
కైరో : ఈజిప్టులోని సినాయీ పెనిన్సులాలో ఓ చెక్ పోస్ట్‌పై బుధవారం ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. రంజాన్ పర్వదినం సందర్భంగా అల్ అరీష్ నగరంలో ముస్లింలు ప్రార్థనలు జరుపుతున్న నేపథ్యంలో మరోవైపు ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. మృతి చెందిన వారిలో ఇద్దరు అధికారులు, ఎనిమిది మంది ఆర్మీ అధికారులు ఉన్నారు. చెక్ పాయింట్ వద్ద దాడి అనంతరం ఆయుధాలు ఉన్న ఓ వాహనాన్ని తీసుకొని ఉగ్రవాదులు తప్పించుకుపారిపోవాలని ప్రయత్నించారు. అయితే, వెంటనే ఓ యుద్ధ విమానంలో వారిని వెంటాడిన భద్రతా బలగాలు ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చాయి.