Brazil Building Collapses Like House Of Cards - Sakshi
Sakshi News home page

బ్రెజిల్లో దారుణం.. కుప్పకూలిన భవనం.. నిద్రలోనే శాశ్వత నిద్రలోకి..

Jul 8 2023 1:42 PM | Updated on Jul 8 2023 1:48 PM

Brazil Building Collapses Like House Of Cards - Sakshi

బ్రెసిలియా: బ్రెజిల్ ఈశాన్య రాష్ట్రమైన పెర్నాంబుకోలో ఓ నాలుగు అంతస్తుల భవనం పేకమేడను తలపిస్తూ క్షణాల వ్యవధిలో నేలకూలింది. భారీ శబ్దం చేస్తూ బిల్డింగ్ నేలకూలిన ఈ వీడియో చూస్తేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. 

ఈ సంఘటన తెల్లవారుజామున జరగడంతో అందులోని వారంతా నిద్రావస్థలో ఉండి ఉంటారని.. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని  అక్కడి అధికారులు తెలిపారు. మృతుల్లో 5 ఏళ్ళు, 8  ఏళ్ళు వయసున్న ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని వారు తెలిపారు. 

శిధిలాల కింద మరింతమంది చిక్కుకుని ఉండవచ్చని, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని.. విపత్తు నిర్వహణ బృందాలు శరవేగంగా శిధిలాలను తొలగించి మిగిలినవారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు స్థానిక అధికారులు. ఇటీవల బ్రెజిల్లో జోరుగా కురిసిన వానలే ఈ ప్రమాదానికి కారణమై ఉంటుందని వారంటున్నారు.      


ఇది కూడా చదవండి: అంతటి బ్రిట్నీ స్పియర్స్ కు ఇంతటి ఘోర అవమానమా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement