Storey residential building
-
భవనం కూలి ఇద్దరు మృతి.. మరొకని పరిస్థితి విషమం!
దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదం చోటు చేసుకుంది. ఒక పురాతన భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈశాన్య ఢిల్లీలోని వెల్కమ్ ప్రాంతంలోని కబీర్ నగర్లో బుధవారం అర్ధరాత్రి 2:16 గంటల సమయంలో నిర్మాణంలో ఉన్న పాత భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన భవనంలో మొదటి అంతస్తులో ఎవరూ నివసించడంలేదు. గ్రౌండ్ ఫ్లోర్లో జీన్స్ కటింగ్ పనులు జరుగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురు కూలీలను పోలీసులు బయటకు తీసుకువచ్చారు. వీరిలోని ఇద్దరు జీటీబీ ఆసుపత్రిలో మృతి చెందారు. ఒక కూలీ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. భవనం యజమాని షాహిద్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. షాహిద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు. #WATCH | Delhi: At around 2:16 am, a call was received regarding the collapse of a two-storey, old construction building in Kabir Nagar, Welcome. Two workers Arshad (30) and Tauhid (20) were declared dead at GTB Hospital while another worker Rehan (22) is critical and is being… pic.twitter.com/2Zjw6WmgMo — ANI (@ANI) March 21, 2024 -
బ్రెజిల్లో పేకమేడలా కూలిన భవనం, 8 మంది మృతి
బ్రెసిలియా: బ్రెజిల్ ఈశాన్య రాష్ట్రమైన పెర్నాంబుకోలో ఓ నాలుగు అంతస్తుల భవనం పేకమేడను తలపిస్తూ క్షణాల వ్యవధిలో నేలకూలింది. భారీ శబ్దం చేస్తూ బిల్డింగ్ నేలకూలిన ఈ వీడియో చూస్తేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఈ సంఘటన తెల్లవారుజామున జరగడంతో అందులోని వారంతా నిద్రావస్థలో ఉండి ఉంటారని.. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అక్కడి అధికారులు తెలిపారు. మృతుల్లో 5 ఏళ్ళు, 8 ఏళ్ళు వయసున్న ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని వారు తెలిపారు. శిధిలాల కింద మరింతమంది చిక్కుకుని ఉండవచ్చని, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని.. విపత్తు నిర్వహణ బృందాలు శరవేగంగా శిధిలాలను తొలగించి మిగిలినవారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు స్థానిక అధికారులు. ఇటీవల బ్రెజిల్లో జోరుగా కురిసిన వానలే ఈ ప్రమాదానికి కారణమై ఉంటుందని వారంటున్నారు. ఇది కూడా చదవండి: అంతటి బ్రిట్నీ స్పియర్స్ కు ఇంతటి ఘోర అవమానమా? 🔴 BRAZIL 🇧🇷| At least 3 residents killed and 15 trapped under the rubble after the collapse of a building in the Janga district, outskirts of the city of #Recife, State of Pernambuco (northeast). The heavy rains of last few days in the coastal city may have caused the accident. pic.twitter.com/DhDBNh6nfU — Nanana365 (@nananamedia365) July 8, 2023 -
ఇలాంటి క్యాచ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్
హనోయి: క్యాచ్ అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది క్రికెట్. బ్యాట్స్‌మెన్ బాదిన బాల్ని క్యాచ్ పట్టడం కోసం మిగతా ఆటగాళ్లంతా దీక్షగా ఎదురు చూస్తుంటారు. అయితే క్రికెట్లో క్యాచ్ పడితే ఔట్ అవుతారు.. కానీ ఇక్కడ ఓ వ్యక్తి పట్టిన క్యాచ్ ఓ ప్రాణాన్ని నిలబెట్టింది. ప్రస్తుతం అతడిని అందరు దేవుడివని పొగుడుతున్నారు. ఇంతకు ఆ వ్యక్తి పట్టిన క్యాచ్ ఏంటి.. అసలు ఏం జరిగింది అంటే ఇది చదవాల్సిందే.. వియాత్నంకు చెందిన న్గుయెన్ న్గోక్ మన్హ్(31) డెలివరీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గత ఆదివారం రాజధాని హనోయ్‌లో ఓ ప్యాకేజీని డెలివరీ చేయడం కోసం ట్రక్కులో కూర్చొని వెయిట్ చేస్తున్నాడు. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో మన్హ్కు చిన్నారి ఏడుపు వినిపించింది. ఎక్కడో పిల్లలు కోపంగా అరుస్తున్నారని భావించాడు మన్హ్. ఇంతలో చుట్టు పక్కల ఉన్న వారు కూడా కేకలు వేయడంతో ఏం జరిగిందోనని కిటికి తెరిచి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు మన్హ్. రెండేళ్ల చిన్నారి ఒకరు 12వ అంతస్తు నుంచి కిందకు పడిపోవడం గమనించాడు. బాలిక అపార్ట్మెంట్ పక్కనే ఉన్న గోడ మీద పడి వేలాడుతూ ఉంది. ఏ మాత్రం ఆలస్యం అయినా చిన్నారి కింద పడిపోయేది. ఈ లోపు చిన్నారి తండ్రి ఆమెను కాపాడటం కోసం రంగంలోకి దిగాడు. అపార్టమెంట్ పక్కన ఉన్న గోడ దూకి బిడ్డను కాపాడాలని ప్రయత్నించాడు. అయితే అదృష్టం కొద్ది బాలిక వెళాడుతున్న గోడ పక్కనే మన్హ్ ట్రక్కులో కూర్చొని ఉన్నాడు. ఒక్కసారిగా అక్కడ జరగబోయే దారుణాన్ని ఊహించుకుని వెంటనే అప్రమత్తమయ్యాడు. ఎంతో చాకచక్యంగా చిన్నారిని ఒడిసి పట్టుకున్నాడు. ఆ తర్వాత బాలికను తల్లిదండ్రులకు అప్పగించాడు. వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలించగా.. ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు కానీ నడుము కొంచెం పక్కకు జరిగిందని తెలిపారు వైద్యులు. ప్రస్తుతం చిన్నారికి వైద్యం అందిస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. హీరో, సూపర్ మ్యాన్ అంటూ మన్హ్ని ప్రశంసిస్తున్నారు వియాత్నం ప్రజలు, నెటిజనులు. సదరు చిన్నారి తన ఇంటి బాల్కనీలో ఆడుకుంటూ పట్టుతప్పి కింద పడిపోయింది. అదృష్టం బాగుండటంతో ప్రాణాపాయం తప్పింది. 😱¡HEROICA ATRAPADA!👏 Un repartidor le salvó la vida a una niña de 3 años que cayó del piso 12 de un edificio en Vietnam. La nena sufrió fracturas en la pierna y en los brazos, pero está viva gracias a la heroica acción de Nguyen Ngoc Manh❤️, quien sufrió un esguince.#VIRAL pic.twitter.com/eI03quT0IM — Unicanal (@Unicanal) March 1, 2021 చదవండి: 17 ఏళ్లకే ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు, కానీ ఇప్పుడు ఆ క్యాచ్ చూస్తే ఔరా అనాల్సిందే.. -
రియల్ స్పైడర్ మ్యాన్.. వీడియో వైరల్
పారిస్: స్పైడర్ మ్యాన్ సిరీస్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనంత మంది అభిమానులు. హీరో చేతులతోనే పెద్ద పెద్ద భవంతులను ఎక్కడం.. ట్రైన్లు వంటి వాటిని ఆపుతూ ప్రజలను కాపాడటం వంటి సాహసాలు చేస్తాడు. ఇక స్పైడర్ మ్యాన్ అంటే పిల్లల్లో ఉండే క్రేజు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా టాపిక్ ఎందుకు వచ్చిందంటే.. ఓ యూ ట్యూబర్ 58 అంతస్తుల భవంతిని చకాచకా చేతులతోనే ఎక్కేశాడు. అది కూడా గంట వ్యవధిలోనే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. రియల్ స్పైడర్ మ్యాన్ అంటూ నెటిజనులు సదరు యూట్యూబర్‌ని ప్రశంసిస్తున్నారు. వివరాలు.. అథ్లెట్ లియో అర్బన్ శనివారం ఎలాంటి భద్రతా సామాగ్రి లేకుండా కేవలం తన చేతులతోనే పారిస్ మోంట్‌పార్నాస్సేలోని ఆకాశహర్య్యాన్ని ఎక్కాడు. 58 అంతస్తుల భవనాన్ని అర్బన్ ఒక గంటలోపే ఎంతో సులువుగా అధిరోహించాడు. అతడు ఈ సాహసోపేతమైన ఫీట్‌ని వేలాది మంది ప్రజలు, వీలేకరులు ప్రత్యక్షంగా చూడటమే కాక వీడియోలు కూడా తీశారు. (చదవండి: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ట్రక్ దూసుకెళ్లినా బతికింది) అర్బన్ గతంలో ఈఫిల్ టవర్, టూర్ టీ1, అరియాన్ ఆకాశహర్మ్యాలు ఎక్కాడు. ఇక తాజాగా ఫ్రెంచ్ రాజధాని పారిస్‌లో 210 మీటర్ల (690 అడుగులు) ఎత్తైన భవనం పైకి ఎక్కిన చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫీట్ చేయడానికి ముందు తాను ఎన్నో వారాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నానని.. తన జీవితంలో అత్యంత క్లిష్టమైన ఫీటు ఇదేనని తెలిపాడు అర్బన్. -
అన్నీ అతిక్రమణలే...
సీతారాంబాగ్ అగ్నిప్రమాదం ఘటనలో వెలుగుచూస్తున్న నిజాలు అనుమతి జీప్లస్ 1కు... నిర్మించింది జీ ప్లస్ 4 అంతస్తులు నివాస భవనంలో వాణిజ్య కార్యకలాపాలు {పమాదాలు జరిగినప్పుడే అధికారుల హెచ్చరికలు.. ఆపై షరా మామూలే... సిటీబ్యూరో: అనుమతి తీసుకున్నది జీ ప్లస్ 1 నివాస గృహానికి...నిర్మాణం జరిపింది జీ ప్లస్ 4 అంతస్తులు. నిర్వహిస్తున్నది వాణిజ్య కార్యకలాపాలు(ప్లాస్టిక్ సామాన్ల గోదాము). ఇందుకు ట్రేడ్‌లెసైన్సు తీసుకున్నారా అంటే అదీ లేదు. ఇవీ ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగి కుప్పకూలిపోయిన సీతారాంబాగ్‌లోని భవనానికి సంబంధించిన వివరాలు. నగరంలో విచ్చలవిడిగా జరుగుతున్న అక్రమ నిర్మాణాలకు ఇదో ఉదాహరణ. అంతేకాదు.. అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయకుండా కోర్టునుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. స్టే ఆర్డర్‌ను సైతం ఉల్లంఘించి నాలుగంతస్తులు నిర్మించారు. భారీ అగ్నిప్రమాదంతో ఆరా తీస్తే ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. లేని పక్షంలో వివరాలే తెలిసేవి కావు. ఇలాంటి అక్రమ నిర్మాణాలు నగరంలో అడుగడుగునా ఎన్నెన్నో. అయినప్పటికీ జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. మరోవైపు అక్రమ నిర్మాణాలు కూల్చివేయకుండా కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకోవాల్సిందిగా సలహాలిచ్చేది కూడా జీహెచ్ఎంసీ సిబ్బందేననే ఆరోపణలకు ఊతమిచ్చేదిగా ఉంది ఈ ఘటన. కోర్టు స్టే ఆర్డర్‌ను కూడా ఉల్లంఘించి, అక్రమంగా జీప్లస్ నాలుగంతస్తులు నిర్మించి, దీన్ని క్రమబద్ధీకరించాల్సిందిగా కూడా భవన యజమాని బీఆర్ఎస్ కింద దరఖాస్తు చేసుకున్నారు. ఇలా భవనాలు అగ్నిప్రమాదాల బారిన పడినప్పుడో, లేక నిర్మాణం జరుగుతుండగానే కుప్పకూలినప్పుడు మాత్రమే అక్రమాలను సహించేది లేదని ప్రకటిస్తున్న యంత్రాంగం ఆ తర్వాత మిన్నకుంటోంది. దీంతో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. భవన నిర్మాణం వెనుక... సీతారాంబాగ్‌లో విజయ్‌సింగ్ అనే వ్యక్తి జీప్లస్ 1 అంతస్తుకు 2013లో జీహెచ్ఎంసీ సర్కిల్-7 కార్యాలయం నుంచి అనుమతి పొందారు. అనుమతి పొందిన ప్లాన్‌కు విరుద్ధంగా సెట్‌బ్యాక్స్ ఉల్లంఘలనకు పాల్పడ్డారు. అదనపు అంతస్తుల నిర్మాణాన్ని చేపట్టారు. అక్రమ నిర్మాణాన్ని గుర్తించిన టౌన్‌ప్లానింగ్‌అధికారులు 2014లో నోటీసులు జారీ చేసినప్పటికీ, వాటిని లెక్కచేయకుండా నిర్మాణ పనులు కొనసాగించారని జీహెచ్ఎంసీ కమిషనర్ పేర్కొన్నారు. మొదటి అంతస్తు సెంట్రింగ్ పనులు జరుగుతుండగా అడ్డుకోగా, యజమానితో పాటు స్థానిక నేతల నుంచి ఒత్తిళ్లు వచ్చాయని తెలిపారు. 2014 ఆగస్టు 14న షోకాజ్ నోటీసు జారీ చేశారు. షోకాజ్ నోటీసు అందాక నిర్మాణం ఆపి సిటీ సివిల్కోర్టునాశ్రయించి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. దాంతో అధికారులు తిరిగి దాని వైపు చూడలేదు. స్టే ఆర్డర్ సాకుతో కోర్టు ఉత్తర్వులను సైత ం ఉల్లంఘించి అక్రమంగా భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈకేసు జూనియర్ సివిల్‌కోర్టులో వచ్చే జూలై 5వ తేదీన విచారణకు రానుండగా, తాజాగా జరిగిన అగ్నిప్రమాదంతో వివరాలు వెలుగు చూశాయి. ఇలాంటి అక్రమ భవన నిర్మాణాలు నగరంలో వేలాదిగా ఉన్నాయి. బీఆర్ఎస్కు అందిన దాదాపు 1.40 లక్షల దరఖాస్తులే ఇందుకు నిదర్శనం.