కోయకుండానే..కన్నీరు
కడప అగ్రికల్చర్ : వినియోగదారులకు ఉల్లి ధరలు హడలెత్తిస్తున్నాయి. కోయకుండానే కన్నీరు తెప్పిస్తున్నాయి. నిత్యావసరాల్లో భాగమైన ఉల్లిని ప్రతి రోజు వినియోగించక తప్పదు. ప్రస్తుతం ఉల్లి ధర సామాన్యునికి అందకుండా పోతోంది. ఆశించిన స్థాయిలో పంట సాగు లేకపోవడంతో గత ఏడాది లాగా ఈ ఏడాది కూడా ఉల్లిధరలు ఆకాశాన్ని అంటే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నైరుతి రుతువనాలు వచ్చినా వర్షం జాడలేకపోవడం, భూగర్భజలాలు అడుగంటిపోవడం, బోరుబావులు ఎండిపోతుండటం, కరెంటు కోతలు అధికం కావడంతో రైతులు ఉల్లి పంటను సాగు చేయాలంటే జంకుతున్నారు.
గత నెలలో రూ.14-15లు ఉన్న కిలో ఉల్లి ధర ఈ నెల ఆరంభం నుంచి రూ. 18-20లకు చేరి క్రమంగా ఎగబాకుతూ పోతోంది. మార్కెట్‌లో రోజు రోజుకూ రూ.4 పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం కడప పెద్దమార్కెట్‌లో కిలో రూ. 32-35 మధ్య పలుకుతోంది.
జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, పులివెందుల మార్కెట్‌లలో కిలో రూ. 35-40 చొప్పున వ్యాపారులు విక్రయిస్తున్నారు. అధిక ధరల ప్రభావంతో హోటళ్లలో ఉల్లితో తయారు చేసే ఆహార పదార్థాలు లేవని చెబుతున్నారు. హోటళ్లలో బిర్యానీ ఆర్డర్ ఇస్తే ఉల్లిపాయ, నిమ్మకాయ ముక్కలు ఇచ్చేవారు. ప్రస్తుతం ఉల్లిపాయ ముక్కలు లేవని నిర్మోహమాటంగా చెబుతున్నారు. ధరలు రోజు రోజుకూ ఎగబాకుతుండటంతో ఎక్కడ ఉల్లిపంట ఉన్నా మార్కెట్‌యార్డుకు తీసుకురావాలని అధికారులు చెబుతున్నారు. రైతు బజారులో ఉంచి అమ్మకాలు చేయిస్తామని భరోసా ఇస్తున్నారు.
అరకొర సాగు :
ఈసారి ఎల్‌నినోతో వర్షాలు సంపూర్తిగా కురవని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతుండటంతో ఉల్లిపంటసాగుకు రైతులు ముందుకు రావడ ం లేదు. పెండ్లిమర్రి, వేంపల్లె,