ప్రతి నెల 884 మంది తప్పిపోతున్నారు
ముంబై: భారత వాణిజ్య రాజధాని ముంబైలో నెలకు 884 మంది కనిపించకుండా పోతున్నారు. ఆచూకీ లేకుండా పోతున్నవారిలో ఎక్కువ మంది మైనర్ బాలికలని ప్రభుత్వ గణంకాలు వెల్లడించాయి. గత దశాబ్దకాలంలో తప్పిన పోయినవారిలో చాలా మందిని వెతికి పట్టుకున్నట్టు ముంబై పోలీసులు విడుదల చేసిన గణాంకాలు తెల్పుతున్నాయి.
గత పదిన్నరేళ్ల కాలంలో 1,10,547 మంది తప్పిపోయారని ముంబై పోలీసులు వెల్లడించారు. వీరిలో 1,00,439 మంది ఆచూకీ కనుగొన్నారు. మిగతా 10,108 మంది ఏమయ్యారో కనిపెట్టలేకపోయారు. 2005 జనవరి నుంచి 2015 మే నెల వరకు తప్పిపోయిన వారి వివరాలను పోలీసులు వెల్లడించారు. కనిపించకుండా పోయిన వారిలో 37,603 మంది మహిళలు, 37,202 మంది పురుషులు, 18,547 మంది బాలికలు, 18,547 మంది బాలురు ఉన్నారు.