వలసలపై పెరిగిన ‘ప్రేమ’ | More affection to migrate in mumbai city | Sakshi
Sakshi News home page

వలసలపై పెరిగిన ‘ప్రేమ’

Published Tue, May 3 2016 1:19 AM | Last Updated on Sun, Sep 3 2017 11:16 PM

వలసలపై పెరిగిన ‘ప్రేమ’

వలసలపై పెరిగిన ‘ప్రేమ’

వలసల పట్ల గతంలో అయిష్టత ప్రదర్శించిన వారిని ప్రస్తుతం మానవతా దృక్పథం కదిలిస్తున్నట్లు కనిపిస్తోంది. దానికి మరో కారణం.. ఇప్పుడు వలస వస్తున్న వారు రాష్ట్రంలోని వారైనందువల్లే కావచ్చు. ముంబై వీరిని అతిథులుగానే చూస్తోంది. ముంబై నగరం వలస ప్రజల పట్ల సాదరంగా సమ్మతి తెలిపేది. కానీ ఒక దశలో అది వారి పట్ల ఉన్మాదపూరితమైన దృక్ప థంతో వ్యవహరించింది. బతక డం కోసం వచ్చి సాధారణ గృహా నికి అద్దె కట్టడం తప్పిస్తే అక్ర మంగా ఏదీ స్వాధీనం చేసు కోని.. కాస్త మెరుగైన స్థితిలో ఉన్న వారు ఫర్వాలేదు. కానీ దారిద్య్రం తొణకిసలాడుతున్న తమ స్వస్థలాలను వదిలి వచ్చిన  పేదవారు మాత్రం ‘హాని’ కలిగించే వారై పోయారు. ఎలాంటి స్థితిలోఉన్నా, ఈ రెండు విభాగా లకు చెందినవారు బతకడం కోసం ముంబైకి వచ్చారు.
 
 బహుశా మొట్టమొదటిసారిగా, ముంబై నగరం సంక్షోభంలో చిక్కుకున్న వారికి, ఈ సందర్భంలో మర ట్వాడా కరువు బాధితులకు ఆపన్నహస్తాలను అందిం చింది. వీరికోసం ముంబైవాసులు శిబిరాలు నెలకొల్పారు. రాజకీయవాదులు ఆహార ఏర్పాట్లు చేశారు. తగిన స్థాయిలో కొంత పని కల్పించి పారితోషికం ఇచ్చారు. శివసేన మంత్రే దీనికి పూనుకున్నారు. వలస ప్రజలంటేనే ముఖం చిట్లించుకున్న పార్టీ ఇది.
 
 మహారాష్ట్రలోని మరట్వాడా ప్రాంత సంక్షోభం ఎంత తీవ్రమైనదంటే, తమ గణపతిని దర్శించుకున్న సందర్శ కుల నుంచి నగదు వసూలు చేసిన ప్రజలు, దాన్ని నానా పటేకర్ స్థాపించిన ‘నామ్ ఫౌండేషన్’కు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. సంక్షోభం పొంచుకుని ఉందని వారికి తెలుసు. తమ శక్తిమేరకు ఎంత సహాయపడినప్పటికీ, ఇది సహృదయంతో చేసిన ప్రయత్నం. కానీ సంక్షోభం చుట్టు ముట్టిన ప్రాంతంలో నివాసముంటున్న వారికి కూడా ఏం జరగనుందో తెలుసు. అయితే గత నెల చివరి వరకు వారి లో ఎక్కువమంది ఆశాభావంతో అక్కడే ఉండిపోయారు.
 
 తాము కూడా స్వయంగా గతంలో వలస వచ్చినవారే కావచ్చు కానీ మానవ వలసల పట్ల గతంలో అయిష్టత ప్రదర్శించిన వారిని ప్రస్తుతం మానవతా దృక్పథం కదిలిస్తున్నట్లు కనిపిస్తోంది. దానికి మరో కారణం.. ఇప్పుడు వలస వస్తున్న వారు రాష్ట్రంలోని వారైనందువల్లే కావచ్చు. మరట్వాడాతో సమానంగా సంక్షోభాన్ని చవిచూసిన బుందేల్‌ఖండ్ నుంచి మునుపట్లో ముంబైకి వలసలు రాలేదని చెప్పలేం. వీరు ముంబైకి వచ్చి స్థిరపడ్డారు కూడా. వీరు చడీచప్పుడు లేకుండా ఇటీవలే వచ్చి అప్పటికే ఉన్న తమ ప్రాంత వాసులతో కలిసిపోయి ఉండవచ్చు.
 
 ఇలా వచ్చిన వారి వాస్తవ సంఖ్య తెలీదు. స్వస్థలంలో నెలకొన్న దుస్థితి నుంచి తప్పించుకోవడానికి ఉద్దేశ పూర్వకంగా ప్రజలు తరలి వస్తున్నప్పుడు ఇలాంటివారి సంఖ్యను లెక్కించడం దాదాపుగా సాధ్యం కాదు. కానీ గుర్తించవలసింది ఏమిటంటే ముంబై వీరిని అతిథులుగా చూస్తోంది. ఏదేని కారణం వల్ల తన ఇంటిని ఉపయోగించుకోని స్థితిలో  మీ పొరుగునున్న వ్యక్తి మీ ఇంటిలో ఆశ్రయం పొందినట్లుగానే ఇది కనిపిస్తోంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తను మళ్లీ వెనక్కు వెళ్లిపోవచ్చు. కాని అతడు శరణార్థే. యూరప్‌వైపు సిరియన్లు వెళుతున్నట్లుగా కాకుండా, తాత్కాలికంగా మాత్రమే ఇతడు శరణార్థిగా ఉంటున్నాడు.
 
 ప్రస్తుతానికి మాత్రం వలస వస్తున్నవారి పట్ల నగరం దృక్కోణం ఆశాజనకంగానే కనిపిస్తోంది. నగర మేయర్ స్నేహల్ అంబేకర్ వలస ప్రజలకు మద్దతుగా తమ వేతనాలలో కొంత బాగాన్ని కేటాయించవలసిందిగా నగర వాసులను కోరినట్లు చెప్పారు. కానీ నగర రూపురేఖలను వికారం చేస్తున్న కారణంగా మురికివాడలంటే ముఖం చిట్లించుకునే సమాజంలోని ఒక సెక్షన్ నుంచి ఈ మద్దతు రావలసి ఉంది. అయితే ఇక్కడ కూడా ఓటర్లు కనబడుతుంటారు కాబట్టి వీరు మురికివాడల్లోని ప్రజలను రహస్యంగా ప్రోత్సహిస్తూ వారిని చట్టబద్ధం చేస్తుంటారు.
 
 వలస ప్రజలు నగరాలకు తరలి వెళుతుంటారు. అన్ని పెద్ద నగరాల కంటే ముంబై సహజ అయస్కాంతంలాగా మంచి అవకాశాలను అందించేదిగా ఆకర్షిస్తుంటుంది. అయితే పుణే వంటి ఇతర నగరాలు కూడా వలస ప్రజలతో నిండిపోయినట్లు వార్తలు సూచిస్తున్నాయి. ఎందుకంటే తీవ్రమైన నీటి ఎద్దడితో గ్రామీణ ఆర్థికవ్యవస్థ కృశించి పోయింది. రాష్ట్రం వెలుపల నుంచి గత కొద్ది సంవత్సరాలుగా లాతూర్ కూడా వలసలను ఆకర్షించేది కానీ ఇక్కడి స్థానికుల్లో కొందరైనా ఇప్పుడు బయటకు వెళ్లడానికి ప్రాధాన్యమిస్తున్నారు.
 
 వలస ప్రజలు రెండు రకాలు. ఒకరు నియామక పత్రాలతో వచ్చేవారు. వీరికి వస్తూనే అద్దె గృహాలు కూడా దొరికే అవకాశముంది. రెండు. ఏదో ఒక మంచి జరుగుతుందనే ఆశతో తక్కువ వేతనాలున్న అసంఘటిత రంగం నుంచి ఎక్కువగా నగరంలోకి వచ్చిపడ్డవారు. ఇలాంటివారికి తోటి గ్రామస్థుడిలాగా తాత్కాలిక వసతి ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. అలా వసతి దొరికితే వీరికి అక్కడ జీవనం సాధ్యపడుతుంది. వీరు చాలా వరకు నైపుణ్యం లేనివారు.
 ఈ రెండో విభాగంలోని వ్యక్తి శరణార్థే. ఎందుకంటే కొన్ని ఎకరాల భూమిని కలిగి ఉన్నప్పటికీ బతకడానికి తగిన పంటలను అది ఇవ్వనందున ఆర్థిక కారణాల వల్లే ఇతడు ఇల్లు వదిలి వస్తున్నాడు. రోజువారీ ప్రాతిపదికన పనిచేస్తూ ఇతడు చివరికి మురికివాడలో తేలతాడు. ఒక పని తర్వాత మరొక పనికి మారుతూ, ఒక మురికివాడ నుంచి మరొక దానికి కూడా మారుతూ ఉంటాడు. వీరి జీవితాలు వీలైనంత అనిశ్చితంగానే ఉంటాయి.
 
 మురికివాడల్లో నివసించని వారు ఇలాంటివారిని ఉపయోగించుకుంటూ ఉంటారు కానీ వారిని ఏ మాత్రం పట్టించుకోరు. వర్షాలు కురిస్తేనే వీరందరూ లేదా వీరిలో చాలామంది తమ స్వస్థలాలకు మరలుతారని మనకు తెలుసు.

ఇది వ్యవసాయంపై వారికి కుదిరే నమ్మకం, ఆర్థిక వ్యవస్థ మునుపటి స్థాయికి చేరుకోవడంపైనే ఆధారపడి ఉంటుంది. వెనక్కు వెళ్లడానికి ఏదైనా ఉపాధిని వారు కనుగొన్నట్లయితే, మరొక తక్షణ విపత్తుకు వ్యతిరేకంగా దాన్ని ఒక బీమాలాగా ఉపయోగించుకోవడానికి వీలైనట్లయితేనే ఇది జరుగు తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అలాంటి రక్షణకు తగు హామీ ఇవ్వలేనంతగా గిడసబారిపోయింది. గ్రామాల్లో భూములు కలిగిన ప్రజలు ముంబైలోని నూతన భవనాల్లోని నేలను చదును చేస్తుండటం కొత్త కాదు.
 వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
 - మహేష్ విజాపుర్కార్
 ఈమెయిల్: mvijapurkar@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement