గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశమంతటా అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకల్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఈజిప్ట్‌లోని కైరో భారత రాయబార కార్యాలయంలో చోటు చేసుకుంది. ఓ విదేశీయురాలి నోట మన దేశభక్తి గీతం పలకడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అందుకు సంబందించిన వీడియోని కైరోలోని భారత రాయబార కార్యాలయం నెట్టింట షేర్ చేసింది.
ఆ వీడియోలో ఈ జిప్ట్‌కి చెందిన కరీమాన్ అనే అమ్మాయి దేశభక్తి గీతం "దేశ్ రంగీలా" పాటను ఎంతో చక్కగా ఆలపించింది. ఈ వీడియోని చూసి ప్రధాని నరేంద్ర మోదీ ఆమె ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్రయత్నానికి ఆమెను అభినందిస్తున్నాను. ఆమెకు అద్భుతమైన భవిష్యత్తు ఉందంటూ ప్రశంసించారు. కాగా, 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కరీమాన్ పాడిన పాట ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అక్కడి రాయబార కార్యాలయంలో కరీమాన్ గానం అటు భారతీయులను, ఈజిప్షియన్లను ఎంతగానో ఆకట్టుకోవడం విశేషం.
A young Egyptian girl Kariman presented a patriotic song "Desh Rangeela" during 75th #RepublicDay celebrations at 'India House'. Her melodious singing and correct intonation impressed the large gathering of Indians and Egyptians. @MEAIndia @IndianDiplomacy @MinOfCultureGoI pic.twitter.com/7mQiZY4Q77
— India in Egypt (@indembcairo) January 28, 2024
Comments
Please login to add a commentAdd a comment