చెన్నైలో 11 అంతస్తుల భవనం కూలిన సంఘటనలో శిథిలాల కింద మరో నాలుగు మృతదేహాలను వెలికితీశారు.
చెన్నై: చెన్నైలో 11 అంతస్తుల భవనం కూలిన సంఘటనలో శిథిలాల కింద మరో నాలుగు మృతదేహాలను వెలికితీశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 22 కు చేరుకుంది. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
చెన్నైలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయిన సంగతి తెలిసిందే. బాధితుల్లో ఎక్కువ మంది తెలుగువారు ఉన్నారు. సంఘటన స్థలాన్ని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, జయలలిత, కాంగ్రెస్ నాయకులు చిరంజీవి, బొత్స సత్యనారాయణ, రామచంద్రయ్య తదితరులు పరిశీలించారు.