చెన్నై బాధితులకు చంద్రబాబు పరామర్శ | Chandrababu Naidu meets victims of Chennai building collapse | Sakshi
Sakshi News home page

చెన్నై బాధితులకు చంద్రబాబు పరామర్శ

Published Mon, Jun 30 2014 3:08 PM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM

చెన్నై బాధితులకు చంద్రబాబు పరామర్శ - Sakshi

చెన్నై బాధితులకు చంద్రబాబు పరామర్శ

హైదరాబాద్: చెన్నైలో 11 అంతస్తుల భవనం కూలిన ప్రదేశాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పరిశీలించారు. అక్కడ బాధితులను పరామర్శించి అన్ని విధాలా ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఉదయం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ప్రధాని నరేంద్ర మోడీతో కలసి పీఎస్ఎల్వీ సీ 23 ఉపగ్రహ ప్రయోగం వీక్షించిన చంద్రబాబు అనంతరం చెన్నైకు వెళ్లారు.

చెన్నై దుర్ఘటనలో ఇప్పటి వరకు 17 మంది మరణించగా, మరికొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారు. బాధితుల్లో ఎక్కువగా తెలుగువారు, అందులోనూ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. శిథిలాల కింద ఉన్న వారిలో కొంతమందిని రక్షించగా, మిగిలనవారి కోసం సహాయక చర్యలు చేపడుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement