ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడాకారులు పోటీ పడే విశ్వ క్రీడా వేదిక ప్యారిస్ ఒలింపిక్స్‌లో అద్భుతం చోటు చేసుకుంది. ఏ రంగంలోనైనా రాణించాలంటే మహిళలు మరింత కష్టపడాలి. అయితే తాము అనుకున్నది సాధించే క్రమంలో మహిళలు ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా భరిస్తారు. ఈ మాటలను అక్షరాలా నిజం చేశారు. ఈజిప్ట్ ఫెన్సర్ నడా హఫేజ్. ఆమె ఏడు నెలల గర్భంతో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగారు. ఒలింపిక్ చరిత్రలో ఏడు నెలల గర్భిణి పోటీలో నిలవడం, అదీ టాప్ టెన్‌లో నిలవడం విశేషంగా నిలిచింది.
ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా స్వయంగా హఫేజ్ వివరించారు. జీవితం, క్రీడలు ప్రయాణం ఎంత శ్రమతో కూడుకున్నదో వివరించింది. ‘నేను లిటిల్ ఒలింపియన్‌ను మోస్తున్నాను. శారీరకంగా, మానసికంగా ఎదురవుతున్న సవాళ్లలో మా ఇద్దరికీ సమాన వాటా ఉంది. జీవితం, ఆటను బ్యాలెన్స్ చేసేందుకు పోరాడాల్సి వస్తోంది’ అంటూ తొలి రౌండ్ గెలిచిన తర్వాత 26 ఏండ్ల హఫేజ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
పోడియంపై మీకు ఇద్దరు ఆటగాళ్ళుగా కనిపిస్తున్నారు, వారు నిజానికి ఇక్కడ ముగ్గురున్నారు. అది నేను, నా పోటీదారు, నా చిన్న పాప! శారీరక, మానసిక శ్రమ సవాళ్లలో నాతోపాటు, ఆ చిన్నిపాపాయికి కూడా వాటా ఉంది. అంతేకాదు తన ఈ ప్రయాణంలో తన భర్త సహకారం కూడా ఏంతో ఉందని, తన ఫ్యామిలీ తనపై నమ్మకాన్ని ఉంచడం తన అదృష్టమని కూడా తెలిపింది. అలాగే ప్రపంచ 10వ ర్యాంకర్ ఎలిజబెత్ టార్టకోవ్‌స్కీపై ఓపెనింగ్‌లో ఎలా విజయం సాధించిందో వివరించింది. టార్టకోవ్‌స్కీతో జరిగిన మహిళల వ్యక్తిగత ఫెన్సింగ్‌లో హఫీజ్ 15-13తేడాతో తన మొదటి బౌట్‌ను గెలుచుకుంది, అయితే పారిస్ గేమ్స్‌లో 16వ రౌండ్‌లో దక్షిణ కొరియాకు చెందిన జియోన్ హయోంగ్ చేతిలో ఓడిపోయింది. గతంలో ఈజిప్ట్ తరపున 2016 , 2020 ఒలింపిక్స్‌లో సాబ్రే క్రీడలో పోటీ పడింది.
Comments
Please login to add a commentAdd a comment