'ముంబై, బాలీవుడ్ ఇండస్ట్రీకి రుణపడ్డాను'
ముంబై: 'నాకు కొన్ని లక్ష్యాలున్నాయి.. వాటిని సాధించుకునేందుకు చాలా కష్టపడతున్నాను' అని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా వ్యాఖ్యానించారు. ఆమె ఇటీవల హాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. అమెరికన్ టీవీ షో 'క్వింటాకో' ద్వారా ఆమె పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. నా జీవితం అందరి జీవితం లాందిదే.. అందరికి ఉన్నట్లే తనకు కొన్ని లక్ష్యాలున్నాయని చెప్పింది.
వ్యక్తిగతంగా చాలా కష్టపడి మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు జీవితాన్ని సమతూకంలో ఉంచుకోవాలనుకున్నట్లు మాజీ ప్రపంచ సుందరి పేర్కొంది. ఈ మధ్య కో-ప్రొడ్యూసర్ గానూ మారిన విషయాన్ని వివరించింది. మొబైల్ ఆప్ నెక్స్ జీ టీవీ సంస్థతో చేతులు కలిపింది. మరో డిజటల్ నెట్వర్క్ సంస్థతో కలిసి మై సిటీ అనే 14 భాగాలుండే మొబైల్ సిరీస్ లో భాగం పంచుఉన్నట్లు చెప్పుకొచ్చింది.
నలుగురు యువతులు తమ జీవితంలో ప్రతిరోజు ఎదుర్కొనే సమస్యలపై మై సిటీ చేస్తున్నట్లు వివరించింది. ముంబై నగరంలో నివసించే మనికా, సొనాలి, టినా, నిక్కి అనే నాలుగు భిన్న నేపథ్యాల నుంచి వచ్చిన యువతుల గురించి ఈ సిరీస్ తీస్తున్నట్లు తెలిపింది. తనకు ఎంతగానో తోడ్పడిన ముంబై నగరం, బాలీవుడ్ ఇండస్ట్రీకి తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని ప్రియాంక కృతజ్ఞతలు తెలిపింది.