
గుజరాత్‌లో కూలిన జంట భవనాలు
సాక్షి, ముంబై/వడోదరా: గుజరాత్‌లో మూడంతస్తుల జంట భవనాలు కుప్పకూలిపోయాయి. వదోదరా నగరంలో అట్లాదారా ప్రాంతంలోనున్న మాధవ్‌నగర్‌లో బుధవారం వేకువ జామున 4.30 గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. 11మంది దుర్మరణం చెందారు. మరో 40 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు.
ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృం దాల సాయంతో స్థానిక యంత్రాంగం ముమ్మరంగా సహాయక చర్యలు సాగిస్తోంది. శిథిలాల్లో చిక్కుకున్న 8 మందిని సురక్షితంగా బయటకు తీసినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఆరునెలల శిశువు, పదమూడేళ్ల బాలు డు ఉన్నట్లు సర్ సాయాజీరావు జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దేవేశ్వర్ పాండే చెప్పారు. జంట భవనాలు వేకువ జామున కుప్పకూలాయని, అప్పటికి అందరూ గాఢనిద్రలో ఉండటంతో ఎవరూ తప్పించుకోలేకపోయారని వదోదరా అగ్నిమాపక అధికారులు చెప్పారు.