ముంబైలో కుప్పకూలిన ఏడంతస్థుల భవనం | Seven-storey building collapses in Mumbai, | Sakshi
Sakshi News home page

ముంబైలో కుప్పకూలిన ఏడంతస్థుల భవనం

Published Fri, Mar 14 2014 1:21 PM | Last Updated on Sat, Sep 2 2017 4:42 AM

Seven-storey building collapses in Mumbai,

ముంబై శాంతాక్రాజ్ శివారులోని వకోలాలో ఏడంతస్థుల భవనం శుక్రవారం ఉదయం కుప్పకూలింది. అయితే ఆ భవనంలో ఎవరు నివసించడం లేదని బృహన్ ముంబై మున్సిపల్ అధికారులు వెల్లడించారు.అయితే కుప్పకూలిన భవనం మురికవాడ పక్కన ఉందని శిథిలాల కింద కొంత మంది చిక్కుకుని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.

 

ఆ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే బృహన్ ముంబై మున్సిపల్ అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బృహన్ మున్సిపల్ కార్పోరేష్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆ ఘటనపై మరింత సమాచారం అందవలసి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement