Kolkata: కుప్పకూలిన ఐదంతస్తుల భవనం | Sakshi
Sakshi News home page

కోల్‌కతాలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. శిథిలాల కింద పలువురు!

Published Mon, Mar 18 2024 7:55 AM

Kolkata: 5 Storey Building Collapses News Updates - Sakshi

క్రైమ్‌: పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఘోరం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనం ఒకటి కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. పది మందిని ఇప్పటిదాకా రక్షించగలిగారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయక్కడ. 

గార్డెన్‌ రీచ్‌ ఏరియాలోని ఓ కాలనీలో ఆదివారం అర్ధరాత్రి దాటాక నిర్మాణంలో ఉ‍న్న ఐదంతస్తుల భవనం ఒకటి కుప్పకూలింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వాళ్లను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సోమవారం ఉదయం రంగంలోకి దిగిన 50 మంది సభ్యులతో కూడిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ప్రస్తుతం అక్కడ సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

Video Credits: upuknews

Video Credits: NDTV

ఇదిలా ఉంటే.. నిబంధనలకు విరుద్ధంగా ఆ భవన నిర్మాణం సాగుతోందని.. కనీసం మూడు ఫీట్ల వెడల్పు కూడా లేని ఇరుకుగల్లీలో ఈ భవన నిర్మాణం జరుగుతోందని.. ప్రమాదం తర్వాత సహాయక చర్యలు కూడా చాలా ఆలస్యంగా మొదలయ్యాయని మీడియా ముందు స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం ఆ ఆరోపణలను ఖండించారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement