
ప్రతీకాత్మక చిత్రం
కుప్ప కూలిన భవనం వార్త, చూపించవా? అని అడిగి పోర్న్ వీడియోలు..
నడిరోడ్డుపై తనకు ఎదురైన వింత అనుభవాన్ని, ఓ మధ్యవయస్కుడి బిత్తిరి చర్యను గరమ్ సంకత్ అనే మహిళా సోషల్ మీడియా వేదికగా ప్రపంచానికి తెలియజేసారు. గత రాత్రి ఎదురైన ఈ జుగుప్సాకరమైన అనుభవాన్ని వాట్సాప్ స్క్రీన్‌షాట్స్ ద్వారా ముంబైకి చెందిన ఆమె తన ట్విటర్ ఖాతాలో వివరించారు.
‘జనాలు, వాహనాలతో రద్దీగా ఉన్న రోడ్డుపై నడుచుకుంటూ నేను హస్టల్‌కు వెళ్తుండగా 50-60 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి నన్ను ఆపాడు. మొబైల్ ఉందా? అని అడుగుతూ.. డోంగ్రీలో కూలిన భవనానికి సంబంధించిన వార్త, అప్‌డేట్స్ చూపించవా? అని అడిగాడు. అతని కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారోనని చలించిపోయిన నేను.. దానికి సంబంధించిన వార్తను మొబైల్‌లో చూపించాను. కానీ అతను గూగుల్ రిజల్ట్ పేజీ ఓపెన్ చేయమని అడిగాడు. నిర్ఘాంతపోయిన నేను అతను చెప్పినట్టు చేసాను. వెంటనే ఈ మొబైల్‌లో ఏది సెర్చ్ చేసినా వస్తుందా? అని అడిగాడు. అవునని సమాధానమిచ్చాను. అయితే అతను గూగుల్‌వాయిస్ కమాండ్ ఉపయోగించాలని ప్రయత్నించగా అది పనిచేయలేదు. దాన్ని నేను అంతకుముందే డిసేబుల్ చేయడంతో అతని ప్రయత్నం సాధ్యం కాలేదు. అతని తీరుతో చాలా ఇబ్బందిగా ఫీలైన నేను.. నాకు పని ఉంది అంకుల్ త్వరగా వెళ్లాలని చెప్పాను. దానికి అతను ఒక్క నిమిషం అంటూ.. హెచ్‌డీ ఫోన్(పోర్న్) అంటూ నా ఫోన్ తీసుకునే ప్రయత్నం చేయగా.. నేను గట్టిగా పట్టుకున్నాను. అయినా అతను హెచ్‌డీ పోర్న్ అని టైప్ చేయడంతో నేను తీవ్ర ఆగ్రహానికి గురయ్యాను.’ అని చెప్పుకొచ్చారు. అమాయకుడని సాయం చేద్దామనుకుంటే అతను ఇలా ప్రవర్తించాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
I thought he's an old uncle and I should help? Maybe I'm too naive but what the actual fuck. pic.twitter.com/zUBROPjjMk
— garam sankat (@2sanskaari) July 16, 2019
ముంబై డోంగ్రీ ప్రాంతంలోని కేసర్‌బాయి అనే పురాతన భవనం మంగళవారం కుప్పకూలి 14 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.