కోల్‌కతా : అప్పటి వరకు దృఢంగా కనిపించిన ఆ మూడు అంతస్తుల భవనం క్షణాల్లో కనిపించకుండా పోయింది. రెప్పపాటు కాలంలో కుప్పకూలింది. నిబంధనలకు విరుద్ధంగా కాలువకు సమీపంలో నిర్మించడం వల్లే భనవం కూలిపోయిందని అధికారులు చెబుతున్నారు. భవనం నిర్మాణ దశలో ఉండడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లా నిశ్చితంపూర్ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఇటీవల వర్షాలు పోటెత్తడంతో కాలువలో పూడిక ఏర్పడింది. దాన్ని శుభ్రం చేస్తుంగా పక్కనే ఉన్న భవనం పునాది కదిలిపోయి ఒక్కసారిగా కుప్పకూలి కాలువలో పడిపోయింది. నిర్మాణ దశలో ఉండగానే కూలిపోవడంతో భారీ ప్రమాదం తప్పింది.నిజానికి ఈ భవనానికి కొన్ని రోజుల కిందలే పగుళ్లు ఏర్పాడ్డాయని, చెప్పినా పట్టించోలేదని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై భవనం యజమాని స్పందించనప్పటికీ అధికారులు మాత్రం విచారణ ప్రారంభించారు. కాగా, క్షణాల్లో కుప్పకూలిన భవనం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వైరల్ : క్షణాల్లో కుప్పకూలిన బిల్డింగ్
Published Sat, Jun 13 2020 6:03 PM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM
Advertisement
Advertisement
Advertisement