చెన్నైలో 11 అంతస్తుల భవనం కూలిన ప్రదేశాన్ని కాంగ్రెస్ నాయకులు చిరంజీవి, బొత్స సత్యనారాయణ, సి.రామచంద్రయ్య పరిశీలించారు.
చెన్నై: చెన్నైలో 11 అంతస్తుల భవనం కూలిన ప్రదేశాన్ని కాంగ్రెస్ నాయకులు చిరంజీవి, బొత్స సత్యనారాయణ, సి.రామచంద్రయ్య పరిశీలించారు. ఇలాంటి మానవ తప్పిదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు పది లక్షల రూపాయిల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమండ్ చేశారు.
నిర్మాణంలో ఉన్న భవనం కూలడంతో 16 మంది మరణించగా, చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. బాధితుల్లో ఎక్కువమంది తెలుగువారే. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందినవారు. సంఘటన స్థలాన్ని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, జయలలిత పరిశీలించారు.