అవినీతిపై ‘న్యాయ’ యుద్ధం | Government fails to control the corruption | Sakshi
Sakshi News home page

అవినీతిపై ‘న్యాయ’ యుద్ధం

Published Tue, Feb 9 2016 12:04 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

అవినీతిపై ‘న్యాయ’ యుద్ధం - Sakshi

అవినీతిపై ‘న్యాయ’ యుద్ధం

అధికార స్థానాల్లో ఉన్న నీతి నియమాలు లేని వ్యక్తులు డబ్బును కొల్లగొడుతున్నారు. నీతులు, ధర్మాలు వెనుక సీట్లోకి వెళ్లిపోయాయి. చివరికి కొల్లగొట్టేవారి కోసమే మనం పన్నులు చెల్లిస్తున్నామా?
 
ప్రభుత్వం అవినీతి భూతాన్ని నియంత్రించ లేనట్లయితే, పన్నుల చెల్లింపునకు వ్యతిరేకంగా పౌరులు సహాయ నిరాకరణ ప్రారంభించా లని బాంబే హైకోర్టుకు చెందిన నాగపూర్ బెంచ్ న్యాయమూర్తి అరుణ్ చౌదరి గత వారం పేర్కొన్న ట్లు ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదించింది. న్యాయమూర్తి సలహా మాత్రమే ఇచ్చి ఉంటే అది చర్చనీయాంశమయ్యేది. కానీ అది నిశ్చితంగా న్యాయమూర్తి వివేచన పెట్టిన ధర్మాక్రోశం.
 
 దళిత డయాస్పొరాకు చెందిన ఒక విభాగమైన మాతంగ సామాజిక వర్గం హక్కులను సముద్ధరిం చాలని ఆదేశించిన నేపథ్యంలో, మహారాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ నుంచి నిధుల దుర్వినియోగ కేసులో ఒక నిందితుడు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చిన సందర్భంగా న్యాయమూర్తి చౌదరి ఈ వ్యాఖ్యలు చేశారు. మహా రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని జడ్జి ఈ వ్యాఖ్యను చేసినప్పటికీ, దేశంలోని అన్ని రాష్ట్రాలకు, చివరకు కేంద్రానికి కూడా ఈ వ్యాఖ్యలు వర్తిస్తాయి. వీటిలో అవినీతికి ఏవీ దూరంగా లేవు.
 
 పన్ను చెల్లింపుదారుల తీవ్ర వేదనను, ఆరాటాన్ని ప్రభుత్వం, అధికారులు అర్థం చేసుకో వాలని న్యాయమూర్తి చెప్పారు. కీలక స్థానాల్లో ఉన్నవారు అవినీతిని నిరోధించే లక్ష్యంతోటే పనిచేయాలి. దాన్ని పౌరుల ‘నిస్సహాయ’ ఆశగా మాత్రమే ఉండేలా చేయవద్దు. అధికార స్థానాల్లో ఉన్న నీతి నియమాలు లేని వ్యక్తులు డబ్బును కొల్లగొడుతున్నారు. నీతులు, ధర్మాలు వెనుక సీట్లోకి వెళ్లిపోయాయి. చివరికి కొల్లగొట్టేవారి కోసమే మనం పన్నులు చెల్లిస్తున్నామా? అవినీతి డబ్బులో తమ వాటాకోసం చూస్తున్న వారితో చేతులు కలుపుతూ ప్రజాజీవితంలో నీతిని వదిలివేసిన వారినుంచే కాకుండా... అవినీతికి, ప్రభుత్వ రాబడులకు మధ్య నెలకొంటున్న ఆసక్తికరమైన లింకును కూడా నేను చూస్తున్నాను. ఏదేమైనా అవినీతికి రెండు ముఖాలు. ఒకరేమో చేయకూడని పనులను చేస్తూ ఒక ప్రభుత్వం, దాని శాసనాల లక్ష్యాన్నే ధ్వసం చేసేవారు కాగా, మరొకరు ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులను ఎగ్గొట్టడానికి ముడుపులు చెల్లించేవారు.
 
 ఇక్కడ చిన్న ఉదాహరణ; లంచం తీసుకునే కానిస్టేబుల్... జరిమానాల ద్వారా వచ్చే బకాయిలను ప్రభుత్వానికి రానివ్వకుండా చేస్తుంటాడు. ముడుపుల కంటే జరిమానాల మొత్తం అధికంగా ఉంటుంది. లేదా, ఇసుక తవ్వకం కోసం నదులను చట్టవిరుద్ధంగా తవ్వేయడానికి అనుమతించడం. ఇది ప్రభుత్వ రాబడిని మాత్రమే కాకుండా ఉమ్మడి సహజ వనరులను కూడా కొల్లగొడుతుంది. లేదా టెలికాం రంగంలో 2జి స్పెక్ట్రమ్‌లో రావలసిన రాబడి బకాయిలను కొల్లగొట్టడం లేక నాసిరకంగా నిర్వహించే మునిసిపాలిటీ రోడ్లకు అదనపు బిల్లులను దండుకోవడం కూడా  ఈ కోవకే చెందుతాయి. అంతిమ విశ్లేషణలో ప్రభుత్వం రాబడుల పరంగా కునారిల్లిపోతుండగా, కొద్ది మంది పరిమా ణం మాత్రం వాస్తవానికి రాన్రానూ పెరిగిపోతోంది. ఎందుకంటే, ఇప్పుడు అవినీతి ఒక మినహాయింపు గా కాకుండా నిత్య వ్యవహారం అయిపోయింది.
 
 6వ పే ప్యానెల్ స్కేల్ అమలులో ఉన్నప్పటికీ, పెన్షనర్ల జేబుకు ఎలా చిల్లు పెట్టాలా అనే విషయం తప్ప మరేదీ ఆలోచించని పెన్షన్ ఆఫీసులోని మురికివ్యక్తి, ఇప్పుడు 7వ పే కమిషన్ సిఫార్సుల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తుంటాడు. మహారాష్ట్ర రోడ్ రవాణా శాఖలోనే ఒక సంవత్సరంలో ప్రభుత్వానికి రావలసిన దాదాపు రూ.900 కోట్ల ఆదాయాన్ని లంచగొండులు కొల్లగొడుతున్నారని ఒక అధికారి నాతో స్వయంగా చెప్పారు. ఈ లెక్కన ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఎంత రాబడిని కోల్పోతుందో ఊహించుకోవచ్చు.
 
 ఇక్కడ ప్రస్తావించిన రూ.900 కోట్లలో ఒక భాగం.. పనులు చేసిపెట్టడానికి చెల్లించవలసిన ఫీజుకింద పోతుంది. ఏదేమైనా ఇలాంటి వ్యవహారాలు మొత్తంగానే ప్రభుత్వానికి రాబడిని దూరం చేస్తున్నాయి. ప్రభుత్వ రాబడికి పడుతున్న ఇలాంటి చిల్లులు సార్వత్రికంగానే జరుగు తున్నప్పటికీ, ద్రవ్యోల్బణం, సామాజిక సంక్షేమం కోసం కొత్త అవసరాల కారణంగా ప్రభుత్వం మరిన్ని పన్నులు విధించాల్సి వస్తోంది. చివరికి నష్టపోయేది పౌరులే మరి. అంటే రాష్ట్ర బడ్జెట్‌లో ఎప్పుడు కొత్త పన్నులు విధించినప్పటికీ అవన్నీ అవినీతి సూచిక లుగానే భావించాలి.

 ఉప్పు మీద బ్రిటిష్ ప్రభుత్వం విధించిన పన్ను చాలా ఎక్కువగా ఉన్న కారణంగానే మహాత్మాగాంధీ అప్పట్లో దండి మార్చ్ ప్రారంభిం చారు. అదనపు పన్నులు, అదనంగా కొల్లగొట్టడం పై ప్రభుత్వాలకు ఉన్న నైతిక హక్కే ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. నేను ఆర్థికవేత్తను కానప్పటికీ, ఖర్చుపెడుతున్న ప్రతి వంద రూపాయల్లోనూ 84 రూపాయలకు చిల్లులు పడకుండా మొత్తాన్ని వెచ్చించగలిగేటట్లయితే (రాజీవ్‌గాంధీ ప్రసం గాన్ని గుర్తుకు తెచ్చుకోండి మరి) దేశం మరింత మంచి స్థితిలో ఉండేది. పన్నులు కూడా తగ్గిపోయేవి.
 
జస్టిస్ చౌదరి ధర్మాగ్రహాన్ని, ఆవేదనను నేను అర్థం చేసుకోగలను. ఆయన చట్టంలోని సాంకేతిక అంశాలకు మాత్రమే కట్టుబడకుండా పౌరుల నిస్సహాయ స్థితిని అర్థం చేసుకున్నారు. ఒక మధ్య దళారి అటు లబ్ధిదారును, ఇటు పన్ను చెల్లింపు దారును ఇద్దరినీ కొల్లగొడుతున్న కారణంగా, నేను చెల్లిస్తున్న పన్నులతో కలిగే ప్రయోజనాన్ని మరొకరు ఎందుకు నష్టపోవాలి? అతి తక్కువ ఖర్చుతో లబ్ధిదారులకు అందే ప్రయోజనాల బట్వాడా సామర్థ్యాన్ని నయవంచకులు క్షీణింపచేస్తున్నారు. ఇది పేలవమైన ప్రభుత్వానికి లేదా పాలనా రాహిత్యానికే సూచిక.
 వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
 ఈమెయిల్: mvijapurkar@gmail.com
 - మహేష్ విజాపుర్కార్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement