Mahesh vizapurkar
-
వలసలపై పెరిగిన ‘ప్రేమ’
వలసల పట్ల గతంలో అయిష్టత ప్రదర్శించిన వారిని ప్రస్తుతం మానవతా దృక్పథం కదిలిస్తున్నట్లు కనిపిస్తోంది. దానికి మరో కారణం.. ఇప్పుడు వలస వస్తున్న వారు రాష్ట్రంలోని వారైనందువల్లే కావచ్చు. ముంబై వీరిని అతిథులుగానే చూస్తోంది. ముంబై నగరం వలస ప్రజల పట్ల సాదరంగా సమ్మతి తెలిపేది. కానీ ఒక దశలో అది వారి పట్ల ఉన్మాదపూరితమైన దృక్ప థంతో వ్యవహరించింది. బతక డం కోసం వచ్చి సాధారణ గృహా నికి అద్దె కట్టడం తప్పిస్తే అక్ర మంగా ఏదీ స్వాధీనం చేసు కోని.. కాస్త మెరుగైన స్థితిలో ఉన్న వారు ఫర్వాలేదు. కానీ దారిద్య్రం తొణకిసలాడుతున్న తమ స్వస్థలాలను వదిలి వచ్చిన పేదవారు మాత్రం ‘హాని’ కలిగించే వారై పోయారు. ఎలాంటి స్థితిలోఉన్నా, ఈ రెండు విభాగా లకు చెందినవారు బతకడం కోసం ముంబైకి వచ్చారు. బహుశా మొట్టమొదటిసారిగా, ముంబై నగరం సంక్షోభంలో చిక్కుకున్న వారికి, ఈ సందర్భంలో మర ట్వాడా కరువు బాధితులకు ఆపన్నహస్తాలను అందిం చింది. వీరికోసం ముంబైవాసులు శిబిరాలు నెలకొల్పారు. రాజకీయవాదులు ఆహార ఏర్పాట్లు చేశారు. తగిన స్థాయిలో కొంత పని కల్పించి పారితోషికం ఇచ్చారు. శివసేన మంత్రే దీనికి పూనుకున్నారు. వలస ప్రజలంటేనే ముఖం చిట్లించుకున్న పార్టీ ఇది. మహారాష్ట్రలోని మరట్వాడా ప్రాంత సంక్షోభం ఎంత తీవ్రమైనదంటే, తమ గణపతిని దర్శించుకున్న సందర్శ కుల నుంచి నగదు వసూలు చేసిన ప్రజలు, దాన్ని నానా పటేకర్ స్థాపించిన ‘నామ్ ఫౌండేషన్’కు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. సంక్షోభం పొంచుకుని ఉందని వారికి తెలుసు. తమ శక్తిమేరకు ఎంత సహాయపడినప్పటికీ, ఇది సహృదయంతో చేసిన ప్రయత్నం. కానీ సంక్షోభం చుట్టు ముట్టిన ప్రాంతంలో నివాసముంటున్న వారికి కూడా ఏం జరగనుందో తెలుసు. అయితే గత నెల చివరి వరకు వారి లో ఎక్కువమంది ఆశాభావంతో అక్కడే ఉండిపోయారు. తాము కూడా స్వయంగా గతంలో వలస వచ్చినవారే కావచ్చు కానీ మానవ వలసల పట్ల గతంలో అయిష్టత ప్రదర్శించిన వారిని ప్రస్తుతం మానవతా దృక్పథం కదిలిస్తున్నట్లు కనిపిస్తోంది. దానికి మరో కారణం.. ఇప్పుడు వలస వస్తున్న వారు రాష్ట్రంలోని వారైనందువల్లే కావచ్చు. మరట్వాడాతో సమానంగా సంక్షోభాన్ని చవిచూసిన బుందేల్‌ఖండ్ నుంచి మునుపట్లో ముంబైకి వలసలు రాలేదని చెప్పలేం. వీరు ముంబైకి వచ్చి స్థిరపడ్డారు కూడా. వీరు చడీచప్పుడు లేకుండా ఇటీవలే వచ్చి అప్పటికే ఉన్న తమ ప్రాంత వాసులతో కలిసిపోయి ఉండవచ్చు. ఇలా వచ్చిన వారి వాస్తవ సంఖ్య తెలీదు. స్వస్థలంలో నెలకొన్న దుస్థితి నుంచి తప్పించుకోవడానికి ఉద్దేశ పూర్వకంగా ప్రజలు తరలి వస్తున్నప్పుడు ఇలాంటివారి సంఖ్యను లెక్కించడం దాదాపుగా సాధ్యం కాదు. కానీ గుర్తించవలసింది ఏమిటంటే ముంబై వీరిని అతిథులుగా చూస్తోంది. ఏదేని కారణం వల్ల తన ఇంటిని ఉపయోగించుకోని స్థితిలో మీ పొరుగునున్న వ్యక్తి మీ ఇంటిలో ఆశ్రయం పొందినట్లుగానే ఇది కనిపిస్తోంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తను మళ్లీ వెనక్కు వెళ్లిపోవచ్చు. కాని అతడు శరణార్థే. యూరప్‌వైపు సిరియన్లు వెళుతున్నట్లుగా కాకుండా, తాత్కాలికంగా మాత్రమే ఇతడు శరణార్థిగా ఉంటున్నాడు. ప్రస్తుతానికి మాత్రం వలస వస్తున్నవారి పట్ల నగరం దృక్కోణం ఆశాజనకంగానే కనిపిస్తోంది. నగర మేయర్ స్నేహల్ అంబేకర్ వలస ప్రజలకు మద్దతుగా తమ వేతనాలలో కొంత బాగాన్ని కేటాయించవలసిందిగా నగర వాసులను కోరినట్లు చెప్పారు. కానీ నగర రూపురేఖలను వికారం చేస్తున్న కారణంగా మురికివాడలంటే ముఖం చిట్లించుకునే సమాజంలోని ఒక సెక్షన్ నుంచి ఈ మద్దతు రావలసి ఉంది. అయితే ఇక్కడ కూడా ఓటర్లు కనబడుతుంటారు కాబట్టి వీరు మురికివాడల్లోని ప్రజలను రహస్యంగా ప్రోత్సహిస్తూ వారిని చట్టబద్ధం చేస్తుంటారు. వలస ప్రజలు నగరాలకు తరలి వెళుతుంటారు. అన్ని పెద్ద నగరాల కంటే ముంబై సహజ అయస్కాంతంలాగా మంచి అవకాశాలను అందించేదిగా ఆకర్షిస్తుంటుంది. అయితే పుణే వంటి ఇతర నగరాలు కూడా వలస ప్రజలతో నిండిపోయినట్లు వార్తలు సూచిస్తున్నాయి. ఎందుకంటే తీవ్రమైన నీటి ఎద్దడితో గ్రామీణ ఆర్థికవ్యవస్థ కృశించి పోయింది. రాష్ట్రం వెలుపల నుంచి గత కొద్ది సంవత్సరాలుగా లాతూర్ కూడా వలసలను ఆకర్షించేది కానీ ఇక్కడి స్థానికుల్లో కొందరైనా ఇప్పుడు బయటకు వెళ్లడానికి ప్రాధాన్యమిస్తున్నారు. వలస ప్రజలు రెండు రకాలు. ఒకరు నియామక పత్రాలతో వచ్చేవారు. వీరికి వస్తూనే అద్దె గృహాలు కూడా దొరికే అవకాశముంది. రెండు. ఏదో ఒక మంచి జరుగుతుందనే ఆశతో తక్కువ వేతనాలున్న అసంఘటిత రంగం నుంచి ఎక్కువగా నగరంలోకి వచ్చిపడ్డవారు. ఇలాంటివారికి తోటి గ్రామస్థుడిలాగా తాత్కాలిక వసతి ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. అలా వసతి దొరికితే వీరికి అక్కడ జీవనం సాధ్యపడుతుంది. వీరు చాలా వరకు నైపుణ్యం లేనివారు. ఈ రెండో విభాగంలోని వ్యక్తి శరణార్థే. ఎందుకంటే కొన్ని ఎకరాల భూమిని కలిగి ఉన్నప్పటికీ బతకడానికి తగిన పంటలను అది ఇవ్వనందున ఆర్థిక కారణాల వల్లే ఇతడు ఇల్లు వదిలి వస్తున్నాడు. రోజువారీ ప్రాతిపదికన పనిచేస్తూ ఇతడు చివరికి మురికివాడలో తేలతాడు. ఒక పని తర్వాత మరొక పనికి మారుతూ, ఒక మురికివాడ నుంచి మరొక దానికి కూడా మారుతూ ఉంటాడు. వీరి జీవితాలు వీలైనంత అనిశ్చితంగానే ఉంటాయి. మురికివాడల్లో నివసించని వారు ఇలాంటివారిని ఉపయోగించుకుంటూ ఉంటారు కానీ వారిని ఏ మాత్రం పట్టించుకోరు. వర్షాలు కురిస్తేనే వీరందరూ లేదా వీరిలో చాలామంది తమ స్వస్థలాలకు మరలుతారని మనకు తెలుసు. ఇది వ్యవసాయంపై వారికి కుదిరే నమ్మకం, ఆర్థిక వ్యవస్థ మునుపటి స్థాయికి చేరుకోవడంపైనే ఆధారపడి ఉంటుంది. వెనక్కు వెళ్లడానికి ఏదైనా ఉపాధిని వారు కనుగొన్నట్లయితే, మరొక తక్షణ విపత్తుకు వ్యతిరేకంగా దాన్ని ఒక బీమాలాగా ఉపయోగించుకోవడానికి వీలైనట్లయితేనే ఇది జరుగు తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అలాంటి రక్షణకు తగు హామీ ఇవ్వలేనంతగా గిడసబారిపోయింది. గ్రామాల్లో భూములు కలిగిన ప్రజలు ముంబైలోని నూతన భవనాల్లోని నేలను చదును చేస్తుండటం కొత్త కాదు. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు - మహేష్ విజాపుర్కార్ ఈమెయిల్: mvijapurkar@gmail.com -
అవినీతిపై ‘న్యాయ’ యుద్ధం
అధికార స్థానాల్లో ఉన్న నీతి నియమాలు లేని వ్యక్తులు డబ్బును కొల్లగొడుతున్నారు. నీతులు, ధర్మాలు వెనుక సీట్లోకి వెళ్లిపోయాయి. చివరికి కొల్లగొట్టేవారి కోసమే మనం పన్నులు చెల్లిస్తున్నామా? ప్రభుత్వం అవినీతి భూతాన్ని నియంత్రించ లేనట్లయితే, పన్నుల చెల్లింపునకు వ్యతిరేకంగా పౌరులు సహాయ నిరాకరణ ప్రారంభించా లని బాంబే హైకోర్టుకు చెందిన నాగపూర్ బెంచ్ న్యాయమూర్తి అరుణ్ చౌదరి గత వారం పేర్కొన్న ట్లు ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదించింది. న్యాయమూర్తి సలహా మాత్రమే ఇచ్చి ఉంటే అది చర్చనీయాంశమయ్యేది. కానీ అది నిశ్చితంగా న్యాయమూర్తి వివేచన పెట్టిన ధర్మాక్రోశం. దళిత డయాస్పొరాకు చెందిన ఒక విభాగమైన మాతంగ సామాజిక వర్గం హక్కులను సముద్ధరిం చాలని ఆదేశించిన నేపథ్యంలో, మహారాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ నుంచి నిధుల దుర్వినియోగ కేసులో ఒక నిందితుడు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చిన సందర్భంగా న్యాయమూర్తి చౌదరి ఈ వ్యాఖ్యలు చేశారు. మహా రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని జడ్జి ఈ వ్యాఖ్యను చేసినప్పటికీ, దేశంలోని అన్ని రాష్ట్రాలకు, చివరకు కేంద్రానికి కూడా ఈ వ్యాఖ్యలు వర్తిస్తాయి. వీటిలో అవినీతికి ఏవీ దూరంగా లేవు. పన్ను చెల్లింపుదారుల తీవ్ర వేదనను, ఆరాటాన్ని ప్రభుత్వం, అధికారులు అర్థం చేసుకో వాలని న్యాయమూర్తి చెప్పారు. కీలక స్థానాల్లో ఉన్నవారు అవినీతిని నిరోధించే లక్ష్యంతోటే పనిచేయాలి. దాన్ని పౌరుల ‘నిస్సహాయ’ ఆశగా మాత్రమే ఉండేలా చేయవద్దు. అధికార స్థానాల్లో ఉన్న నీతి నియమాలు లేని వ్యక్తులు డబ్బును కొల్లగొడుతున్నారు. నీతులు, ధర్మాలు వెనుక సీట్లోకి వెళ్లిపోయాయి. చివరికి కొల్లగొట్టేవారి కోసమే మనం పన్నులు చెల్లిస్తున్నామా? అవినీతి డబ్బులో తమ వాటాకోసం చూస్తున్న వారితో చేతులు కలుపుతూ ప్రజాజీవితంలో నీతిని వదిలివేసిన వారినుంచే కాకుండా... అవినీతికి, ప్రభుత్వ రాబడులకు మధ్య నెలకొంటున్న ఆసక్తికరమైన లింకును కూడా నేను చూస్తున్నాను. ఏదేమైనా అవినీతికి రెండు ముఖాలు. ఒకరేమో చేయకూడని పనులను చేస్తూ ఒక ప్రభుత్వం, దాని శాసనాల లక్ష్యాన్నే ధ్వసం చేసేవారు కాగా, మరొకరు ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులను ఎగ్గొట్టడానికి ముడుపులు చెల్లించేవారు. ఇక్కడ చిన్న ఉదాహరణ; లంచం తీసుకునే కానిస్టేబుల్... జరిమానాల ద్వారా వచ్చే బకాయిలను ప్రభుత్వానికి రానివ్వకుండా చేస్తుంటాడు. ముడుపుల కంటే జరిమానాల మొత్తం అధికంగా ఉంటుంది. లేదా, ఇసుక తవ్వకం కోసం నదులను చట్టవిరుద్ధంగా తవ్వేయడానికి అనుమతించడం. ఇది ప్రభుత్వ రాబడిని మాత్రమే కాకుండా ఉమ్మడి సహజ వనరులను కూడా కొల్లగొడుతుంది. లేదా టెలికాం రంగంలో 2జి స్పెక్ట్రమ్‌లో రావలసిన రాబడి బకాయిలను కొల్లగొట్టడం లేక నాసిరకంగా నిర్వహించే మునిసిపాలిటీ రోడ్లకు అదనపు బిల్లులను దండుకోవడం కూడా ఈ కోవకే చెందుతాయి. అంతిమ విశ్లేషణలో ప్రభుత్వం రాబడుల పరంగా కునారిల్లిపోతుండగా, కొద్ది మంది పరిమా ణం మాత్రం వాస్తవానికి రాన్రానూ పెరిగిపోతోంది. ఎందుకంటే, ఇప్పుడు అవినీతి ఒక మినహాయింపు గా కాకుండా నిత్య వ్యవహారం అయిపోయింది. 6వ పే ప్యానెల్ స్కేల్ అమలులో ఉన్నప్పటికీ, పెన్షనర్ల జేబుకు ఎలా చిల్లు పెట్టాలా అనే విషయం తప్ప మరేదీ ఆలోచించని పెన్షన్ ఆఫీసులోని మురికివ్యక్తి, ఇప్పుడు 7వ పే కమిషన్ సిఫార్సుల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తుంటాడు. మహారాష్ట్ర రోడ్ రవాణా శాఖలోనే ఒక సంవత్సరంలో ప్రభుత్వానికి రావలసిన దాదాపు రూ.900 కోట్ల ఆదాయాన్ని లంచగొండులు కొల్లగొడుతున్నారని ఒక అధికారి నాతో స్వయంగా చెప్పారు. ఈ లెక్కన ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఎంత రాబడిని కోల్పోతుందో ఊహించుకోవచ్చు. ఇక్కడ ప్రస్తావించిన రూ.900 కోట్లలో ఒక భాగం.. పనులు చేసిపెట్టడానికి చెల్లించవలసిన ఫీజుకింద పోతుంది. ఏదేమైనా ఇలాంటి వ్యవహారాలు మొత్తంగానే ప్రభుత్వానికి రాబడిని దూరం చేస్తున్నాయి. ప్రభుత్వ రాబడికి పడుతున్న ఇలాంటి చిల్లులు సార్వత్రికంగానే జరుగు తున్నప్పటికీ, ద్రవ్యోల్బణం, సామాజిక సంక్షేమం కోసం కొత్త అవసరాల కారణంగా ప్రభుత్వం మరిన్ని పన్నులు విధించాల్సి వస్తోంది. చివరికి నష్టపోయేది పౌరులే మరి. అంటే రాష్ట్ర బడ్జెట్లో ఎప్పుడు కొత్త పన్నులు విధించినప్పటికీ అవన్నీ అవినీతి సూచిక లుగానే భావించాలి. ఉప్పు మీద బ్రిటిష్ ప్రభుత్వం విధించిన పన్ను చాలా ఎక్కువగా ఉన్న కారణంగానే మహాత్మాగాంధీ అప్పట్లో దండి మార్చ్ ప్రారంభిం చారు. అదనపు పన్నులు, అదనంగా కొల్లగొట్టడం పై ప్రభుత్వాలకు ఉన్న నైతిక హక్కే ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. నేను ఆర్థికవేత్తను కానప్పటికీ, ఖర్చుపెడుతున్న ప్రతి వంద రూపాయల్లోనూ 84 రూపాయలకు చిల్లులు పడకుండా మొత్తాన్ని వెచ్చించగలిగేటట్లయితే (రాజీవ్‌గాంధీ ప్రసం గాన్ని గుర్తుకు తెచ్చుకోండి మరి) దేశం మరింత మంచి స్థితిలో ఉండేది. పన్నులు కూడా తగ్గిపోయేవి. జస్టిస్ చౌదరి ధర్మాగ్రహాన్ని, ఆవేదనను నేను అర్థం చేసుకోగలను. ఆయన చట్టంలోని సాంకేతిక అంశాలకు మాత్రమే కట్టుబడకుండా పౌరుల నిస్సహాయ స్థితిని అర్థం చేసుకున్నారు. ఒక మధ్య దళారి అటు లబ్ధిదారును, ఇటు పన్ను చెల్లింపు దారును ఇద్దరినీ కొల్లగొడుతున్న కారణంగా, నేను చెల్లిస్తున్న పన్నులతో కలిగే ప్రయోజనాన్ని మరొకరు ఎందుకు నష్టపోవాలి? అతి తక్కువ ఖర్చుతో లబ్ధిదారులకు అందే ప్రయోజనాల బట్వాడా సామర్థ్యాన్ని నయవంచకులు క్షీణింపచేస్తున్నారు. ఇది పేలవమైన ప్రభుత్వానికి లేదా పాలనా రాహిత్యానికే సూచిక. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్: mvijapurkar@gmail.com - మహేష్ విజాపుర్కార్