమే. 1998లో ఉల్లి సంక్షోభం ఏర్పడి ఢిల్లీ, రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాలు కూలిపోగా అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం భాభా అణు పరిశోధనా కేంద్రం సాయంతో నాసిక్ సమీపంలో రూ.8 కోట్లతో అత్యాధునిక యూనిట్‌కు శ్రీకారం చుట్టుంది. ఉల్లి, ఇతర దిగుబడులను ప్రాసెసింగ్ చేసి, వాటిల్లోని హానికారక బాక్టీరియాను, తేమను తొలగించడం ఈ యూనిట్ ప్రధానమైన పని. అలా చేసిన సరుకు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది గనుక అందుకు అవసరమైన గిడ్డంగులను నిర్మించాలని కూడా నిర్ణయించారు. అయితే, ఆ యూనిట్ ప్రారంభమైందిగానీ అందులో ప్రాసెసింగ్ సరిగా సాగటం లేదు. గంటకు పది టన్నుల ఉల్లిని ప్రాసెస్ చేయగలిగే ఈ యూనిట్‌కు గత నాలుగేళ్లుగా ఉల్లిగడ్డలే రాలేదంటే పరిస్థితి ఎలా ఉన్నదో ఊహించుకోవచ్చు. ఇక గిడ్డంగుల నిర్మాణం సంగతి చెప్పనవసరం లేదు. ఇందిరాగాంధీ పాలనాకాలం నుంచి కేంద్రంలో ఉండే ప్రభుత్వాలకు ఉల్లితో చాలా చేదు అనుభవాలున్నాయి. వాటి ధరలు పెరిగినప్పుడల్లా ప్రభుత్వాలు పతనమవుతున్నాయి. అయినా, పాలకులెవరూ గుణపాఠాలు నేర్వడంలేదు. ధరలు పెరిగి, ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాక నిద్రలేచి కొన్ని విక్రయ కేంద్రాలను తెరవడం, హుటాహుటిన నాఫెడ్ వంటి సంస్థలను రంగంలోకి దించి, గ్లోబల్ టెండర్లు పిలిచి ఇరుగు పొరుగు దేశాల నుంచి సరుకు దిగుమతి చేసుకో వడం అలవాటైపోయింది. ఇప్పుడు ఢిల్లీలోనూ, మరికొన్ని నగరాల్లోనూ ప్రభు త్వం చేసింది ఇదే. మరో సంక్షోభం ఏర్పడినప్పుడూ ఇదే తంతు పునరావృతమవు తుంది. ఉల్లి అయినా, ఇతర కూరగాయలైనా నిల్వ ఉంచుకోవడానికి, మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవడానికి రైతులకు చేయూతనిస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయి. అటు రైతులూ బాగుపడతారు. ఇటు ప్రజలకు అధిక ధరల భారమూ తప్పుతుంది. కానీ, అనుభవాలెన్ని ఎదురవుతున్నా గుణపాఠాలు నేర్వని ప్రభు త్వాల వల్ల అటు రైతులు పంట దిగుబడులను తక్కువ రేటుకు విక్రయించి అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఇటు సాధారణ ప్రజానీకం అధిక ధరలతో ఇబ్బందులు పడుతున్నారు. మధ్యలో దళారుల పంట పండుతోంది. ఇప్పుడు ఏర్పడిన ఉల్లి సంక్షోభమైనా పాలకుల కళ్లు తెరిపిస్తుందా? అనుమానమే! -
ఉల్లి ధరల నియంత్రణపై సర్కారు దృష్టి
సాక్షి, హైదరాబాద్: ఉల్లి ధరల అదుపునకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. శనివారం మంత్రులు ముఖేష్ గౌడ్, శ్రీధర్ బాబు పౌరసరఫరా, మార్కెటింగ్ శాఖల ఉన్నతాధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రోజువారీ ధరల సమీక్ష, నియంత్రణకోసం ఉన్నత స్థాయి కమిటీని నియమించారు. ధరల నియంత్రణకు రూ.100 కోట్ల నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉల్లిపాయలు, కూరగాయల ధరలు అందుబాటులో ఉంచడానికి మార్కెటింగ్‌శాఖ అధికారులు నేరుగా రైతుల వద్ద నుంచి సరుకు కొనుగోలు చేసి రైతు బజార్లలో సరసమైన ధరలకు విక్రయించాలని మంత్రులు ఆదేశాలు జారీ చేశారు.