mumbai city
-
ముంబైలో హై అలర్ట్..
-
ముంబైని ముంచెత్తిన వర్షాలు
-
ముంబైలో మహిళ దారుణ హత్య
-
ముంబై: ‘ఆపరేషన్ ఆలౌట్’.. దడ మొదలైంది!
సాక్షి, ముంబై: ముంబై పోలీసులు ఆపరేషన్ ఆలౌట్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా దాదాపు 39 మంది నేరస్తులను ముంబై పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. మరో 74 మందిపై కేసులు నమోదు చేశారు. ఇక నగరంలోని అనుమానాస్పదంగా ఉన్న దాదాపు 951 చోట్ల పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ముంబై పోలీసులు గత కొద్ది రోజులుగా చేపడుతున్న ‘ఆపరేషన్ ఆలౌట్’ పథకం సత్పలితాలనిస్తోంది. ఈ కూంబింగ్ ఆపరేషన్‌లో స్థానికంగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న నేరస్తులతో పాటు పరారీలో ఉన్న కరుడు గట్టిన నేరస్తులు, లైసెన్స్ లేని ఆయుధాలతో తిరుగుతున్న నేరస్తులు కూడా ఇందులో పట్టుబడుతున్నారు. దీంతో కరుడుగట్టి నేరస్తులతోపాటు ఇళ్లల్లో దాక్కున్న సాధారణ నేరస్తుల్లో దడ మొదలైంది. ముంబై సీపీ నేతృత్వంలో.. శివ్ (శివాజీ) జయంతి సమీపిస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటచేసుకోకుండా ముంబై పోలీసులు ఆపరేషన్ ఆలౌట్ చేపట్టారు. ముంబై పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్, విశ్వాస్ నాంగరే–పాటిల్, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ల మార్గదర్శనంలో కూంబింగ్ ఆపరేషన్ జరిగింది. తమ తమ పోలీసుస్టేషన్ల హద్దులో పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు 259 చోట్ల కూంబింగ్ నిర్వహించారు. అందులో పరారీలో ఉన్న 39 మంది నేరస్తులను పట్టుకోగా లైసెన్స్ లేకుండా అక్రమంగా ఆయుధాలతో తిరుగుతున్న 37 మందిపై, నగర బహిష్కరణకు గురైన మరో 37 మందిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా అక్రమంగా నివాసముంటున్న వారిపై కూడా ఈ ఆపరేషన్‌లో చర్యలు తీసుకున్నారు. అందులో హోటళ్లు, ముసాఫిర్ ఖానా, లాడ్జింగులు, గెస్ట్ హౌస్‌లు తదితర అద్దె నివాస గృహాలలో 951 చోట్ల తనిఖీలు నిర్వహించారు. అలాగే మొత్తం ముంబైలో 149 చోట్ల నాకా బందీలు చేపట్టి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 39 మందిపై కేసులు నమోదు చేశారు. ఆపరేషన్ ఆలౌట్‌లో భాగంగా రోడ్లపై, జంక్షన్ల వద్ద, సిగ్నల్స్ వద్ద అడుక్కుంటున్న 50 మంది బిక్షగాళ్లపై చర్యలు తీసుకున్నారు. బిక్షగాళ్ల రహిత నగరంగా తీర్చిదిద్దడమూ ఈ ఆపరేషన్ లక్ష్యమే. సిగ్నల్స్ వద్ద, ప్రార్థన స్థలాలవద్ద అడుక్కుంటున్న బిక్షగాళ్లందరిని పట్టుకోవాలని అన్ని పోలీసు స్టేషన్లకు ఆదేశాలిచ్చారు. దీంతో పోలీసులు దొరికిన వారిని దొరికినట్లు అదుపులోకి తీసుకుని చర్యలు తీసుకున్నారు. ఇదిలాఉండగా ముంబై పోలీసులు ‘ఆపరేషన్ ముస్కాన్’ పేరుతో ఆపరేషన్ చేపట్టారు. ఇందులో ఇంటి నుంచి పారిపోయి వచ్చిన లేదా నగరాన్ని తిలకించేందుకు వచ్చి తప్పిపోయి తిరుగుతున్న లేదా ప్రేమలో మోసపోయి ఇంటికి వెళ్లలేక ఇక్కడే తిరుగుతున్న పిల్లలన్ని పట్టుకుని వారి ఇళ్లకు పంపించే ఏర్పాట్లు చేశారు. ఇందులో అనేక మంది పిల్లలు రైల్వే స్టేషన్ల బయట, ప్లాట్‌ఫారాలపై, బస్టాండ్లలో, ఫుట్‌పాత్‌లపై లభించారు. వీరి చిరునామా సేకరించి ఇళ్లకు పంపించడంతో అనేక పేద కుటుంబాలు ఉపరి పీల్చుకున్నాయి. అంతేగాకుండా ఈ పథకం చేపట్టినందుకు ముంబై పోలీసులు వివిధ రంగాల నుంచి ప్రశంసలు అందుకున్నారు. చదవండి: మరోసారి ఈ నగరాల్లో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు ఉత్తరాఖండ్: మూడేళ్ల కొడుకును వదిలి -
న్యూయార్క్ కన్నా మన ముంబైలోనే చౌక
సాక్షి, న్యూఢిల్లీ : ఆధునిక జీవన శైళికి సంబంధించి చాలా విషయాల్లో అమెరికాలోని న్యూయార్క్ నగరం కన్నా మన ముంబై నగరం ఎంతో చీప్. సినిమా టిక్కెట్లు, టాక్సీ ట్రిప్పులు, ఫ్యాన్సీ డిన్నర్లు న్యూయార్క్ కన్నా ముంబైలో 17 శాతం నుంచి 33 శాతం వరకు చౌకని దాయ్చూ బ్యాంక్ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది. ఇక ఐఫోన్ ఎక్స్ఎస్లయితే న్యూయార్క్ నగరం కన్నా మన ముంబైలోనే యమ ఖరీదు. అక్కడికన్నా ఇక్కడ 131 శాతం ధర ఎక్కువ. పెట్రోలు కూడా అక్కడి కన్నా ఇక్కడే ఎక్కువ. అందుకు కారణం అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతుండడం, అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం, అధిక పన్నులు అందుకు కారణం. ఆపిల్ ఉత్పత్తులైన మ్యాక్‌బుక్స్, ఐపాడ్స్, ఆపిల్ వాచ్‌లు ఒక్క న్యూయార్క్ ఏమిటో ప్రపంచంలోని అనేక దేశాల్లోకెల్లా భారత్‌లోనే ఖరీదు. ఈ విషయాన్ని ఆపిల్ సీఈవో టిమ్ కుక్ స్వయంగా అంగీకరించారు కూడా. 2018, సెప్టెంబర్ నెలలో మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ ఎక్స్ఎస్ ధర భారత్‌లో 1635 డాలర్లు (1.14 లక్షల రూపాయలు). అదే అమెరికాలో 1250 డాలర్లు. మన కన్నా అర్జెంటీనా, టర్కీ, బ్రెజిల్ దేశాల్లో మనకన్నా ఐఫోన్ ధర ఎక్కువే. ఆపిల్ ఉత్పత్తులపై మన దేశం దిగుమతి సుంకాలను ఎక్కువగా పెంచడం, ఆపిల్ కంపెనీ కాకుండా మధ్యవర్తితో అమ్మకాలు జరిపించడం వల్ల ధరలు అధికంగా ఉంటున్నాయి. సెల్ఫోన్ల కొనుగోళ్లలో ప్రపంచంలోనే భారత రెండవ పెద్ద దేశం అవడం వల్ల ఇక భారత్‌లో తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించేందుకు ఆపిల్ ప్రయత్నాలు చేపట్టింది. -
ఐఎస్ఎల్లో ముంబై మరో విజయం
గువాహటి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో ముంబై సిటీ ఎఫ్‌సీ జట్టు తన జోరును కొనసాగిస్తోంది. శనివారం నార్త్ ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో 1-0తో నెగ్గి పారుుంట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ప్రథమార్ధం 45వ నిమిషంలో జాకీచంద్ సింగ్ జట్టుకు ఏకై క గోల్‌ను అందించాడు. ఈ సీజన్లో ముంబైకి ఇది నాలుగో విజయం. -
ఒంటరి మహిళలకు రూములివ్వని నగరం
కలల నగరంగా ప్రసిద్ధి చెందిన ముంబైలో ఒంటరి మహిళలకు రూములు దొరకడం కనాకష్టం. నేరస్థులకు కూడా రూములు ఇస్తారుగానీ చదువు కోసమో, ఉద్యోగం రీత్యానో నగరంలో ప్రవేశించిన ఒంటరి మహిళలకు (పెళ్లయినా, కాకున్నా) రూములు అద్దెకిచ్చేందుకు ఎవరూ ముందుకు రారు. ఒకవేళ ఇచ్చినా రూల్స్ పుస్తకాన్ని తీసి ముందుంచుతారు. సాయంత్రం చీకటి పడేలోగా ఇంటికి చేరుకోవాలి. మగవాళ్లు ఎవరూ ఇంటికి రాకూడదు. ఆడవాళ్లతోనైనా సరే వీకెండ్ పార్టీలు పెట్టుకోకూడదు. దమ్ము కొట్టకూడదు. మద్యం తాగరాదు. మాంసం వండుకోరాదు. బయటకు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు సెక్యూరిటీ గార్డు దగ్గరున్న రిజిస్టర్లో సంతకం చేయాలి. ఊరు నుంచి భర్త వచ్చినా సరే అపార్ట్మెంట్ రెసిడెంట్స్ కమిటీకి లేదా కార్యదర్శికి మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించాల్సిందే. లేకపోతే అనుమతించరు. ముంబై మహానగరంలో అద్దెకు ఇచ్చేందుకు ఎన్నో అపార్ట్మెంట్లు, అసోసియేషన్లు, బ్రోకర్లు ఉన్నా.. ఒంటరి మహిళలకు మాత్రం ఇలాంటి తిప్పలు తప్పడం లేదు. ఫెమినిజంలో మనం ఎంతో ముందుకు వెళ్లామని చెప్పుకొంటున్న ఈ రోజుల్లో కూడా ఈ పరిస్థితి తప్పడం లేదని ఫిల్మ్ మేకర్ షికా మేకన్ ఆవేదన వ్యక్తం చేశారు. బ్రహ్మచారులైన మగవాళ్లకు కూడా అంత సులభంగా ఇళ్లు అద్దెకు ఇవ్వరని, ఒంటరిగా నివసించే ఆడవాళ్లంటే మాత్రం మరీ చులకన భావమని ఆమె చెప్పారు. అద్దె ఇంటి కోసం ఎన్నో అగచాట్లు పడాల్సి వస్తుందని, చివరకు అద్దెకు ఇచ్చినా అర్థరాత్రి వచ్చి తలుపు తట్టేవాళ్లు, తనిఖీలు చేసేవాళ్లు, వచ్చేటప్పుడు, పోయేటప్పుడు వెకిలి కామెంట్లు చేసే ఆకతాయిల బెడద కూడా ఎక్కువగానే ఉంటోందని ఆమె చెప్పారు. తాను పది, పన్నెండేళ్ల క్రితం ముంబై నగరానికి వచ్చినప్పుడు కూడా ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నానని, ఇటీవల తన స్నేహితురాలికి కూడా ఇలాంటి ఇక్కట్లే ఎదరవడంతో ఈ అంశంపై 'బ్యాచ్‌లర్ గర్ల్స్' అనే టైటిల్‌తో ఓ డాక్యుమెంటరీ తీశానని, దాన్ని త్వరలోనే విడుదల చేస్తానని షికా మేకన్ తెలిపారు. -
వర్షం గుప్పిట ముంబై
♦ స్తంభించిన రైల్వే సేవలు.. ♦ బిహార్‌లో 25 మంది మృతి ముంబై: ఎడతెరపిలేని వానలకు ముంబై నగరం, పరిసర ప్రాంతాలు అతలాకుతం అయ్యాయి. శుక్రవారం పొద్దున్నుంచీ కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. రవాణాలో ఇబ్బందులేర్పడ్డాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. కొన్నిచోట్ల్ల పట్టాలపైకి నీరు చేరడంతో శివార్లలో రైల్వే సేవలకు అంతరాయం కలిగింది. విమాన సేవలను కూడా తాత్కాలికంగా నిలివేశారు. బస్సులు తిరిగే మార్గాల్లో పలు మార్పులు చేశారు. సాయంత్రం వరకు సుమారు 100 మీ.మీల వర్షపాతం నమోదైనట్లు అంచనా. రాబోయే 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవొచ్చనివాతావరణ శాఖ అంచనా వేసింది. నగరవ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. థానేను కూడా భారీ వ ర్షాలు ముంచె త్తాయి. సావిత్రి నదిపై వంతెన కూలిన దుర్ఘటనలో శుక్రవారం మరో 8 మృతదేహాలను గాలింపు బృందాలు క నుగొన్నాయి. దీంతో ఇప్పటి వరకు దొరికిన మృతదేహాల సంఖ్య 22కు పెరిగింది. మరోపక్క.. బిహార్‌లో వరద మృతుల సంఖ్య 89కి చేరింది. వర్ష సంబంధ ఘటనల్లో శుక్రవారం ఒక్క రోజే 25 మంది చనిపోయారు. -
వలసలపై పెరిగిన ‘ప్రేమ’
వలసల పట్ల గతంలో అయిష్టత ప్రదర్శించిన వారిని ప్రస్తుతం మానవతా దృక్పథం కదిలిస్తున్నట్లు కనిపిస్తోంది. దానికి మరో కారణం.. ఇప్పుడు వలస వస్తున్న వారు రాష్ట్రంలోని వారైనందువల్లే కావచ్చు. ముంబై వీరిని అతిథులుగానే చూస్తోంది. ముంబై నగరం వలస ప్రజల పట్ల సాదరంగా సమ్మతి తెలిపేది. కానీ ఒక దశలో అది వారి పట్ల ఉన్మాదపూరితమైన దృక్ప థంతో వ్యవహరించింది. బతక డం కోసం వచ్చి సాధారణ గృహా నికి అద్దె కట్టడం తప్పిస్తే అక్ర మంగా ఏదీ స్వాధీనం చేసు కోని.. కాస్త మెరుగైన స్థితిలో ఉన్న వారు ఫర్వాలేదు. కానీ దారిద్య్రం తొణకిసలాడుతున్న తమ స్వస్థలాలను వదిలి వచ్చిన పేదవారు మాత్రం ‘హాని’ కలిగించే వారై పోయారు. ఎలాంటి స్థితిలోఉన్నా, ఈ రెండు విభాగా లకు చెందినవారు బతకడం కోసం ముంబైకి వచ్చారు. బహుశా మొట్టమొదటిసారిగా, ముంబై నగరం సంక్షోభంలో చిక్కుకున్న వారికి, ఈ సందర్భంలో మర ట్వాడా కరువు బాధితులకు ఆపన్నహస్తాలను అందిం చింది. వీరికోసం ముంబైవాసులు శిబిరాలు నెలకొల్పారు. రాజకీయవాదులు ఆహార ఏర్పాట్లు చేశారు. తగిన స్థాయిలో కొంత పని కల్పించి పారితోషికం ఇచ్చారు. శివసేన మంత్రే దీనికి పూనుకున్నారు. వలస ప్రజలంటేనే ముఖం చిట్లించుకున్న పార్టీ ఇది. మహారాష్ట్రలోని మరట్వాడా ప్రాంత సంక్షోభం ఎంత తీవ్రమైనదంటే, తమ గణపతిని దర్శించుకున్న సందర్శ కుల నుంచి నగదు వసూలు చేసిన ప్రజలు, దాన్ని నానా పటేకర్ స్థాపించిన ‘నామ్ ఫౌండేషన్’కు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. సంక్షోభం పొంచుకుని ఉందని వారికి తెలుసు. తమ శక్తిమేరకు ఎంత సహాయపడినప్పటికీ, ఇది సహృదయంతో చేసిన ప్రయత్నం. కానీ సంక్షోభం చుట్టు ముట్టిన ప్రాంతంలో నివాసముంటున్న వారికి కూడా ఏం జరగనుందో తెలుసు. అయితే గత నెల చివరి వరకు వారి లో ఎక్కువమంది ఆశాభావంతో అక్కడే ఉండిపోయారు. తాము కూడా స్వయంగా గతంలో వలస వచ్చినవారే కావచ్చు కానీ మానవ వలసల పట్ల గతంలో అయిష్టత ప్రదర్శించిన వారిని ప్రస్తుతం మానవతా దృక్పథం కదిలిస్తున్నట్లు కనిపిస్తోంది. దానికి మరో కారణం.. ఇప్పుడు వలస వస్తున్న వారు రాష్ట్రంలోని వారైనందువల్లే కావచ్చు. మరట్వాడాతో సమానంగా సంక్షోభాన్ని చవిచూసిన బుందేల్‌ఖండ్ నుంచి మునుపట్లో ముంబైకి వలసలు రాలేదని చెప్పలేం. వీరు ముంబైకి వచ్చి స్థిరపడ్డారు కూడా. వీరు చడీచప్పుడు లేకుండా ఇటీవలే వచ్చి అప్పటికే ఉన్న తమ ప్రాంత వాసులతో కలిసిపోయి ఉండవచ్చు. ఇలా వచ్చిన వారి వాస్తవ సంఖ్య తెలీదు. స్వస్థలంలో నెలకొన్న దుస్థితి నుంచి తప్పించుకోవడానికి ఉద్దేశ పూర్వకంగా ప్రజలు తరలి వస్తున్నప్పుడు ఇలాంటివారి సంఖ్యను లెక్కించడం దాదాపుగా సాధ్యం కాదు. కానీ గుర్తించవలసింది ఏమిటంటే ముంబై వీరిని అతిథులుగా చూస్తోంది. ఏదేని కారణం వల్ల తన ఇంటిని ఉపయోగించుకోని స్థితిలో మీ పొరుగునున్న వ్యక్తి మీ ఇంటిలో ఆశ్రయం పొందినట్లుగానే ఇది కనిపిస్తోంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తను మళ్లీ వెనక్కు వెళ్లిపోవచ్చు. కాని అతడు శరణార్థే. యూరప్‌వైపు సిరియన్లు వెళుతున్నట్లుగా కాకుండా, తాత్కాలికంగా మాత్రమే ఇతడు శరణార్థిగా ఉంటున్నాడు. ప్రస్తుతానికి మాత్రం వలస వస్తున్నవారి పట్ల నగరం దృక్కోణం ఆశాజనకంగానే కనిపిస్తోంది. నగర మేయర్ స్నేహల్ అంబేకర్ వలస ప్రజలకు మద్దతుగా తమ వేతనాలలో కొంత బాగాన్ని కేటాయించవలసిందిగా నగర వాసులను కోరినట్లు చెప్పారు. కానీ నగర రూపురేఖలను వికారం చేస్తున్న కారణంగా మురికివాడలంటే ముఖం చిట్లించుకునే సమాజంలోని ఒక సెక్షన్ నుంచి ఈ మద్దతు రావలసి ఉంది. అయితే ఇక్కడ కూడా ఓటర్లు కనబడుతుంటారు కాబట్టి వీరు మురికివాడల్లోని ప్రజలను రహస్యంగా ప్రోత్సహిస్తూ వారిని చట్టబద్ధం చేస్తుంటారు. వలస ప్రజలు నగరాలకు తరలి వెళుతుంటారు. అన్ని పెద్ద నగరాల కంటే ముంబై సహజ అయస్కాంతంలాగా మంచి అవకాశాలను అందించేదిగా ఆకర్షిస్తుంటుంది. అయితే పుణే వంటి ఇతర నగరాలు కూడా వలస ప్రజలతో నిండిపోయినట్లు వార్తలు సూచిస్తున్నాయి. ఎందుకంటే తీవ్రమైన నీటి ఎద్దడితో గ్రామీణ ఆర్థికవ్యవస్థ కృశించి పోయింది. రాష్ట్రం వెలుపల నుంచి గత కొద్ది సంవత్సరాలుగా లాతూర్ కూడా వలసలను ఆకర్షించేది కానీ ఇక్కడి స్థానికుల్లో కొందరైనా ఇప్పుడు బయటకు వెళ్లడానికి ప్రాధాన్యమిస్తున్నారు. వలస ప్రజలు రెండు రకాలు. ఒకరు నియామక పత్రాలతో వచ్చేవారు. వీరికి వస్తూనే అద్దె గృహాలు కూడా దొరికే అవకాశముంది. రెండు. ఏదో ఒక మంచి జరుగుతుందనే ఆశతో తక్కువ వేతనాలున్న అసంఘటిత రంగం నుంచి ఎక్కువగా నగరంలోకి వచ్చిపడ్డవారు. ఇలాంటివారికి తోటి గ్రామస్థుడిలాగా తాత్కాలిక వసతి ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. అలా వసతి దొరికితే వీరికి అక్కడ జీవనం సాధ్యపడుతుంది. వీరు చాలా వరకు నైపుణ్యం లేనివారు. ఈ రెండో విభాగంలోని వ్యక్తి శరణార్థే. ఎందుకంటే కొన్ని ఎకరాల భూమిని కలిగి ఉన్నప్పటికీ బతకడానికి తగిన పంటలను అది ఇవ్వనందున ఆర్థిక కారణాల వల్లే ఇతడు ఇల్లు వదిలి వస్తున్నాడు. రోజువారీ ప్రాతిపదికన పనిచేస్తూ ఇతడు చివరికి మురికివాడలో తేలతాడు. ఒక పని తర్వాత మరొక పనికి మారుతూ, ఒక మురికివాడ నుంచి మరొక దానికి కూడా మారుతూ ఉంటాడు. వీరి జీవితాలు వీలైనంత అనిశ్చితంగానే ఉంటాయి. మురికివాడల్లో నివసించని వారు ఇలాంటివారిని ఉపయోగించుకుంటూ ఉంటారు కానీ వారిని ఏ మాత్రం పట్టించుకోరు. వర్షాలు కురిస్తేనే వీరందరూ లేదా వీరిలో చాలామంది తమ స్వస్థలాలకు మరలుతారని మనకు తెలుసు. ఇది వ్యవసాయంపై వారికి కుదిరే నమ్మకం, ఆర్థిక వ్యవస్థ మునుపటి స్థాయికి చేరుకోవడంపైనే ఆధారపడి ఉంటుంది. వెనక్కు వెళ్లడానికి ఏదైనా ఉపాధిని వారు కనుగొన్నట్లయితే, మరొక తక్షణ విపత్తుకు వ్యతిరేకంగా దాన్ని ఒక బీమాలాగా ఉపయోగించుకోవడానికి వీలైనట్లయితేనే ఇది జరుగు తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అలాంటి రక్షణకు తగు హామీ ఇవ్వలేనంతగా గిడసబారిపోయింది. గ్రామాల్లో భూములు కలిగిన ప్రజలు ముంబైలోని నూతన భవనాల్లోని నేలను చదును చేస్తుండటం కొత్త కాదు. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు - మహేష్ విజాపుర్కార్ ఈమెయిల్: mvijapurkar@gmail.com -
'ముంబై, బాలీవుడ్ ఇండస్ట్రీకి రుణపడ్డాను'
ముంబై: 'నాకు కొన్ని లక్ష్యాలున్నాయి.. వాటిని సాధించుకునేందుకు చాలా కష్టపడతున్నాను' అని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా వ్యాఖ్యానించారు. ఆమె ఇటీవల హాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. అమెరికన్ టీవీ షో 'క్వింటాకో' ద్వారా ఆమె పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. నా జీవితం అందరి జీవితం లాందిదే.. అందరికి ఉన్నట్లే తనకు కొన్ని లక్ష్యాలున్నాయని చెప్పింది. వ్యక్తిగతంగా చాలా కష్టపడి మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు జీవితాన్ని సమతూకంలో ఉంచుకోవాలనుకున్నట్లు మాజీ ప్రపంచ సుందరి పేర్కొంది. ఈ మధ్య కో-ప్రొడ్యూసర్ గానూ మారిన విషయాన్ని వివరించింది. మొబైల్ ఆప్ నెక్స్ జీ టీవీ సంస్థతో చేతులు కలిపింది. మరో డిజటల్ నెట్వర్క్ సంస్థతో కలిసి మై సిటీ అనే 14 భాగాలుండే మొబైల్ సిరీస్ లో భాగం పంచుఉన్నట్లు చెప్పుకొచ్చింది. నలుగురు యువతులు తమ జీవితంలో ప్రతిరోజు ఎదుర్కొనే సమస్యలపై మై సిటీ చేస్తున్నట్లు వివరించింది. ముంబై నగరంలో నివసించే మనికా, సొనాలి, టినా, నిక్కి అనే నాలుగు భిన్న నేపథ్యాల నుంచి వచ్చిన యువతుల గురించి ఈ సిరీస్ తీస్తున్నట్లు తెలిపింది. తనకు ఎంతగానో తోడ్పడిన ముంబై నగరం, బాలీవుడ్ ఇండస్ట్రీకి తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని ప్రియాంక కృతజ్ఞతలు తెలిపింది. -
మహానగర విస్తరణలో సామాన్యుడికి చోటేది?
సందర్భం ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని 1893 సంవత్సరంలో నిర్మించి నప్పుడు దానిపై ‘అర్బ్స్ ప్రైమా ఇన్ ఇండిస్’ అనే పదాలు చెక్కించారు. అంటే దేశంలోనే తొలి నగరం లేదా ప్రధాన నగరం అని అర్థం. ఇది ఒక సింగపూర్‌లా, హాం కాంగ్లా విలసిల్లుతుందని అప్పట్లో ఆకాంక్షిం చారు. కానీ పారిశ్రామికీకరణ కొనితెచ్చిన వలసల నేపథ్యంలో కిక్కిరిసిపోయిన భవంతులు, మురికి వాడలతో ఇప్పు డిది ఒక పరిశుభ్ర నగరంలా కూడా ఉండటం లేదు. మరాఠీలో చాల్ అంటే నాలుగైదు అంతస్తుల భవంతి అని అర్థం. కుటుంబం మొత్తానికి ఒకటే గదితో, బాల్కనీ వంటి వరండాతో, చివరలో ఉమ్మడి మరుగుదొడ్లతో ఉండే భవంతులివి. ఇవి కలిసి ఉండటం అనే ఉమ్మడి సంస్కృతిని ప్రోత్సహించేవి కానీ, మరమ్మతులకు సాధ్యంకానంతగా పతనమైన స్థితిలో ఇవి ఇప్పటికే రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కిక్కిరిసిపోయి ఉండే ఆధునిక భవంతులుగా.. పునర్నిర్మాణం బాటలో ఇప్పుడు సాగుతున్నాయి. ముంబై నగరం దుస్థితికి మురికివాడలు కారణమంటూ కొంతమంది తరచుగానే ఫిర్యాదులు చేస్తుంటారు. నగర జనాభాలో సగంమంది మురికి వాడల్లోనే నివసించడం వాస్తవమే కానీ ఇవి నగరంలోని 15 శాతం కంటే తక్కువ భూమిలో ఉంటున్నాయి. ఏదేమైనా, నగరం మాత్రం సమర్థ పనితీరుకు ప్రాణాధారమైన మౌలిక వసతుల కల్పనకోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. జనం ఇప్పటికీ కిక్కిరిసి పోయిన రైళ్లలో ప్రయాణిస్తూనే ఉన్నారు. పనికిరాని స్థితిలో ఉన్న ప్రభుత్వ బస్సు సేవలను, ఫుట్‌పాత్‌లను ఉపయోగి స్తూనే ఉన్నారు. ఫుట్‌పాత్‌ల మీదయితే జనం నడవలే రు. ఎందుకంటే అవి చిల్లర వ్యాపారులు, అక్రమ షాపుల విస్తరణలతో పాటు నడవడానికి ఏమాత్రం అనుకూలంగా లేని ఉపరితలాన్ని కలిగి ఉంటున్నాయి. కొత్తగా మౌలిక వసతుల కల్పనకోసం నగర పాలక సంస్థ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రూ. 11,500 కోట్ల వ్యయంతో కూడిన 22 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంత రహదారి, ముంబై తీరప్రాంతాన్ని మహానగరంతో అనుసంధానించే ట్రాన్స్-హార్బర్ లింక్ వంటి నిర్మాణాలు వేగం పుంజుకుంటున్నాయి. కానీ ఈ నిర్మాణాలన్నీ కార్లను ఉపయోగించేవారికి ఉద్దేశించినవే. కానీ సామాన్యుడి అవసరాలకు ఎంతో ఉపయుక్తంగా ఉండే మెట్రో, మోనో రైళ్లు, స్థానిక రైళ్ల అభివృద్ధి, బస్సు సేవల వంటివాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. చిత్తడి నేలమీద నిర్మితమైన ఇలాంటి సంక్లిష్ట నగరంలో జనజీవితాన్ని ఒక క్రమంలోకి తేగలిగే సమర్థ పరిపాలన అవసరం ఎంతైనా ఉంది. అయితే, ముంబై 1.25 కోట్లమంది జనాభాను కలిగిన మహా నగరం. దేశ జనాభాలో ఒక శాతం మంది ఈ ఒక్క నగరంలోనే 434 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నివసిస్తున్నారు. బహుశా ముంబై నగరం దేశంలోనే అతి పెద్ద పురపాలక సంస్థను కలిగి ఉంది. 2015-16 సంవత్స రానికి దీని బడ్జెట్ రూ. 33,514 కోట్లు. చిన్న చిన్న దేశాలను సైతం పాలిపోయేటట్టు చేసేంత పెద్ద బడ్జెట్ ఇది. పైగా దాని బడ్జెట్ కంటే ఎక్కువగా రూ.41,000 కోట్ల మేరకు భారీ స్థాయిలో బ్యాంకు డిపాజిట్లను నగరం కలిగి ఉంది. కానీ కొత్త ఆర్థిక సంవత్సరం సమీపిస్తుండగా, నగర బడ్జెట్లో కేవలం 30 శాతం నిధులను మాత్రమే నగరపాలక సంస్థ ఖర్చు పెట్టగలి గింది. అందుచేత, సరైన నిర్వహణ ద్వారా ఒనగూరే ప్రయోజనాలను నగరం కోల్పోయిందన్నమాట. డిపాజిట్లు బ్యాంకులలోనే ఉంటున్నప్పటికీ, ఉద్యోగుల ప్రావిడెంట్, పెన్షన్ నిధులను నగరపాలక సంస్థ తొక్కిపట్టి ఉంచిందని తెలిసినప్పుడు నగరపాలక సంస్థ వాస్తవ పరిస్థితి అర్థమవుతుంది. నగర బడ్జెట్లో పీఎఫ్, పెన్షన్ నిధుల వాటా అయిదింట ఒక వంతు మాత్రమే. రహదారులు, మురికికాలువలు, పాఠశాలలు వంటి నగర మౌలిక వసతుల కల్పనను పేలవమైన నాణ్యతతో నిర్వహిస్తున్నారు. అయినా సరే ఇంత తక్కువ మొత్తాన్ని మాత్రమే ఖర్చుపెట్టడం గమనార్హం. రహదారుల నిర్మాణం, వాటి నిర్వహణకు సంబంధించిన కాంట్రాక్టర్లు తరచుగా తక్కువ కోట్ చేస్తూనే, తర్వాత బిడ్ విలువను పెంచుతుంటారు. ఈ క్రమంలో పేలవమైన రహదారులను వీరు నిర్మిస్తారు. ఇక నగర అధికారిక పర్యవేక్షణా వ్యవస్థ మరీ ఘోరంగా ఉంటోంది. ఒకసారి వర్షం కురిస్తే చాలు రహదారులు గుంతలమయం కాక తప్పదు. ఈ గుంతలను పూడ్చడానికి న్యాయస్థానాలు రంగంలోకి దిగి, తుది గడువును విధిస్తుంటాయి కాని అవి ఎన్నడూ అమలు కావు. హైకోర్టులోని కఠినమైన న్యాయమూర్తులు ఈ విషయమై అప్పుడప్పుడూ వేడిని కొనసాగిస్తుంటారు. న్యాయస్థానం ఆదేశాలను ఒక జాబితాగా చేస్తే అది మీ చెయ్యి అంత పొడవుగా ఉంటుంది. న్యాయ స్థానా లు తరచుగా ఇచ్చే ఆదేశాలు నగరపాలక సంస్థ నిర్వహ ణ ఎంత అస్తవ్యస్థంగా ఉంటోందో తెలుపుతుంది. మహిళలు ముక్కు మూసుకోవడానికి వీల్లేనివిధంగా టాయ్లెట్లు, వాష్ రూమ్‌లు నిర్మించాలని ఆదేశాలు వెలవడుతుంటాయి. మూత్ర విసర్జన కూడా మహిళల హక్కు కాబట్టి, న్యాయస్థానాలు ఈ విషయంలో కూడా జోక్యం చేసుకుంటాయి కాని దాని అమలు మాత్రం నత్తనడకతోనే సాగుతుంటుంది. ఇదంతా ఒక సందర్భోచితమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఇప్పుడున్నదానికంటే మెరుగ్గా ఉంచాలనే ఆకాంక్షలతో ముంబై నగరాన్ని ఎవరు నిర్వహించగలరన్నదే ఆ ప్రశ్న. (వ్యాసకర్త : మహేష్ విజాపుర్కార్, సీనియర్ పాత్రికేయులు) -
ముంబై మిస్టరీ!
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రతి నెలా 884 మంది అదృశ్యమవుతున్నట్టు పోలీసుశాఖ ప్రకటించింది. వీరిలో 90 శాతం మంది ఆచూకీ కనుకుంటున్నామని ప్రకటించింది. అయితే బాధితుల్లో పురుషులతో పోలిస్తే బాలికలు, మహిళల సంఖ్య అధికంగా ఉంది. ముంబై: మెట్రో నగరం ముంబైలో ప్రతి నెలా సగటున 884 మంది అదృశ్యమవుతున్నట్టు తేలింది. వీరిలో ఎక్కువ మంది మైనర్ బాలికలే ఉన్నారని పోలీసుల గణాంకాలు తెలియజేస్తున్నాయి. గత దశాబ్దకాలంగా ఈ పరిస్థితి కొనసాగుతోందని నగర పోలీసులు తెలిపారు. వీరిలో అత్యధికుల ఆచూకీని తిరిగి కనుగొన్నారు. 2005 నుంచి ఈ ఏడాది మే వరకు మొత్తం 1,10,547 మంది ముంబైకర్లు కనిపించకుండాపోయారు. వీరిలో 1,00,439 మంది ఆచూకీ కనుగొన్నా 10,108 మంది జాడ ఇప్పటికీ దొరకలేదు. ముంబై సీఐడీ వ్యక్తుల అదృశ్య విభాగం ఈ గణాంకాలు విడుదల చేసింది. బాధితుల్లో పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్య అధికంగా ఉంది. వీరిలో 18,547 మంది బాలికలు కాగా, 37,603 మంది మహిళలు, 17,195 మంది బాలురు, 37,202 మంది పురుషులు ఉన్నారు. ప్రతి నెలా అదృశ్యమవుతున్న 884 మంది 90 శాతం .. అంటే 803 మంది జాడ కనుగొంటున్నామని పోలీసులు చెబుతున్నారు. ఈ ఏడాదిలో అదృశ్యమైన 582 మంది మైనర్ బాలికలు, 2,944 మంది మహిళల ఆచూకీ మాత్రం ఇప్పటికీ దొరకలేదు. ముంబైలో 50 శాతం మంది ప్రజలు మురికివాడల్లో ఉంటున్నారని, అదృశ్యమయ్యేవారిలో అత్యధికులు గుడిసెల వాసులేనని సీఐడీ అధికారి ఒకరు వివరించారు. ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలు, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో తప్పిపోయిన, అదృశ్యమైన వారిని గుర్తించడం సులువవుతోందని పేర్కొన్నారు. -
ప్రతి నెల 884 మంది తప్పిపోతున్నారు
ముంబై: భారత వాణిజ్య రాజధాని ముంబైలో నెలకు 884 మంది కనిపించకుండా పోతున్నారు. ఆచూకీ లేకుండా పోతున్నవారిలో ఎక్కువ మంది మైనర్ బాలికలని ప్రభుత్వ గణంకాలు వెల్లడించాయి. గత దశాబ్దకాలంలో తప్పిన పోయినవారిలో చాలా మందిని వెతికి పట్టుకున్నట్టు ముంబై పోలీసులు విడుదల చేసిన గణాంకాలు తెల్పుతున్నాయి. గత పదిన్నరేళ్ల కాలంలో 1,10,547 మంది తప్పిపోయారని ముంబై పోలీసులు వెల్లడించారు. వీరిలో 1,00,439 మంది ఆచూకీ కనుగొన్నారు. మిగతా 10,108 మంది ఏమయ్యారో కనిపెట్టలేకపోయారు. 2005 జనవరి నుంచి 2015 మే నెల వరకు తప్పిపోయిన వారి వివరాలను పోలీసులు వెల్లడించారు. కనిపించకుండా పోయిన వారిలో 37,603 మంది మహిళలు, 37,202 మంది పురుషులు, 18,547 మంది బాలికలు, 18,547 మంది బాలురు ఉన్నారు. -
ముంబై తీరంలో పోటెత్తుతున్న సముద్రం
-
ముంబై సమగ్రాభివృద్ధి కోసమే కమిటీ
నాగపూర్: దేశ ఆర్థిక రాజధానిగా విరాజిల్లుతున్న ముంబై నగరాన్ని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని ఆధ్వర్యంలో నగర అభివృద్ధి కమిటీ ఏర్పాటుకు తాను ప్రతిపాదించానని ఆయన నొక్కి చెప్పారు. విధాన మండలిలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. ముంబై అభివృద్ధికి కమిటీ ఏర్పాటు విషయమై ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం సృష్టిస్తున్నాయని అన్నారు. ముంబై నగరం ఎన్నటికీ మహారాష్ట్రలో భాగంగానే ఉంటుందని, దాన్ని ఎవరూ రాష్ట్రం నుంచి వేరుచేయలేరని ఆయన ప్రకటించారు. నగ రం ఇప్పటికే అభివృద్ధి చెందినప్పటికీ, మరింత సమగ్ర అభివృద్ధి సాధించడం ద్వారా ప్రపంచంలోనే మేటి నగరంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం సంకల్పించిందన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతో అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. నగరంలో చేపట్టే పలు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి శీఘ్రగతిన ఆమోదాలు పొందాలంటే ప్రధాని స్థాయి వ్యక్తిని నగర అభివృద్ధిలో భాగస్వామ్యులను చేయడం ఉత్తమ మార్గమని తాము తలచినట్లు వివరించారు. కాగా, బృహన్ ముంబై నగర పాలక మండలి (బీఎంసీ) ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు వంటి జిమ్మిక్కులు చేస్తోందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విమర్శించిన సంగతి తెలిసిందే. ముంబై అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని, దీనిలో ప్రధాని పాత్ర అనవసరమని ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాగా, ముంబైలో మౌలిక వసతులను అభివృద్ధి చేయడం ద్వారా నగరవాసుల జీవవ ప్రమాణాలను మెరుగుపరచడం తమ లక్ష్యమన్నారు. ప్రపంచ దేశాలనుంచి నగరానికి పెట్టుబడులను ఆహ్వానించేందుకు తగిన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందన్నారు. పెట్టుబడుదారులకు అవసరమైన అనుమతులను శీఘ్రగతిన అందజేసేందుకు కేంద్రం సాయంకూడా చాలా అవసరమన్నారు. దీని కోసమే తమ ప్రభుత్వం ప్రధాని ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటుకు సూచించిందని చెప్పారు. కాగా, దీనిపై కాంగ్రెస్ నేత మాణిక్‌రావ్ ఠాక్రే స్పందిస్తూ.. నగర సమగ్రఅభివృద్ధి కమిటీ ఏర్పాటుచేస్తే దానికి సాధారణంగా ముఖ్యమంత్రి నాయకత్వం వహిస్తారు.. అయితే ప్రధానిని ఈ కమిటీకి నాయకత్వం వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడం సమంజసమేనా.. అంటూ ప్రశ్నించారు. దీనికి ఫడ్నవిస్ స్పందిస్తూ.. దేశంలో ఏ కమిటీకైనా ప్రధాని నేతృత్వం వహించవచ్చు.. అలాంటప్పుడు ఈ కమిటీ ఆయన నేతృత్వం వహిస్తే తప్పేంటని ఎదురు ప్రశ్నించారు. మెట్రో లైన్లలో లోకల్ రైళ్లను నడిపేందుకు తమ ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. సాధ్యమైనంతమేరకు క్లోజ్డ్ డోర్ లోకల్ రైళ్లను నడిపేందుకు ప్రతిపాదన ఉందన్నారు. కాగా,హార్బర్ లైన్లో క్లోజ్డ్ డోర్ రైళ్లను ప్రయోగత్మకంగా నడపనున్నట్లు వెల్లడించారు. అది విజయవంతమైతే మిగిలిన లైన్లలో కూడా ఈ రైళ్లను నడిపిస్తామని వివరించారు. అలాగే వడాలా- సంత్ గాడ్గే మహరాజ్ చౌక్ మధ్య రెండో విడత మెట్రో పనులు వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు పూర్తిచేస్తామని సీఎం ప్రకటించారు. అయితే సీఎం ప్రకటన లోపభూయిష్టంగా , అసంపూర్ణంగా ఉందని విధాన మండలిలో ఎన్సీపీ నేత అయిన ధనంజయ్ ముండే విమర్శించారు. -
బీజేపీ హీరో.. ఎంఎన్ఎస్ జీరో!!
ముంబై మహానగరంలో ఒకప్పుడు మహారాష్ట్ర నవనిర్మాణ సమితి అంటే.. బ్రహ్మాండమైన ఫాలోయింగ్ ఉండేది. రాజ్ ఠాక్రే స్థాపించిన ఈ పార్టీ.. ముంబై నగరం మరాఠీలకే సొంతం కావాలన్న నినాదంతో ప్రజల్లో వీరాభిమానాన్ని సంపాదించుకున్న ఎంఎన్ఎస్.. తాజాగా ఆ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో.. ముంఖ్యంగా ముంబై మహానగరంలో పూర్తిగా చతికిలబడిపోయింది. దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో అత్యధికంగా 15 సీట్లను బీజేపీ గెలుచుకుంది. 14 సీట్లతో శివసేన రెండో స్థానంలో నిలవగా, కాంగ్రెస్ మాత్రం ఈ రెండింటికీ చాలా దూరంగా 5 సీట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. చివరకు హైదరాబాదీ పార్టీగా పేరొందిన మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ (ఎంఐఎం) కూడా అక్కడ బోణీ కొట్టింది గానీ, ఎంఎన్ఎస్ మాత్రం ఒక్క స్థానం కూడా సంపాదించలేకపోయింది. ఎంఎన్ఎస్ ఒక్కసారిగా ఇలా చతికిలబడుతుందని వాస్తవానికి ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఒకరకంగా చెప్పాలంటే ముంబై రాజకీయ చిత్రపటం నుంచి అది పూర్తిగా మాయమైపోయింది. ఒకప్పుడు సేవ్రి, మాహిమ్, మగాథానె లాంటి ప్రాంతాలన్నీ ఎంఎన్ఎస్ కంచుకోటలు. కానీ, వాటిలో ఎక్కడా గెలవలేదు. అలాగే బాలా నందగావ్కర్, నితిన్ సర్దేశాయ్, ప్రవీణ్ దారేకర్ లాంటి మహాయోధులు కూడా మట్టికరిచారు. పైగా కేవలం ఓడిపోవడమే కాదు.. వాళ్ల మెజారిటీలలో తేడాలు కూడా చాలా ఎక్కువ. ఉదాహరణకు నందగావ్కర్ అయితే తన ప్రత్యర్థి, శివసేన అభ్యర్థికి వచ్చిన ఓట్లలో సగం కూడా సంపాదించలేకపోయారు. ఒకప్పుడు ఆయన బ్రహ్మాండమైన నాయకుడు. కానీ ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితులలో ఆయన పరిస్థితి దారుణంగా మారింది. అలాగే ప్రవీణ్ దారేకర్ అయితే ఏకంగా మూడోస్థానానికి పడిపోయారు. ఒక్క మాహిమ్ నియోజకవర్గంలో మాత్రం అక్కడి సిటింగ్ ఎమ్మెల్యే సర్దేశాయ్ కాస్త గట్టి పోరాటం చేశారు. ఆయన కేవలం 6వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ ఇక్కడి ఓటమి ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రేకు చాలా ఇబ్బందికరమైనది. ఎందుకంటే.. మాహిమ్ స్థానం ఆ పార్టీకి చాలా ముఖ్యం. శివాజీ పార్కు లాంటి కీలక ప్రాంతాలన్నీ ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. బాలఠాక్రే కూడా ఇక్కడినుంచే తన ఉత్తేజపూరితమైన ప్రసంగాలు ఇచ్చేవారు. ఆయన మాటలు వింటేనే మరాఠీల రోమాలు నిక్కబొడుచుకునేవి. అలాంటి స్థానాన్ని కూడా పోగొట్టుకున్న ఎంఎన్ఎస్.. ఇక రాబోయే ఎన్నికల నాటికి ఏమవుతుందోనని అంతా చూస్తున్నారు. -
తొలి వ్యూచ్‌లో ముంబై x కోల్‌కతా
ఐఎస్ఎల్ షెడ్యూల్ విడుదల ముంబై: సాకర్ అభివూనులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియున్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్‌కు రంగం సిద్ధమైంది.ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్, అట్లెటికో డి కోల్‌కతా వుధ్య అక్టోబర్ 12న జరిగే వ్యూచ్తో తొలి ఐఎస్ఎల్ టోర్నీ ప్రారంభవువుతుంది. ఆరంభ వ్యూచ్కు కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక సాల్ట్‌లేక్ స్టేడియుం ఆతిథ్యమివ్వనుంది. టోర్నీ రెండో వ్యూచ్‌లో ఢిల్లీ డైనమోస్, పుణే సిటీ పోటీపడనున్నాయి. ఈ మేరకు నిర్వాహకులు వ్యూచ్ల షెడ్యూల్‌ను విడుదల చేశారు. 70 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో 61 వ్యూచ్లను పలు నగరాల్లో నిర్వహించనున్నారు. మొత్తం ఎనిమిది జట్లు 56 లీగ్ వ్యూచ్‌లు ఆడతాయి. డిసెంబర్ 13న రెండంచెల సెమీఫైనల్స్ మొదలవుతుంది. 20న జరిగే ఫైనల్‌తో ఐఎస్ఎల్ టోర్నీ ముగుస్తుంది. -
ఆరుకు చేరిన ముంబై మృతుల సంఖ్య
ముంబై : ముంబై శాంతాక్రాజ్ శివారులోని వకోలాలో ఏడంతస్థుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. శుక్రవారం ఉదయం భారీ భవనం కూలిపోవడంతో శిధిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కూలిన ఆ భవనంలో ఎవరు నివసించడం లేదని బృహన్ ముంబై మున్సిపల్ అధికారులు వెల్లడించారు.అయితే కుప్పకూలిన భవనం మురికవాడ పక్కన ఉందని శిథిలాల కింద కొంత మంది చిక్కుకున్నారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే బృహన్ ముంబై మున్సిపల్ అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బృహన్ మున్సిపల్ కార్పోరేష్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. -
ముంబైలో కుప్పకూలిన ఏడంతస్థుల భవనం
ముంబై శాంతాక్రాజ్ శివారులోని వకోలాలో ఏడంతస్థుల భవనం శుక్రవారం ఉదయం కుప్పకూలింది. అయితే ఆ భవనంలో ఎవరు నివసించడం లేదని బృహన్ ముంబై మున్సిపల్ అధికారులు వెల్లడించారు.అయితే కుప్పకూలిన భవనం మురికవాడ పక్కన ఉందని శిథిలాల కింద కొంత మంది చిక్కుకుని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే బృహన్ ముంబై మున్సిపల్ అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బృహన్ మున్సిపల్ కార్పోరేష్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆ ఘటనపై మరింత సమాచారం అందవలసి ఉంది. -
నగరానికి నేడు కేంద్రమంత్రి చిరంజీవి రాక
సాక్షి, ముంబై: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి శనివారం నగరానికి రానున్నారు. ఈ సందర్భంగా ఆయన తెలుగువారి కార్యక్రమానికి కూడా హాజరుకానున్నారు. కామాటిపుర ప్రాంతంలో ఆధునీకరించిన అఖిల పద్మశాలి సమాజం హాలును ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మిలింద్ దేవరాతోపాటు స్థానిక ఎమ్మెల్యే అమీన్ తదితర ప్రముఖులు పాల్గొననున్నట్టు సమాజం అధ్యక్షుడు దొంతుల బాలనర్సయ్య, ప్రధాన కార్యదర్శి ఎతురాజుల గంగాధర్‌లు ఓ ప్రకటనలో తెలిపారు.