కుప్పకూలిన భవనం: 19 మంది మృతి | 19 killed, 8 injured in building collapse in Egypt | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన భవనం: 19 మంది మృతి

Published Wed, Nov 26 2014 8:49 AM | Last Updated on Sat, Sep 2 2017 5:10 PM

కుప్పకూలిన భవనం: 19 మంది మృతి

కుప్పకూలిన భవనం: 19 మంది మృతి

కైరో: ఈజిప్టు రాజధాని కైరోలోని మటారియా జిల్లాలో ఎనిమిది అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ప్రమాదంపై సమాచారం అందగానే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని చెప్పారు. మృతులు, క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు.

ఈ భవనం కుప్పకూలడంపై  ప్రాధమిక విచారణ పూర్తి అయిందని తెలిపారు. ప్రభుత్వం అనుమతి లేకుండా భవన యజమాని ఆరు అంతస్తులపై మరో రెండు అంతస్తులను నిర్మించాడని పేర్కొన్నారు. రెండవ అంతస్తులో భవనం లోపల పునర్ నిర్మాణ పనులు చేపట్టడం కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని ఉన్నతాధికారులు తెలిపారు. భవన యజమానిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ప్రమాదం మంగళవారం చోటు చేసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement