సాక్షి, కడప : ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్‌లో ఎరువుల కొరతతో రైతులు ఇక్కట్లు ఎదుర్కోవడం మామూలైపోయింది. అధికారుల నిర్లక్ష్యం, డీలర్ల స్వా ర్థం వల్ల రైతులు నష్టపోవాల్సి వస్తోంది. సీజన్ ప్రారంభమై నెల గడిచిపోయింది. మంచి వర్షం కురిస్తే విత్తనాలు వేయడానికి అత్యధిక శాతం రైతులు పొలాలను సిద్ధం చేసుకున్నారు. అష్టకష్టాలు పడి విత్తనాలను సమకూర్చుకున్నారు.
ప్రభుత్వం సరఫరా చేసిన విత్తనాలు సరిపోక పలువురు రైతులు మార్కెట్లో కొనుక్కోవాల్సి వచ్చింది. ప్రస్తుతం వర్షాలు లేనందున రైతులు రసాయనిక ఎరువులు కొనుగోలు చేయడానికి పెద్దగా ముందుకు రావడం లేదు. వర్షాలు పడివర్షం కురిస్తే బాదుడే విత్తనం వేయడం మొదలైతే ఎరువులకు డిమాండ్ పెరుగుతుంది. వర్షాలు కురిశాక ఏర్పడే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు ఇప్పటి నుంచే కృత్రిమ కొరత ృసష్టించడం ప్రారంభించారు. విత్తనాల గోలలో పడి తలబొప్పి కట్టించుకున్న వ్యవ సాయ శాఖ అధికారులు ఈ విషయంపై ఇంకా దృష్టి సారించలేదు. ఈ విషయం కొంత మంది అధికారులకు తెలిసినా డీలర్లతో ఉన్న సంబంధాల రీత్యా వారు నోరు మెదపడం లేదు. ్రైపస్తుత ఖరీఫ్ సీజన్‌లో 2,17,629 హెక్టార్లలో అన్ని రకాల పంటలు సాగు కావడం తథ్యమని వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
ఇటీవల కురిసిన అరకొర వర్షాలకు దాదాపు 3285 హెక్టార్లలో రైతులు పంటలు సాగు చేశారు. ఈ నేపథ్యంలో ఈసారి ఖరీఫ్‌కు సంబంధించి 1.20 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని అధికారులు నివేదికలు రూపొందించారు. ఇప్పటి వరకు కేవలం 35 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు మాత్రమే జిల్లాకు చేరాయి. అయితే ఉన్న ఫలంగా మంచి వర్షాలు కురిస్తే అన్నిచోట్ల ఒకేసారి విత్తనానికి రైతులు సిద్ధమవుతారు కాబట్టి ఎరువుల కొరత ఏర్పడే ప్రమాదం స్పష్టమవుతోంది.
ఎమ్మార్పీ ధరకంటే అధికంగా వసూళ్లు
జిల్లాలోని పలుచోట్ల ఎరువులను డీలర్లు ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ఎమ్మార్పీ ధరను ప్రక్కనపెట్టి డిమాండును బట్టి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 50 కిలోల యూరియా బస్తా రూ. 284 అయితే, రూ.300 పైబడి అమ్ముతున్నారు. ఎరువుల కొరత తథ్యం అని భావించిన వ్యాపారులు డీఏపీ, పొటాష్ తదితర ఎరువులను గోడౌన్‌లో దాచుకుని, రైతులకు స్టాక్ లేదని చెబుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ప్రస్తుత సీజన్‌లో ప్రతి షాపును తనిఖీ చేయాల్సి ఉన్నా మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడా కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు.
వర్షం కురిస్తే బాదుడే
Published Sun, Jul 5 2015 2:41 AM | Last Updated on Sun, Sep 3 2017 4:53 AM
Advertisement
Advertisement