Vikhroli
-
తెగిపోయిన ఓవర్‌హెడ్‌వైర్
సాక్షి, ముంబై: ముంబై లైఫ్లైన్లుగా పేర్కొనే లోకల్ రైళ్లకు అంతరాయం కలిగింది. ఘాట్కోపర్ రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం ఉదయం 7.16 గంటలకు ‘స్లో ట్రాక్’పై ఓవర్‌హెడ్ వైర్ తెగిపోయింది. తత్ఫలితంగా రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ములూండ్-మాటుంగా రైల్వేస్టేషన్ల మధ్య లోకల్ రైళ్ల రాకపోకలు చాలాసేపు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే ఈ ఘటన అనంతరం స్లో ట్రాక్‌పై నడిచే లోకల్ రైళ్లను ములూండ్-మాటుంగా రైల్వేస్టేషన్ల మధ్య ఫాస్ట్ ట్రాక్‌పై మళ్లించి నడిపించారు. దీంతో ప్రయాణికులకు కొంత ఊరట లభించింది. అయితే అంతా విధులకు వెళ్లే సమయంలో ఈ ఘటన జరగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అనేకమంది విధులకు ఆలస్యంగా చేరుకోగా మరికొందరు విధులకు వెళ్లకుండానే ఇంటికి వెనుదిరిగారు. మరోవైపు రైళ్లు ఆలస్యంగా నడవడంతో ఆయా స్టేషన్లలో రద్దీ కనిపించింది. ప్లాట్‌ఫాంలన్నీ ప్రయాణికులతో కిటకిటలాడాయి. సుమారు నాలుగు గంటల అనంతరం రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. అయినప్పటకీ రైళ్లు సాయంత్రం వరకు ఆలస్యంగానే నడిచాయి. మరోవైపు పలు రైళ్లను రద్దు చేయాల్సివచ్చింది. మరోవైపు అనేకమంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరేందుకు బెస్టు బస్సులతోపాటు ఆటో ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. దీంతో బెస్టు సంస్థ కూడా అదనంగా బస్సులను నడిపింది. తత్ఫలితంగా ట్రాఫిక్ సమస్య తలెత్తింది. -
ఆరుకు చేరిన ముంబై మృతుల సంఖ్య
ముంబై : ముంబై శాంతాక్రాజ్ శివారులోని వకోలాలో ఏడంతస్థుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. శుక్రవారం ఉదయం భారీ భవనం కూలిపోవడంతో శిధిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కూలిన ఆ భవనంలో ఎవరు నివసించడం లేదని బృహన్ ముంబై మున్సిపల్ అధికారులు వెల్లడించారు.అయితే కుప్పకూలిన భవనం మురికవాడ పక్కన ఉందని శిథిలాల కింద కొంత మంది చిక్కుకున్నారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే బృహన్ ముంబై మున్సిపల్ అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బృహన్ మున్సిపల్ కార్పోరేష్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. -
ముంబైలో కుప్పకూలిన ఏడంతస్థుల భవనం
ముంబై శాంతాక్రాజ్ శివారులోని వకోలాలో ఏడంతస్థుల భవనం శుక్రవారం ఉదయం కుప్పకూలింది. అయితే ఆ భవనంలో ఎవరు నివసించడం లేదని బృహన్ ముంబై మున్సిపల్ అధికారులు వెల్లడించారు.అయితే కుప్పకూలిన భవనం మురికవాడ పక్కన ఉందని శిథిలాల కింద కొంత మంది చిక్కుకుని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే బృహన్ ముంబై మున్సిపల్ అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బృహన్ మున్సిపల్ కార్పోరేష్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆ ఘటనపై మరింత సమాచారం అందవలసి ఉంది. -
నలుగురు కుటుంబీకుల ఆహుతి
సాక్షి, ముంబై: విక్రోలీలోని ఎస్ఆర్ఏ భవనంలో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఈ ఘటనలో మృతి చెందగా ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం మిగిల్చింది. సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో పార్క్‌సైట్ సిద్ధార్థ్‌నగర్ కైలాస్ కాంప్లెక్స్‌లోని ఎస్ఆర్ఏ భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. మృతులను గౌతం శిగవణ్ (55), పూర్ణిమా శివగణ్ (50), విశాల్ శివగణ్ (25), ఆయుష్ శార్దుల్గా (05) గుర్తించారు. రోజుమాదిరిగానే ఆదివారం రాత్రి ఈ భవనంలో నిద్రించిన శివగణ్ కుటుంబీకులను మంటలు చుట్టుముట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రాథమికంగా అందిన వివరాల మేరకు ఎలక్ట్రిక్ మీటర్ బాక్స్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగిసిపడ్డాయి. చూస్తుండగానే వైర్లన్నింటికీ మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున ప్రమాదం సంభవించింది. ఆ భవనంలో అప్పటికే గాఢనిద్రలో ఉన్న వాళ్లు ఏమి జరుగుతుందో తెలుసుకోలేకపోయారు. కొందరు మేల్కోని ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకి పరుగులు తీశారు. అయితే ఐదు, ఆరో అంతస్తులో నివసించేవారికి మాత్రం కిందికి దిగేందుకు ఆలస్యమయింది. దీంతో శిగవణే కుటుంబీకులు నలుగురు అక్కడే ప్రాణాలు వదిలారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైనవారిని వికాస్ శిగవణే (26), గుణాజీ యాదవ్ (67), సిద్దేశ్ పాట్కర్ (23), బాలకృష్ణ అంబోలి (45), రాహుల్ ఇంగలే (31), వనితా ఆంబోలిగా గుర్తించారు. మిగతా ముగ్గురి పేర్లు తెలియరాలేదు. వీరందరిని సైన్ ఆస్పత్రికి తరలించారు. పలువురి పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్లు పేర్కొన్నారు.